Venus Ttransit in Gemini 12 June to 7 july 2024:  జూన్ 12 న మిథున రాశిలో శుక్రుడి పరివర్తన జూలై 07 వరకూ కొనసాగుతుంది. సాధారణంగా ఏ గ్రహం రాశిమారినా ఆ ప్రభావం మేషం నుంచి మీనం వరకూ మొత్తం రాశులపై ఉంటుంది. కొన్ని రాశులవారికి అదృష్టం కలిసొస్తే..మరికొన్ని రాశులవారికి ప్రతికూల ఫలితాలు ఇబ్బందిపెడతాయి. ఐశ్వర్యం, ఆనందం, బంధం, ప్రేమ, శ్రేయస్సుకి చిహ్నంగా చెప్పే శుక్రుడు వృషభం నుంచి మిధునంలోకి మారే సమయంలో ఈ రాశులవారికి గోల్డెన్ టైమ్ స్టార్ట్ అవుతోంది...


మేష రాశి 


మిథునంలో శుక్రుడి సంచారం ఈ రాశి నుంచి మూడో స్థానంలో ఉంటుంది. ఫలితంగా మీ సంతోషం పెరుగుతుంది. స్నేహితులతో మంచి సమయం స్పెండ్ చేస్తారు. తోబుట్టువులతో బంధం బావుంటుంది. వైవాహిక జీవితం అద్భుతంగా ఉంటుంది. ప్రేమ సంబంధాలు పురోగమిస్తాయి. కళల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీలో సృజనాత్మకత ప్రశంసలు పొందుతుంది...


Also Read: ఈ రోజు ఈ రాశివారి జీవితంలో చాలా ముఖ్యమైన మార్పులొస్తాయి - జూన్ 09 రాశిఫలాలు


వృషభ రాశి


ఈ రాశి నుంచి శుక్రుడు మారి తర్వాత రాశిలోకి వెళుతున్నాడు. అంటే వృషభం నుంచి శుక్రుడి సంచారం రెండో స్థానంలో ఉంది. ఈ సమయంలో మీ జీవితంలో అన్నీ అనుకూల ఫలితాలే ఉన్నాయి. అపారమైన ద్రవ్య ప్రయోజనం పొందుతారు. అనుకోకుండా డబ్బు చేతికందుతుంది. సామాజిక సమావేశాలలో పాల్గొంటారు. శుభకార్యాలకు హాజరవుతారు. కుటుంబంలో ప్రశాంతత ఉంటుంది. మీ మాటతీరుతో ఎంత కష్టమైన పనిని అయినా పూర్తిచేసేస్తారు. వ్యాపారాలు ఊహించని స్థాయిలో పురోగమిస్తాయి


మిథున రాశి


శుక్రుడి సంచారం మీ రాశిలోనే కావడంతో...మీ వ్యక్తిత్వం ప్రకాశిస్తుంది. ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులన్నీ ఒక్కొక్కటిగా పూర్తై మీలో సంతోషాన్ని నింపుతాయి. అనుకోని ఆర్థిక లాభాలుంటాయి. పిల్లల నుంచి ప్రేమ పొందుతారు..సంతోషం పెరుగుతుంది. విదేశీ వ్యాపారాలతో సంబంధం ఉండేవారు మంచి లాభాలు ఆర్జిస్తారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.  


సింహ రాశి


మీ రాశి నుంచి 11 వ స్థానంలో ఉంది శుక్రుడి సంచారం. ఈ సమయంలో మీ ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. ఆశయాలు నెరవేరుతాయి. ఉద్యోగులకు సీనియర్ల నుంచి సహకారం లభిస్తుంది. వైవాహిక జీవితం, ప్రేమ బంధం ప్రశాంతంగా ఉంటుంది.  కష్టానికి తగిన ఫలితం పొందుతారు.


Also Read: షష్ఠి తిథిలో ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం - ఈ తిథి మంచిదేనా , తారాబలమే ప్రధానమా!


కన్యా రాశి


మిథున రాశిలో శుక్ర సంచారం మీ రాశి నుంచి పదో స్థానంలో ఉంది. ఈ సమయం మీరున్న రంగంలో వృద్ధి సాధ్యమవుతుంది. అదృష్టం కలిసొస్తుంది. నిలిచిపోయిన పనులన్నీ మరోసారి ప్రారంభమవుతాయి. వ్యాపార ప్రాజెక్టులు ముందుకు సాగుతాయి . ఉద్యోగులకు కావాల్సిన చోటుకి బదిలీలు జరుగుతాయి. కొత్త వ్యక్తులతో మీ వ్యాపారం ముందుకు తీసుకెళ్లే అవకాశం లభిస్తుంది. కుటుంబ జీవితం బావుంటుంది. 


ధనస్సు రాశి


ఈ రాశి నుంచి శుక్రుడు ఏడో స్థానంలో ఉంటాడు. కొన్నాళ్లుగా మీ వ్యక్తిగత జీవితంలో ఉండే సమస్యలు పరిష్కారం అవుతాయి. కుటుంబానికి సమయం కేటాయిస్తారు. మీ బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారులకు ఇది చాలా అనుకూల సమయం. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.  


Also Read: ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారోత్సవం రోజే 'రంభా వ్రతం' - ఏంటీ పూజ , విశిష్టత ఏంటి!


గమనిక: ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.