PM Modi Oath Ceremony LIVE: ప్రధానిగా మూడోసారి నరేంద్ర మోదీ ప్రమాణం - కేంద్ర మంత్రులుగా ఐదుగురు తెలుగు ఎంపీలు

PM Modi Oath Taking Ceremony LIVE Updates: దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో ఆదివారం సాయంత్రం 7:15 గంటలకు ఆయన ప్రమాణస్వీకారం చేస్తారు.

Ganesh Guptha Last Updated: 09 Jun 2024 09:54 PM
కేంద్ర మంత్రులుగా ఐదుగురు తెలుగు ఎంపీలు ఎవరంటే..

న్యూఢిల్లీ: కిషన్ రెడ్డి చెప్పినట్లుగానే తెలుగు రాష్ట్రాలకు చెందిన ఐదుగురు ఎంపీలు కేంద్ర మంత్రులు అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి టీడీపీ ఎంపీలు కింజరాపు రామ్మోహన్‌ నాయుడు, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్‌, నరసాపురంలో నెగ్గిన బీజేపీ ఎంపీ శ్రీనివాస శర్మలతో రాష్ట్రపతి ముర్ము కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేయించారు. తెలంగాణ నుంచి ఇద్దరు బీజేపీ ఎంపీలు కిషన్‌రెడ్డి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌.. మోదీ 3.0 కేబినెట్‌లో చోటు దక్కించుకున్నారు. ఈ ప్రమాణ స్వీకార వేడుకకు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, జేడీయూ నేత నితీష్ కుమార్, ఇతర ఎన్డీఏ మిత్రపక్షాలు, ప్రతిపక్ష నేతలు హాజరయ్యారు. వీరితో పాటు వ్యాపార ప్రముఖులు ముఖేష్ అంబానీ, సిని సెలబ్రిటీలు కొందరు మోదీ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు.

PM Modi Cabinet 3.0 Oath Ceremony Live: కేంద్ర మంత్రిగా పెమ్మసాని చంద్రశేఖర్ ప్రమాణం, నెగ్గిన తొలిసారే కేబినెట్ బెర్త్

PM Modi Cabinet 3.0 Oath Ceremony Live:  పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర మంత్రిగా ప్రమాణం చేశారు. రాష్ట్రపతి భవన్ లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ముర్ము గుంటూరు ఎంపీ పెమ్మసానితో ప్రమాణం చేయించారు. ఎంపీగా నెగ్గిన తొలిసారే ప్రధాని మోదీ కేబినెట్ లో చోటు దక్కించుకున్నారు.

PM Modi Cabinet 3.0 Oath Ceremony Live: కేంద్ర మంత్రులుగా చిరాగ్ పాస్వాన్, సీఆర్ పాటిల్, ఇంద్రజీత్ సింగ్ ప్రమాణం

చిరాగ్ పాస్వాన్, సీఆర్ పాటిల్, ఇంద్రజీత్ సింగ్‌లు కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేశారు. రాష్ట్రపతి ముర్ము సీఆర్ పాటిల్, ఇంద్రజీత్ సింగ్‌, చిరాగ్ పాస్వాన్ లతో కేంద్ మంత్రులుగా ప్రమాణం చేయించారు. 

Kishan Reddy Takes Oath As Union Minister: కేంద్ర మంత్రిగా ప్రమాణం చేసిన కిషన్ రెడ్డి, మోదీ 3.0 కేబినెట్‌లో చేరిక

Kishan Reddy Oath Taking Ceremony: మూడోసారి నరేంద్ర మోదీ నేతృత్వంలో మరోసారి ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటైంది. మొదట ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణం చేశారు. అనంతరం కేంద్ర మంత్రులు ఒక్కొక్కరుగా అమిత్ షా, జేపీ నడ్డా, నితిన్ గడ్కరీ, రాజ్‌నాథ్ సింగ్, శివరాజ్ సింగ్ చౌహాన్, నిర్మలా సీతారామన్, తదితరులు ప్రమాణం చేశారు. తెలంగాణకు చెందిన ఎంపీ కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ప్రమాణం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డితో కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు.

PM Modi Cabinet 3.0 Oath Ceremony Live: కేంద్ర మంత్రులుగా ప్రహ్లాద్ జోషి, జువల్ ఓరం, గిరిరాజ్ సింగ్

కేంద్ర మంత్రులుగా జువల్ ఓరం, గిరిరాజ్ సింగ్, ప్రహ్లాద్ జోషి ప్రమాణం చేశారు. రాష్ట్రపతి భవన్ లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ముర్ము ఆ నేతలతో కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేయించారు.

కేంద్ర మంత్రిగా రామ్మోహన్ నాయుడు ప్రమాణం

శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రిగా ప్రమాణం చేశారు. రాష్ట్రపతి భవన్ లో ఆదివారం రాత్రి జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ముర్ము రామ్మోహన్ నాయుడుతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఎన్డీయేకు కీలక మిత్రపక్షమైన టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు (36).. అతి పిన్న వయసు కేంద్ర మంత్రిగా నిలవనున్నారు. 

కేంద్ర మంత్రిగా వీరేంద్ర కుమార్ ప్రమాణ స్వీకారం

PM Modi Cabinet 3.0 Oath Ceremony Live: కేంద్ర మంత్రిగా వీరేంద్రకుమార్ ప్రమాణం చేశారు. ఆయనతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు. 

కేంద్ర మంత్రిగా శర్వానంద సోనోవాల్ ప్రమాణ స్వీకారం

PM Modi Cabinet 3.0 Oath Ceremony Live: కేంద్ర మంత్రిగా అస్సాంకు చెందిన శర్వానంద సోనోవాల్ ప్రమాణం చేశారు. ఆయనతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు. 

కేంద్ర మంత్రిగా లలన్ సింగ్ ప్రమాణ స్వీకారం

PM Modi Cabinet 3.0 Oath Ceremony Live: కేంద్ర మంత్రిగా లలన్ సింగ్ ప్రమాణం చేశారు. ఆయనతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు. 

కేంద్ర మంత్రిగా జితన్ రామ్ మాంఝీ ప్రమాణ స్వీకారం

PM Modi Cabinet 3.0 Oath Ceremony Live: కేంద్ర మంత్రిగా జితన్ రామ్ మాంఝీ ప్రమాణం చేశారు. ఆయనతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు. 2024లో ఈయన గయా లోక్ సభ స్థానం నుంచి గెలుపొందారు.

కేంద్ర మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్ ప్రమాణ స్వీకారం

PM Modi Cabinet 3.0 Oath Ceremony Live: కేంద్ర మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్ ప్రమాణం చేశారు. ఆయనతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు. ఈయన 2010లో బీజేపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. 

కేంద్ర మంత్రిగా పీయూష్ గోయల్ ప్రమాణ స్వీకారం

PM Modi Cabinet 3.0 Oath Ceremony Live: కేంద్ర మంత్రిగా పీయూష్ గోయల్ ప్రమాణం చేశారు. ఆయనతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు. ఆయన మరోసారి కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

కేంద్ర మంత్రిగా కుమారస్వామి ప్రమాణ స్వీకారం

PM Modi Cabinet 3.0 Oath Ceremony Live: కేంద్ర మంత్రిగా కుమారస్వామి ప్రమాణం చేశారు. ఆయనతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు. ఈయన 2024లో ఆరోసారి పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. 

కేంద్ర మంత్రిగా మనోహర్ లాల్ ప్రమాణ స్వీకారం

PM Modi Cabinet 3.0 Oath Ceremony Live: కేంద్ర మంత్రిగా మనోహర్ లాల్ ప్రమాణం చేశారు. ఆయనతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు. ఈయన 2014 నుంచి హర్యానా సీఎంగా చేశారు. ఇప్పుడు కేంద్ర మంత్రిగా ప్రమాణం చేశారు.

కేంద్ర మంత్రిగా జైశంకర్ ప్రమాణ స్వీకారం

PM Modi Cabinet 3.0 Oath Ceremony Live: కేంద్ర మంత్రిగా జైశంకర్ ప్రమాణం చేశారు. ఆయనతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు. ఆయన 2019లో విదేశాంగ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.

కేంద్ర మంత్రిగా నిర్మలా సీతారామణ్ ప్రమాణ స్వీకారం

PM Modi Cabinet 3.0 Oath Ceremony Live: కేంద్ర మంత్రిగా నిర్మలా సీతారామన్ ప్రమాణం చేశారు. ఆయనతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు. 

కేంద్ర మంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రమాణ స్వీకారం

PM Modi Cabinet 3.0 Oath Ceremony Live: కేంద్ర మంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రమాణం చేశారు. ఆయనతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు. ఈయన నాలుగుసార్లు మధ్యప్రదేశ్ సీఎంగా విధులు నిర్వహించారు.

కేంద్ర మంత్రిగా జేపీ నడ్డా ప్రమాణ స్వీకారం

PM Modi Cabinet 3.0 Oath Ceremony Live: కేంద్ర మంత్రిగా జేపీ నడ్డా ప్రమాణం చేశారు. ఆయనతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు.

కేంద్ర మంత్రిగా నితిన్ గడ్కరీ ప్రమాణ స్వీకారం

PM Modi Cabinet 3.0 Oath Ceremony Live: కేంద్ర మంత్రిగా నితిన్ జయరాం గడ్కరీ ప్రమాణం చేశారు. ఆయనతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు.

కేంద్ర మంత్రిగా అమిత్ షా ప్రమాణ స్వీకారం

PM Modi Cabinet 3.0 Oath Ceremony Live: కేంద్ర మంత్రిగా అమిత్ షా ప్రమాణం చేశారు. ఆయనతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు.

కేంద్ర మంత్రిగా రాజ్ నాథ్ సింగ్ ప్రమాణం

PM Modi Cabinet 3.0 Oath Ceremony Live: కేంద్ర మంత్రిగా రాజ్ నాథ్ సింగ్ ప్రమాణం చేశారు. ఆయనతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు.

దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణం - ప్రమాణ పత్రం చదివించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

PM Modi Oath Ceremony Live: భారతదేశ ప్రధానిగా మూడోసారి నరేంద్ర మోదీ ప్రమాణం చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి వివిధ దేశాధినేతలతో పాటు వివిధ రాష్ట్రాల ఎంపీలు, రాజకీయ, సినీ ప్రముఖులు హాజరయ్యారు. 

రాష్ట్రపతి భవన్ చేరుకున్న మోదీ - అతిథులకు అభివాదం

PM Modi Oath Ceremony Live: నరేంద్ర మోదీ రాష్ట్రపతి భవన్ చేరుకున్నారు. ఈ సందర్భంగా అతిథులకు అభివాదం చేశారు. మరికొద్ది క్షణాల్లో ఆయన దేశ ప్రధానిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

మూడోసారి ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం - కోలాహలంగా రాష్ట్రపతి భవన్ ప్రాంగణం

PM Modi Oath Ceremony Live: మరికొద్దిసేపట్లో ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఇప్పటికే వివిధ దేశాధినేతలతో పాటు పలు రాష్ట్రాల ఎంపీలు, రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు హాజరయ్యారు. ఈ క్రమంలో రాష్ట్రపతి భవన్ ప్రాంగణం కోలాహలంగా మారింది. 





ప్రధాని మోదీ తేనీటి విందు - కాబోయే మంత్రులకు కీలక సూచనలు

PM Modi Oath Ceremony Live: ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారానికి అంతా సిద్ధమైంది. ఈ క్రమంలో కాబోయే కేంద్ర మంత్రులకు ఆయన తేనీటి విందు ఇచ్చారు. కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణమే బాధ్యతలపై దృష్టి సారించాలని.. దేశాభివృద్ధి కోసం చేపట్టిన ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసేలా పని చేయాలని దిశా నిర్దేశం చేశారు.

ప్రధానిగా మోదీ ప్రమాణస్వీకారం - కాంగ్రెస్ నుంచి ఎవరు హాజరవుతున్నారంటే.?

PM Modi Oath Ceremony LIVE: దేశ ప్రధానిగా మూడోసారి నరేంద్ర మోదీ ఆదివారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నుంచి మల్లికార్జున ఖర్గే హాజరుకానున్నారు. ఈ విషయాన్ని హస్తం పార్టీ ఓ ప్రకటనలో వెల్లడించింది. I.N.D.I.A కూటమిలోని కీలక నేతలతో సుదీర్ఘ చర్చల అనంతరం కాంగ్రెస్ ఈ నిర్ణయానికి వచ్చింది. అటు, తృణమూల్ కాంగ్రెస్ ఈ కార్యక్రమానికి హాజరు కావడం లేదు.

ఢిల్లీకి కిషన్ రెడ్డి, బండి సంజయ్

కేంద్ర మంత్రులుగా తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లకు అవకాశం లభించింది. పీఎంవో నుంచి కాల్ రావడంతో వారు ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.

ఆదివారం సాయంత్రం 7:15 గంటలకు మోదీ ప్రమాణస్వీకారం

ఆదివారం సాయంత్రం 7:15 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో నరేంద్ర మోదీ భారత దేశ మూడో ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు 30 మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయా నేతలకు పీఎంవో నుంచి ఫోన్ కాల్స్ వెళ్లాయి. దీంతో వారంతా ఢిల్లీకి బయలుదేరారు. మోదీ ప్రమాణస్వీకారం దృష్ట్యా ఢిల్లీలో హైఅలర్ట్ ప్రకటించారు. కేంద్ర బలగాలు డ్రోన్లతో భద్రతను పర్యవేక్షిస్తున్నాయి.

Background

PM Modi Oath Ceremony LIVE Updates: దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఆదివారం సాయంత్రం 7:15 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు. మోదీతో పాటు పలువురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నెహ్రూ తరవాత వరుసగా మూడోసారి ప్రధాని బాధ్యతలు చేపట్టిన నేతగా నరేంద్ర మోదీ రికార్డు సృష్టించనున్నారు. ప్రమాణస్వీకారానికి ముందు మోదీ రాజ్ ఘాట్‌ను సందర్శించి మహాత్మాగాంధీకి నివాళి అర్పించారు. అనంతరం మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీకి శ్రద్ధాంజలి ఘటించారు. మోదీ ప్రమాణస్వీకారానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఢిల్లీ వ్యాప్తంగా హై అలెర్ట్ ప్రకటించారు. విదేశాధినేతలు ఉండే హోటళ్ల వద్దా సెక్యూరిటీ పెంచారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సాయంతో ఫేషియల్ రికగ్నిషన్‌ చేయనున్నారు. ఆ మేరకు భద్రతా వలయాన్ని మరింత పెంచారు. ఈ కార్యక్రమానికి ఎన్జీయే కూటమి ఎంపీలు సహా టీడీపీ అధినేత చంద్రబాబు సహా ఇతర రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు.


ప్రధాని నరేంద్ర మోదీతో పాటు దాదాపు 30 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారని విశ్వసనీయ వర్గాల సమాచారం. కేబినెట్‌లో కీలక మంత్రిత్వ శాఖలన్నీ బీజేపీ వద్దే ఉన్నాయి. హోం మంత్రిగా అమిత్‌ షా, రక్షణశాఖ మంత్రిగా రాజ్‌నాథ్ సింగ్, రోడ్డు రవాణా శాఖ మంత్రిగా నితిన్ గడ్కరీ కొనసాగనున్నారు. వాళ్ల మంత్రిత్వ శాఖల్లో ఎలాంటి మార్పులూ చేయలేదు. దాదాపు 45 నిమిషాల పాటు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.