Daily Horoscope Predictions in Telugu


మేష రాశి
ఈ రోజు కొత్త విషయాలను అన్వేషిస్తారు. కష్టపడి పనిచేస్తే ఫలితం ఉంటుంది. ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు విజయవంతమవుతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షలలో మంచి ఫలితాలు సాధిస్తారు.  మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి.


వృషభ రాశి 
ఈ రాశివారి జీవితంలోకి కొత్తవ్యక్తి ప్రవేశిస్తారు. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది కానీ డబ్బుకు సంబంధించిన నిర్ణయాలు చాలా ఆలోచించి తీసుకోండి. ఖర్చులను నియంత్రించండి. దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలపై దృష్టి పెట్టండి. కుటుంబ జీవితంలో ఆనందం ఉంటుంది. రోజంతా సంతోషంగా ఉంటారు. నూతన ఆస్తి కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేసుకుంటారు. ఇంటా బయటా మీకు గౌరవం పెరుగుతుంది. 


మిథున రాశి
ప్రేమ సంబంధాలలో మధురానుభూతి ఉంటుంది. పాత పెట్టుబడుల నుంచి మంచి రాబడిని పొందుతారు. కెరీర్‌లో చాలా పురోగతి సాధిస్తారు.  మీరు సవాలు చేసే పనులు సులభంగా పూర్తి చేయగలుగుతారు. కుటుంబ జీవితంలో ఆనందం ఉంటుంది. వినూత్న ఆలోచనలతో చేసే పనులు సత్ఫలితాలను ఇస్తాయి.  సామాజిక హోదా, ప్రతిష్ట పెరుగుతుంది. మీ భాగస్వామితో సంబంధం బలంగా మరియు లోతుగా ఉంటుంది. మీ శారీరక   ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి.


కర్కాటక రాశి
ఈ రోజు మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కెరీర్‌లో పురోగతికి కొత్త అవకాశాలు లభిస్తాయి. కుటుంబ జీవితంలో సంతోషం ఉంటుంది. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. కొత్త ఆదాయ వనరుల ద్వారా ఆర్థిక లాభాలు ఉంటాయి. వ్యాపారం బాగా సాగుతుంది.  కుటుంబ సభ్యులతో అనవసర వివాదాలకు దూరంగా ఉండండి. మీ కోపాన్ని నియంత్రించుకోండి.  కార్యాలయ రాజకీయాలకు దూరంగా ఉండండి.  


Also Read: షష్ఠి తిథిలో ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం - ఈ తిథి మంచిదేనా , తారాబలమే ప్రధానమా!


సింహ రాశి
ఈ రాశివారికి ఈ రోజు చాలా ప్రత్యేకంగా ఉండబోతోంది. కెరీర్‌లో కొత్త విజయాలు సాధిస్తారు. నూతన ఆస్తి లేదా వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ జీవితంలో సమస్యలు తొలగిపోతాయి. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. పాత పెట్టుబడుల వల్ల ఆర్థిక లాభాలు ఉంటాయి. సవాళ్లు ఉన్నప్పటికీ కెరీర్‌లో గొప్ప పురోగతిని సాధిస్తారు. జీవితంలో ఆనందం ఉంటుంది. కొంతమందికి నిద్రలేమి సమస్య ఉండవచ్చు. ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించండి


కన్యా రాశి
ఈ రోజు కన్యారాశి వ్యక్తుల జీవితంలో చాలా సానుకూల మార్పులు ఉంటాయి. ఇంట్లో సంతోషం ఉంటుంది. ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఉద్యోగులకు కార్యాలయంలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. సహోద్యోగుల మద్దతు లభిస్తుంది. టీమ్‌వర్క్‌లో చేసే పని అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ధన ప్రవాహం పెరుగుతుంది. ప్రేమ జీవితంలో చాలా ఉత్తేజకరమైన మలుపులు ఉంటాయి. మీ ఆరోగ్యం పట్ల అజాగ్రత్తగా ఉండకండి. 


తులా రాశి
తులా రాశి వారు ఈరోజు పాత పెట్టుబడుల నుంచి మంచి రాబడిని పొందుతారు. నూతన పెట్టుబడుల కోసం మంచి అవకాశాలు పొందుతారు.   సహోద్యోగులతో కలిసి చేసే పనిలో అఖండ విజయం సాధిస్తారు. పాత ఆస్తులను అమ్మడం లేదా అద్దెకు ఇవ్వడం ద్వారా ఆర్థిక లాభం ఉంటుంది. మీ పనితీరుతో కార్యాలయంలో ఉన్నతాధికారులను మెప్పిస్తారు. ఆర్థిక విషయాల్లో ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. 


వృశ్చిక రాశి 
ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ వహించండి. నిరుద్యోగుల అన్వేషణ పూర్తవుతుంది. జీవితంలో చాలా పెద్ద మార్పులు వస్తాయి. విద్యార్థులు విదేశాల్లో చదువుకునే అవకాశం ఉంటుంది. ఈ రోజు మీ కలలన్నీ నిజమవుతాయి. కెరీర్‌లో మంచి సక్సెస్ సాధిస్తారు. దీర్ఘకాలంగా ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. ప్రతి పనికి అనుకున్నదానికంటే మెరుగైన ఫలితాలు వస్తాయి. విలాసవంతమైన జీవితం గడుపుతారు. 


Also Read: ఈ తిథి రోజు ఏం చేసినా విజయమే.. కానీ, ఆ తిథుల్లో చేసే పనులు కష్టాలు తెచ్చిపెడతాయ్!


ధనస్సు రాశి
ఈ రోజు చాలా శుభప్రదమైన రోజు. పూర్వీకుల ఆస్తి ద్వారా ఆర్థిక లాభం ఉంటుంది. కెరీర్‌లో ఎదుగుదల కోసం అనేక బంగారు అవకాశాలు ఉంటాయి. ప్రేమ సంబంధాలలో మాధుర్యం ఉంటుంది. మీ నాయకత్వ నైపుణ్యాలు కార్యాలయంలో ప్రశంసలు అందుకుంటాయి. అతిథుల రాక వల్ల ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పిల్లల ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ వహించండి.


మకర రాశి
ఈ రోజు మకర రాశి వారు తమ కష్టానికి తగిన ఫలాలను పొందుతారు. ప్రతి పని అనుకున్నదానికంటే మెరుగైన ఫలితాలను ఇస్తుంది. రుణ విముక్తి లభిస్తుంది.  కార్యాలయంలోని సహోద్యోగుల నుంచి మద్దతు పొందుతారు. కెరీర్‌లో ఎదుగుదల కోసం మంచి అవకాశాలు వస్తాయి.  వృత్తి జీవితంలో కొత్త విజయాలు సాధిస్తారు. సామాజిక హోదా, ప్రతిష్ఠ పెరుగుతుంది. కొందరు వ్యక్తులు కొత్త ఆస్తిని కొనుగోలు చేయడానికి లేదా వారి పాత ఇంటిని మరమ్మతు చేయడానికి ప్లాన్ చేసుకుంటారు. 


కుంభ రాశి
పాత పెట్టుబడుల నుంచి మంచి రాబడిని పొందుతారు. ఈరోజు మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. ఆర్థిక విషయంలో ఎలాంటి పెద్ద రిస్క్ తీసుకోవద్దు. జీవితంలో కొత్త విషయాలను అన్వేషించండి. నిరుద్యోగులు మంచి జాబ్ ఆఫర్ పొందుతారు. ఉద్యోగులు ప్రమోషన్ కి సంబంధించిన సమాచారం వింటారు. మీ భావాలను మీ భాగస్వామితో బహిరంగంగా పంచుకోండి. మీ మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. 


Also Read: ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారోత్సవం రోజే 'రంభా వ్రతం' - ఏంటీ పూజ , విశిష్టత ఏంటి!


మీన రాశి 
ఈ రాశివారి జీవితంలో ఈ రోజు చాలా ముఖ్యమైన మార్పలొస్తాయి. కెరీర్ లక్ష్యాల విషయంలో స్పష్టంగా ఉంటారు. ఆస్తి విషయంలో తోబుట్టువులు లేదా బంధువులతో వివాదాలు ఉండవచ్చు. కార్యాలయంలో మీ పరిధి మరింత పెరుగుతుంది. ఇంట్లో కన్నా బయట గౌరవం పెరుగుతుంది. మీ ఫిట్‌నెస్‌పై శ్రద్ధ వహించండి.


గమనిక: ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.