Telangana ICET 2024 Preliminary Anser Key: తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి జూన్ 5, 6 తేదీల్లో ఐసెట్-2024 పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ కీని కాకతీయ యూనివర్సిటీ జూన్ 8న విడుదల చేశారు. ఆన్సర్ కీతోపాటు పరీక్ష ప్రశ్నపత్రాలు, అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను కూడా అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. రెస్పాన్స్ షీట్లను పొందడానికి అభ్యర్థుల తమ ఐసెటట్ రిజిస్ట్రేషన్ నెమరు, హాల్‌టికెట్ నెంబరు వివరాలు నమోదుచేసి డౌనలోడ్ చేసుకోవచ్చు. ఇక అభ్యంతరాలు నమోదుచేసేందుకు ఐసెట్ హాల్‌టికెట్ నెంబరు, రిజిస్ట్రేషన్ నెంబరు, పుట్టిన తేదీ వివరాలు నమోదుచేయాల్సి ఉంటుంది. ప్రాథమిక కీపై జూన్ 9 సాయంత్రం 5 గంటల వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నారు. ఆ తర్వాత ఫైనల్ కీతోపాటు ఫలితాలను వెల్లడించనున్నారు.
Question Papers | Download Response Sheets | Key Objections
జూన్, 5, 6 తేదీల్లో మూడు సెషన్లలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని 116 పరీక్ష కేంద్రాల్లో 86,156 మంది విద్యార్థులకుగాను 77,942 మంది విద్యార్థులు ఐసెట్ పరీక్షకు హాజరయ్యారు. మొత్తం 90.47 శాతం హాజరు నమోదైంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో జూన్ 5న మొదటి సెషన్‌కు 115 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా 25,931 మంది హాజరయ్యారు. రెండో సెషన్‌కు 116 కేంద్రాల్లో 26,298 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. ఇక జూన్ 6న ఉదయం జరిగిన చివరి సెషన్‌లో 28,256 మంది విద్యార్థులకుగాను 25,662 మంది పరీక్షకు హాజరయ్యారు. ఐసెట్ పరీక్ష కోసం ఎన్నడూ లేనివిధంగా రికార్డుస్థాయిలో ఈసారి దరఖాస్తులు రావడం విశేషం. ఐసెట్ పరీక్ష కోసం మొత్తం 84,750 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. గతేడాది 75,520 దరఖాస్తులు రాగా.. ఈసారి 9,230 దరఖాస్తులు అధికంగా వచ్చిన సంగతి తెలిసిందే.
ఐసెట్ పరీక్ష నిర్వహణ కోసం తెలంగాణలో 16, ఏపీలో 4 సెంటర్లను ఏర్పాటు చేశారు. ఇందులో తెలంగాణకు సంబంధించి.. హైదరాబాద్, నల్గొండ, కోదాడ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సత్తుపల్లి, కరీంనగర్, మహబూబ్ నగర్, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, నర్సంపేటలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఇక ఏపీలో కర్నూలు, విజయవాడ, తిరుపతి, విశాఖపట్నంలో పరీక్ష కేంద్రాల్లో ఐసెట్ పరీక్ష నిర్వహించారు.
పరీక్ష ఇలా జరిగింది..
➥ ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జూన్ 5, 6 తేదీల్లో మూడు సెషన్లలో టీఎస్ ఐసెట్-2024 పరీక్ష నిర్వహించారు. ఆయా తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు మొదటి సెషన్‌లో, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్‌లో ఆన్‌లైన్ విధానంలో ఐసెట్ పరీక్ష నిర్వహించారు. జూన్ 5న ఒకే సెషన్‌లో పరీక్ష నిర్వహించారు.
➥ మొత్తం 200 మార్కులకు తెలంగాణ ఐసెట్ - 2024 ఆన్‌లైన్ ప్రవేశ పరీక్ష నిర్వహించారు. పరీక్షలో మొత్తం 200 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 150 నిమిషాలు. పరీక్షలో మూడు సెక్షన్లు (సెక్షన్-ఎ, బి, సి) ఉంటాయి. వీటిలో సెక్షన్-ఎ: అనలిటికల్ ఎబిలిటీ-75 ప్రశ్నలు-75 మార్కులు, సెక్షన్-బి: మ్యాథమెటికల్ ఎబిలిటీ-75 ప్రశ్నలు-75 మార్కులు, సెక్షన్-సి: కమ్యూనికేషన్ ఎబిలిటీ-50 ప్రశ్నలు-50 మార్కులు ఉంటాయి.
అర్హత మార్కులు..
ఐసెట్ పరీక్షలో కనీస అర్హత మార్కులను 25 శాతంగా నిర్ణయించారు. అంటే 200 మార్కులకుగాను 50 మార్కులను అర్హతగా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఎలాంటి అర్హత మార్కులు లేవు.