Dreams about Baby: నిద్రలో కలలు రావడం సహజమే. అయితే, అందరికీ ఒకే రకమైన కలలు రావు. కొందరికి మంచి కలలు.. మరికొందరికి పీడకలలు వస్తుంటాయి. మరికొందరికైతే వాస్తవానికి దగ్గరగా ఉండే కలలు వస్తుంటాయి. ఇలాంటి కలలపై స్వప్న శాస్త్రంలో వివిధ విషయాలను పేర్కొన్నారు. కలల పరమార్థాన్నివివరించారు.


కొన్ని కలలు మన భవిష్యత్తును సూచిస్తాయని స్వప్న శాస్త్రంలో పేర్కొన్నారు. చాలా సార్లు మనం కలలో కనిపించే వాటి గురించి అర్థం చేసుకోలేం. అయితే ఈ విషయాలను స్వప్నం శాస్త్రం వివరంగా చెబుతోంది. మీరు మీ కలలో నవజాత శిశువులు లేదా అప్పుడే పుట్టిన బిడ్డలను చూసినట్లయితే కొన్ని అర్థాలు ఉన్నాయని చెబుతోంది. చిన్నారుల అందమైన రూపం, నవ్వినట్లు కనిపిస్తే.. త్వరలో మీ జీవితంలో కొన్ని శుభవార్తలు వింటారని అర్థం.


శుభవార్త వింటారు:


పిల్లలు దేవుళ్లతో సమానం అంటారు. పిల్లలు నవ్వుతుంటే సాక్ష్యాత్తూ దేవుళ్లే దిగివచ్చారని సంతోషిస్తుంటారు. అయితే నవజాత శిశువులు కలలో కనిపించడం చాలా శుభప్రదమని పండితులు  చెబుతున్నారు. ఇలా చిన్నారులు కలలో వస్తే త్వరలోనే మీరు శుభవార్త  వింటారని అర్థం. అంతేకాదు ఇలా పిల్లలు కలలో వస్తుంటే మీ సమస్యల్లో నుంచి బయటపడుతున్నట్లు సూచిస్తుంది. 


నెరవేరని లక్ష్యాలు:


మీ కలలో చిన్నపిల్లలు ఏడుస్తున్నట్లు కనిపిస్తే మీ కోరికలలో ఒకటి త్వరలోనే నెరవేరుతుందని అర్థం చేసుకోవాలని స్వప్న శాస్త్రం చెబుతోంది. 


పిల్లలు తప్పిపోయినట్లు:


మీ కలలో పిల్లలు తప్పిపోయినట్లు కనిపిస్తే.. ఆగిపోయిన పనిని త్వరలోనే తిరిగి ప్రారంభిస్తారని అర్థం. మీరు ఆర్థికంగా ప్రయోజనాలను కూడా పొందుతారు. 


నవ్వుతున్న పిల్లలు:


మీరు మీ కలలో నవ్వుతున్న పిల్లలను చూసినట్లయితే మీకు అంతా శుభం జరుగుతుందని అర్థం. 


కవలలను చూడటం:


మీ కలలో కవలల పిల్లలను చూసినట్లయితే మీకు త్వరలోనే మీ ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుందని అర్థం. అలాగే బిడ్డను కానలకునేవారికి కూడా ఈ కల సంకేతంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు. 


ఒడిలో నిద్రిస్తున్నట్లు:


చాలా మందికి ఒడిలో పిల్లలు నిద్రిస్తున్నట్లు కలలు వస్తుంటాయి. ఇలా కల వస్తే మీ రక్తసంబంధీకుల్లో ఎవరికైనా బిడ్డ పుట్టే అవకాశం ఉంటుందనడానికి ఇది సంకేతమని పండితులు చెబుతున్నారు. 


అంతేకాదు మీ కలలో చిన్న పిల్లలను చూసినట్లయితే త్వరలోనే మీ జీవితంలో కొన్ని శుభవార్తలు వింటారని అర్థం. ఇది ఇంట్లో ఆనందం, శ్రేయస్సును కూడా తెస్తుంది. అదే సమయంలో మీరు మీ కలలో కొంచెం పెద్ద పిల్లను చూసినా శుభమే. మీ జీవితంలో సానుకూల మార్పు రాబోతోందని అర్థం. అది భవిష్యత్తులో మీకు ఉపయోగపడుతుంది.


lso Read : ఈ రాశుల వారికి అసూయ ఎక్కువట - ఇతరుల సక్సెస్‌ను ఓర్చుకోలేరట!




Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని ఆధ్యాత్మిక అంశాలు, పరిష్కారాలను ఇక్కడ యథావిధిగా అందించాం. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు.. ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.