Chandrababu Taking The Oath on 12th June:  ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించింది కూటమి. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేసేందుకు ముహూర్తం నిర్ణయించారు. జూన్ 12 బుధవారం షష్ఠి తిథిరోజు ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. అమరావతి వేదికగా కార్యక్రమం జరుగుతుందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నారు. అయితే ఏ పని కొత్తగా ప్రారంభించినా ముందుగా మంచిరోజు , మంచి ముహూర్తం చూసుకునే అలవాటు చాలామందికి ఉంటుంది. అలాంటిది ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోవడం అంటే చిన్న విషయం కాదు. ఊహించని స్థాయిలో ఘనవిజయం అందించిన ప్రజలకు ఐదేళ్లపాటూ మంచి చేయాలన్నా...ఐదేళ్లపాటూ ఎలాంటి అడ్డంకులు లేకుండా పాలన సాగించాలన్నా... మరోసారి అధికారంలోకి రావాలన్నా ప్రమాణస్వీకారం చేసే ముహూర్తం అద్భుతంగా ఉండాలి.


Also Read: ఈ తిథి రోజు ఏం చేసినా విజయమే.. కానీ, ఆ తిథుల్లో చేసే పనులు కష్టాలు తెచ్చిపెడతాయ్!


జూన్ 9 నుంచి 12 కి మారిన తేదీ


ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు... చంద్రబాబు జూన్ 9 ఆదివారం తదియ తిథిలో శ్రీరామచంద్రుడి జన్మనక్షత్రం అయిన పునర్వసు తిథిలో ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రకటించారు. ముహూర్తం కూడా 11 గంటల 57 నిముషాల సమయంలో నిర్ణయించారు...అంటే రాముడి పట్టాభిషేకం, కళ్యాణం జరిగిన తిథి, సమయం కాబట్టి... ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని...చంద్రబాబు పాలన విజయవంతంగా సాగుతుందని అభిమానులంతా భావించారు...కానీ జూన్ 9 న...ప్రధానిగా మూడోసారి నరేంద్రమోదీ ప్రమాణ స్వీకారం ఉంటుందని ఫిక్స్ చేశారు. ఆ కార్యక్రమమానికి NDA భాగస్వామ్య పక్ష నేతలైన చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ కూడా హాజరు అవుతున్నారు. దీంతో అదే రోజున చంద్రబాబు ప్రమాణస్వీకారం సాధ్యం అయ్యే అవకాశం లేదు..అందుకే ఆ తేదీని 12 కి మార్చారు...
 
షష్ఠి రోజు బాధ్యతలు చేపడితే!


జూన్ 12 వ తేదీన షష్ఠి తిథి వచ్చింది. షష్ఠి నష్ఠి అంటారు..అంటే ఈ రోజు కొత్తగా ఏ పని ప్రారంభించినా అంతగా కలసిరాదని, నష్టాన్నే ఇస్తుందని చెబుతారు. అందుకే శుభకార్యాలకు ఈ తిథిని ఎవ్వరూ పరిగణించరు. అస్సలు ఏ తిథి మంచిది ఏ తిథి మంచిది కాదు అని పూర్తిగా తెలియకపోయినా ఈ సెంటిమెంట్స్ పాటించేవారంతా... పంచమి, సప్తమి, దశమి, ఏకాదశిని ఎక్కువగా పరిగణలోకి తీసుకుంటారు.  అలాంటిది చంద్రబాబు ప్రమాణస్వీకారానికి షష్ఠి తిథిని ఎందుకు ఎంచుకున్నారనే చర్చ జరుగుతోంది... అయితే షష్ఠి తిథి వల్ల ఎలాంటి చెడు జరిగిపోదు...మరీ ముఖ్యంగా ప్రమాణస్వీకారాలకి, కళ్యాణానికి షష్టి తిథి వల్ల మంచే జరుగుతుంది. అందుకే చంద్రబాబు ప్రమాణస్వీకారానికి ఈ తిథి ఎంపిక చేసుకున్నారంటున్నారు పండితులు... 


Also Read: తుమ్ము మంచి శకునమే కానీ షరతులు వర్తిస్తాయట..


జూన్ 12 న తారాఫలం బావుంది!


కొత్తగా ఏ కార్యక్రమం ప్రారంభించేందుకు అయినా తిథి ముఖ్యమే..కానీ...అంతకు మించి తారా ఫలాన్ని పరిగణలోకి తీసుకుంటారు. సామూహికంగా చేసే కార్యక్రమాలకు తిథులను పరిగణలోకి తీసుకుంటారు కానీ..వ్యక్తిగతంగా చేపట్టే కార్యక్రమాలకు తారాఫలం చాలా ముఖ్యం.  


సోషల్ మీడియాలో ఉన్న సమాచారం ప్రకారం  చంద్రబాబు నక్షత్రం 'పూర్వాషాఢ'


జూన్ 12 బుధవారం వచ్చిన నక్షత్రం 'మఖ'


తారాఫలం ఎలా లెక్కిస్తారంటే...


మీ జన్మనక్షత్రం నుంచి....మీరు కార్యం తలపెట్టాలి అనుకున్న రోజు ఏ నక్షత్రం ఉందో ఆ రోజు వరకూ లెక్కపెట్టాలి. అలా పూర్వాషాడ నుంచి మఖ వరకూ నక్షత్రాలను కౌంట్ చేస్తే 18 వ నంబర్ వచ్చింది...కలిపితే 9 నంబర్... తారాఫలం లెక్కించినప్పుడు 2,4,6,8,9...నంబర్లు వస్తే ఆ రోజు మంచిగా ఉందనే అర్థం...1,3,5,7 నంబర్లు వస్తే ఆ రోజు ఏం చేసినా కష్టనష్టాలు తప్పవంటారు...


ఈ లెక్కన..షష్ఠి తిథి బాగోలేకపోయినా..జూన్ 12న చంద్రబాబు తారాఫలం బావుంది..పైగా తొమ్మిదో తార వచ్చింది..అంటే ఈ రోజు కొత్తగా ప్రారంభించే కార్యక్రమం వల్ల సుఖం, లాభం ఉంటుందని అర్థం...