Netflix Top 10 Action Movies: నెట్ ఫ్లిక్స్ ఓటీటీ సంస్థ చక్కటి కంటెంట్ తో వీక్షకుల సంఖ్యను పెంచుకునే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే బెస్ట్ యాక్షన్ మూవీస్ ను ప్రేక్షకులకు అందుబాటులో ఉంచుతుంది. ప్రస్తుతం మాట్ రీవ్స్ నుంచి స్టీవెన్ స్పీల్‌బర్గ్ వరకు దిగ్గజ దర్శకులు తెరకెక్కించిన 10 యాక్షన్ మూవీస్ అందుబాటులో ఉన్నాయి. ఇంతకీ అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..  


1. 1917


సామ్ మెండిస్ దర్వకత్వం వహించిన ఈ సినిమా 2019లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  తన తాత చెప్పిన మొదటి ప్రపంచ యుద్ధానికి సంబంధించిన కథను బేస్ చేసుకుని దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించారు.  ఇద్దరు బ్రిటీష్ సైనికులు చేసిన వీరోచిత పోరాటాన్ని ఇందులో చూపించారు.  


2. బేబీ డ్రైవర్


ఎడ్గార్ రైట్ తెరకెక్కించిన ఈ సినిమా 2017లో విడుదల అయ్యింది. ఇందులో అన్సెల్ ఎల్‌గార్ట్ తన స్నేహితురాలు డెబోరాతో కలిసి నేర జీవితం నుంచి బయటపడేందుకు డ్రైవర్ గా ఎలా మారుతాడు? ఆ తర్వాత ఏం జరిగింది అనేది చూపించారు.    


3. బిగ్ 4


టిమో త్జాజాంటో తెరకెక్కించిన ఈ సినిమా 2022లో విడుదలైంది. ఇండోనేషియాకు చెందిన ఈ యాక్షన్, కామెడీ చిత్రం ఆర్యసత్య, లుటేషా, ఆరీ క్రిటింగ్, క్రిస్టో ఇమ్మాన్యుయేల్ అనే నలుగురు హంతకుల కథే ఈ సినిమా. తమ గురువును చంపిన హంతకుడిని పట్టుకునే ప్రయత్నాన్ని ఈ సినిమాలో చూపించారు.   


4. ఈక్వలైజర్-3


ఆంటోయిన్ ఫుక్వా తీసిన ఈ సినిమా 2014లో విడుదలైంది. ఇది ‘ది ఈక్వలైజర్ 2‘కి సీక్వెల్ గా వచ్చింది. ఈ చిత్రంలో డెంజెల్ వాషింగ్టన్ నటించారు. ఈ చిత్రంలో, దక్షిణ ఇటలీలోని ఒక చిన్న పట్టణంలో తన కొత్త స్నేహితులను కామోరా సభ్యులు బెదిరించినట్లు మెక్‌కాల్ తెలుసుకుంటాడు. వారిని ముప్పు నుంచి ఎలా కాపాడాడు? అనేది ఈ చిత్రంలో చూపించారు.  


5. గాడ్జిల్లా


గారెత్ ఎడ్వర్డ్స్ తెరకెక్కించిన ఈ అమెరికన్ మూవీ 2014లో విడుదల అయ్యింది. ఈ చిత్రంలో ఆరోన్ టేలర్-జాన్సన్, కెన్ వటనాబే, ఎలిజబెత్ ఒల్సేన్, జూలియట్ బినోచే, సాలీ హాకిన్స్, డేవిడ్ స్ట్రాథైర్న్, బ్రయాన్ క్రాన్స్టన్ నటించారు. ఈ చిత్రంలో, గాడ్జిల్లా, MUTOs అని పిలిచే  ఇద్దరు రాక్షసుల మధ్య జరిగే పోరాటంలో చిక్కుకున్నప్పుడు ఒక అమెరికన్ సైనికుడు వారి బారి నుంచి తప్పించుకుని ఎలా బయటపడ్డాడు అనేది ఈ సినిమాలో చూపించారు. 


