Andhra Pradesh News Today: అప్పుడు తండ్రి, ఇప్పుడు కుమారుడు - శ్రీకాకుళాన్ని రెండుసార్లు వరించిన కేబినెట్ పోస్ట్  కేంద్ర మాజీమంత్రి, దివంగత ఎర్రన్నాయుడి కుమారుడిగా రాజకీయాల్లోకి వచ్చిన రామ్మోహన్‌నాయుడును తాజాగా కేంద్ర మంత్రి పదవి వరించబోతోంది. మోదీ 3.0 కేబినెట్‌లో రామ్మోహన్ నాయుడుకు బెర్తు దక్కడం ఇప్పటికే ఖరారు కాగా.. ఈ సాయంత్రం జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మోదీతో పాటు కేంద్ర మంత్రిగా రామ్మోహన్ నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


బుర్రిపాలెం టు కేంద్రమంత్రి, దేశంలోనే అత్యంత సంపన్న ఎంపీ - పెమ్మసాని ప్రత్యేకతలెన్నో!
2024 సార్వత్రిక ఎన్నికలకు ముందే క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చిన పెమ్మసాని చంద్రశేఖర్‌ గుంటూరు నుంచి టీడీపీ ఎంపీగా భారీ మెజారిటీతో గెలిచారు. ఈయన తొలిసారి ప్రజాక్షేత్రంలోకి అడుగు పెట్టగానే మోదీ 3.0 కేబినెట్‌లో చోటు దక్కింది. పెమ్మసానికి సహాయ మంత్రి పదవితో పాటు, శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడుకు కేంద్ర మంత్రి పదవి ఇవ్వనున్నారు. జూన్ 9న రాత్రి 7 గంటలకు నరేంద్ర మోదీతో పాటు వీరు ఇద్దరు కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


కేంద్ర మంత్రులుగా కిషన్ రెడ్డి, బండి సంజయ్ - రాజకీయ ప్రస్థానం ఇదే!
కేంద్ర మంత్రివర్గంలోకి తెలంగాణ నుంచి ఇద్దరికి చోటు దక్కింది. సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌లకు (Bandi Sanjay) మోదీ కేబినెట్‌లో అవకాశం లభించింది. ఈ మేరకు పీఎంవో నుంచి సమాచారం అందడంతో వారు ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఆదివారం సాయంత్రం 7:15 గంటలకు దేశ ప్రధానిగా మూడోసారి నరేంద్ర మోదీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆయనతో పాటు 30 మంది మంత్రులూ ప్రమాణస్వీకారం చేయనున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


రామోజీరావు అంత్యక్రియలు పూర్తి - ఫ్యామిలీ, ఉద్యోగుల కన్నీటి వీడ్కోలు
తెలుగు మీడియా రంగ దిగ్గజం, వ్యాపారవేత్త, రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీ రావు అంతిమ సంస్కారాలు ముగిశాయి. రామోజీ ఫిల్మ్ సిటీలో తాను నిర్మించుకున్న స్మృతివనంలోనే రామోజీ రావు ఆఖరి క్రతువు ముగిసింది. ఆయన పెద్ద కుమారుడు, ఈనాడు ఎండీ కిరణ్ రామోజీ రావు చితికి నిప్పు అంటించారు. వెంట మనవడు సుజయ్ కూడా ఉన్నారు. రామోజీ రావు భార్య, కోడళ్లు శైలజా కిరణ్, విజయేశ్వరి సహా మనవడు సుజయ్, మనవరాళ్లు సహరి, బృహతి, దివిజ ఇతర కుటుంబ సభ్యులు కన్నీటితో రామోజీరావుకు వీడ్కోలు పలికారు.  పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


దేశ ప్రధానిగా మూడోసారి మోదీ ప్రమాణస్వీకారం - ముఖ్య అతిథులుగా 7 దేశాల అధినేతలు
రాష్ట్రపతి భవన్‌లో నరేంద్ర మోదీ ఆదివారం సాయంత్రం 7:15 గంటలకు భారత దేశ మూడో ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. మోదీతో పాటు 30 మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయా నేతలకు పీఎంవో నుంచి ఫోన్ కాల్స్ చేసి సమాచారం అందించారు. దీంతో వారంతా ఢిల్లీకి బయలుదేరారు. మోదీ ప్రమాణస్వీకారం దృష్ట్యా ఢిల్లీలో కేంద్ర బలగాలు డ్రోన్లతో భద్రతను పర్యవేక్షిస్తున్నాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి