జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వారంలో ఒక్కో రోజుకి ఒక్కో గ్రహం అధిపతి. అందుకే ఆ రోజులపై ఆ గ్రహాల ప్రభావం తప్పనిసరిగా ఉంటుంది. అందుకే కొన్ని రోజుల్లో కొత్తగా ప్రారంభించే కార్యక్రమాలు అనుకోకుండా సక్సెస్ అవుతాయి..ఎన్నో ప్రణాళికలు వేసుకుని చేసే పనులు కొన్నిసార్లు మంచి ఫలితం ఇవ్వవు. ఇదంతా ఆ రోజుల్లో గ్రహాధిపత్యమే అంటారు జ్యోతిష్యులు. మరి ఏ రోజు ఏం చేయాలి...అనుభవజ్ఞులైన పండితులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం...
సోమవారం
ఈ రోజుకి అధిపతి చంద్రుడు...చంద్రుడిని మనఃకారకుడు అంటారు అంటే మనస్సుని అదుపుచేసేవాడని అర్థం. అందుకే ఎలాంటి తడబాటు లేకుండా, సంకోచం ఉండకుండా ఠక్కున పూర్తవ్వాలి అనుకునే పనులకు సోమవారం కలిసొస్తుంది. అప్పటికప్పుడు అయ్యే పనులకు సోమవారం ఎంపిక చేసుకోవడం బెస్ట్. చిన్న చిన్న పార్టీలు, ఇంటి అలంకరణ, షాపింగ్ లాంటివాటికి సోమవారం మంచిది. ఉద్యోగం, వ్యాపారం లాంటి దీర్ఘకాలిక పనులకు సోమవారం అంత మంచిది కాదంటున్నారు జ్యోతిష్యశాస్త్ర పండితులు. తారాబలం బావుంటే బాగానే కలిసొస్తుంది..
Also Read: ఈ వారం ఈ రాశుల రాజకీయ నాయకులకు అద్భుతంగా ఉంది - మంచి పదవులు దక్కుతాయి - జూన్ 10 to 16 వారఫలాలు
మంగళవారం
మంగళవారానికి అధిపతి మంగళుడు (కుజుడు). కుజుడికి ఆగ్రహం చాలా ఎక్కువ. అందుకే ఈ రోజు పెద్ద పెద్ద లావాదేవీలు, కోర్టు వ్యవహారాలు, తాగాదాల పరిష్కారాలు, లేనిపోని గొడవల జోలికి వెళ్లకూడదు. అనవసర వాదనలు పెట్టుకోకుండా ఉండండ మరింత మంచిది. అయితే యంత్రాలు పరికరాలు రిపేర్ కి కొనుగోలుకి, ఆరోగ్యానికి సంబంధించిన వాటికి ఈ రోజు అనుకూలం అని చెబుతారు...
బుధవారం
బుధవారానికి అధిపతి బుధుడు. తెలివితేటలకు అధిపతిగా చెప్పే బుధుడి అనుగ్రహం ఉంటే మీరు ఏ రంగంలో అయినా రాణిస్తారు. అందుకే కొత్తగా ఏదైనా కోర్సులో చేరాలన్నా, కళలు నేర్చుకోవాలన్నా, నూతన పెట్టుబడులు పెట్టాలన్నా బుధవారం మంచిది.
గురువారం
ఈ రోజుకి అధిపతి దేవతల గురువైన బృహస్పతి. ఈ రోజు ఏ కార్యానికైనా అనుకూలమే. ఈ రోజు ఏ పని ప్రారంభించినా మంచి జరుగుతుందని నమ్మకం. ముఖ్యంగా చదువు , వ్యాపారం, పెళ్లి పనులు, ఆభరణాల కొనుగోలు, ఆస్తులపై పెట్టుబడులకు ఈ రోజు మంచిది. కోర్డు వ్యవహారాలకు కూడా ఈ రోజు కలిసొస్తుంది...
Also Read: శుక్రుడి రాశిపరివర్తనం - జూలై 12 నుంచి మేషం , సింహం సహా ఈ 6 రాశులవారికి ఐశ్వర్యం, ఆనందం, పదోన్నతి!
శుక్రవారం
ఈ వారానికి అధిపతి శుక్రుడు. శుక్రుడిని అందానికి, సుఖానికి, విలాసాలకి అధిపతిగా చెబుతారు. అందుకే జాకతంలో శుక్రుడి సంచారం బావుంటే ఆ వ్యక్తి మహారాజభోగం అనుభవిస్తాడని చెబుతారు. సంతోషమైన సమయం గడిపేందుకు ఈ రోజు అత్యుత్తం...అది కుటుంబంతో అయినా స్నేహితులతో అయినా. కళారంగానికి సంబంధించిన అవకాశాలు వెతుక్కునేందుకు కూడా శుక్రవారం కలిసొస్తుంది..
శనివారం
శనిని మందరుడు అంటారు..మందరుడు అంటే నెమ్మదిగా సంచరించేవాడని అర్థం. ప్రతి గ్రహం నెలకోరాశిమారిపోతే..రాహు , కేతువులు ఏడాదికోసారి రాశిపరివర్తనం చెందుతాయి. ఇక శని అయితే ఏకంగా రెండున్నరేళ్లకోసారి రాశి మారుతాడు. అంత నెమ్మదిగా సంచరించే శనికి ప్రీతికరమైన శనివారం రోజు...దీర్ఘకాలంగా కొనసాగే పనులు చేయడం మంచిది. అంటే...ఇల్లు, ఉద్యోగం, వ్యాపారం, దాన ధర్మాలు లాంటివాటికి శనివారం అత్యుత్తమం.
Also Read: షష్ఠి తిథిలో ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం - ఈ తిథి మంచిదేనా , తారాబలమే ప్రధానమా!
ఆదివారం
ఆదివారానికి అధిపతి ఆదిత్యుడు. ఆయురారోగ్యాలను ప్రసాదించే సూర్యభగవానుడు జ్ఞానాన్నీ, గౌరవాన్నీ, పదవులనీ కూడా అందిస్తాడు. అందుకే కొత్తగా ఏదైనా నేర్చుకోవాలన్నా ... రాజకీయాల్లో ప్రవేశించాలన్నా, ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ప్రయత్నాలు చేసినా ఆదివారం మంచిది.