6. గాడ్జిల్లా మైనస్ వన్


నవంబర్ 2023లో జపాన్ లో విడుదలైన బ్లాక్ బస్టర్ మూవీ ‘గాడ్జిల్లా మైనస్ వన్’. ఆ తర్వాత ఈ సినిమా అమెరికా, ఆస్ట్రేలియా సహా పలు దేశాల్లో విడుదలైంది. జూన్ 1న నెట్ ఫ్లిక్స్ వేదికగా భారత్ లో విడుదల అయ్యింది. జపాన్, ఇంగ్లీష్, హిందీ, తమిళంలో స్ట్రీమ్ అవుతోంది. ఈ సినిమా రూ.120 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కగా, ఏకంగా రూ. 660 కోట్ల రూపాయలు వసూళు చేసింది. తకాషి యమజాకి దర్శకత్వం వహించిన ‘గాడ్జిల్లా మైనస్ వన్’కి ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు దక్కాయి. ఈ ఏడాది బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో ఆస్కార్ అవార్డు కూడా దక్కింది.


7. హార్డ్‌ కోర్ హెన్రీ


ఇలియా నైషుల్లర్ తెరకెక్కించిన ఈ సినిమా 2016లో విడుదలైంది. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చిత్రంగా రూపొందిన ఈ మూవీలో  షార్ల్టో కోప్లీ, డానిలా కోజ్లోవ్‌స్కీ, హేలీ బెన్నెట్, టిమ్ రోత్ నటించారు. ఈ చిత్రం  ఏప్రిల్ 8, 2016న థియేటర్లలో విడుదలైంది. అమెరికాలో మిశ్రమ స్పందన అందుకున్న ఈ సినిమా రష్యాలో మాత్రం హిట్ టాక్ తెచ్చుకుంది.  


8. ది హార్డర్ దే ఫాల్


జేమ్స్ శామ్యూల్ తెరకెక్కించిన ఈ సినిమా 2021లో విడుదల అయ్యింది.  ఈ చిత్రంలో జోనాథన్ మేజర్స్ , ఇద్రిస్ ఎల్బా , జాజీ బీట్జ్ , రెజీనా కింగ్ , డెల్రాయ్ లిండో, లకీత్ స్టాన్‌ఫీల్డ్ , RJ సైలర్ , డేనియల్ డెడ్‌వైలర్ , ఎడి గాతేగి, డియోన్ కోల్ నటించారు. ఈ సినిమా కథ పంతొమ్మిదవ శతాబ్దపు అమెరికన్ వెస్ట్‌ లోని కౌబాయ్‌లు, న్యాయవాదులు, చట్టవిరుద్ధమైన వ్యక్తుల చుట్టూ తిరుగుతుంది.  


9. ది కిల్లర్


డేవిడ్ ఫించర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2023లో విడుదల అయ్యింది. ఇది అలెక్సిస్  మాట్జ్  నోలెంట్ రాసిన ఫ్రెంచ్ గ్రాఫిక్ నవల సిరీస్ ‘ది కిల్లర్‘ ఆధారంగా రూపొందించబడింది. ఈ చిత్రంలో ఫాస్‌బెండర్ ఒక హంతకుడిగా నటించాడు. తన ప్రత్యర్థులపై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? అనేది ఈ సినిమాలో చూపించారు.


10. లూపర్


రియాన్ జాన్సన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2012లో విడుదల అయ్యింది. అత్యుత్తమ సైన్ ఫిక్షన్ యాక్షన్ మూవీస్ లో ‘లూపర్’ ఒకటిగా నిలిచింది. ఇందులో బ్రూస్ విల్లీస్, జోసెఫ్ గోర్డాన్-లెవిట్, ఎమిలీ బ్లంట్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రంలో జోసెఫ్ గోర్డాన్-లెవిట్ కాంట్రాక్ట్ కిల్లర్‌గా నటించారు. ఈ మూవీ అంతా కాంట్రాక్ట్ కిల్లర్ల చుట్టూ తిరుగుతుంది. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా అద్భుత విజయాన్ని అందుకుంది. 30 మిలియన్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా 176 మిలియన్ డాలర్లు సాధించింది.  


Read Also: ‘అరణ్మనై 4’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ - ఎప్పుడు.. ఎక్కడ స్ట్రీమింగ్ అంటే?