Weekly Horoscope From June 10 to 16, 2024 : జూన్ 10 సోమవారం నుంచి జూన్ 16 ఆదివారం వరకూ ఈ వారం మీ రాశిఫలాలు...


మేష రాశి


ఈ వారం మేష రాశివారికి అదృష్టం కలిసొస్తుంది. చేయాలి అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. నూతన ఆవిష్కరణలపై ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగులకు పదోన్నతి ఉంటుంది. వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా సాగుతుంది. నూతన కార్యక్రమాలు ప్రారంభించేందుకు ఇదే సరైన సమయం. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. కళారంగంలో ఉండేవారికి కలిసొస్తుంది. వారం మధ్యలో అనారోగ్య సూచనలున్నాయి జాగ్రత్త. 


వృషభ రాశి


ఈ వారం వృషభ రాశివారికి మిశ్రమ ఫలితాలున్నాయి. ఆర్థిక పరిస్థితి ఆశించిన స్థాయిలో ఉండదు..అప్పులు ఇవ్వొద్దు తీసుకోవద్దు. అనవసర చికాకుకు గొడవలు తప్పవు. కష్టానికి తగిన ఫలితం పొందడం కష్టమే. స్థిరాస్తులకు సంబంధించిన వివాదాలు కొనసాగుతాయి. పరిస్థితులను అర్థం చేసుకుని ముందడుగు వేయండి. ఈ వారం ఈ రాశి ఉద్యోగులు, వ్యాపారులకు సాధాణంగా ఉంటుంది. కార్యాలయంలో బాధ్యతలు మరింత పెరుగుతాయి. వారం మధ్యలో కొంత ఉపశమనం ఉంటుంది. 
 
మిథున రాశి


ఏ పని ప్రారంభించినా ధైర్యంగా అడుగువేయండి విజయం సాధ్యం అవుతుంది. ఓ ముఖ్య సమచారం అందుకునే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది. వ్యాపారాలు బాగా సాగుతాయి. ఉద్యోగులకు పనిఒత్తిడి పెరుగుతుంది..చిన్న చిన్న ఇబ్బందులు తప్పవదు. అనవసర వాదనలకు దూరంగా ఉండడం మంచిది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. మానసిక ప్రశాంతత కోల్పోవద్దు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. 


Also Read: శుక్రుడి రాశిపరివర్తనం - జూలై 12 నుంచి మేషం , సింహం సహా ఈ 6 రాశులవారికి ఐశ్వర్యం, ఆనందం, పదోన్నతి!


కర్కాటక రాశి


ఈ వారం కర్కాటక రాశివారికి మంచి ఫలితాలున్నాయి. కుటుంబంలో కొనసాగుతున్న ఆస్తుల వివాదాలు ఓ కొలిక్కి వస్తాయి. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టేందుకు ప్రణాళికలు వేసుకోవచ్చు. నూతన వాహనం కొనుగోలు చేయాలన్న ఆలోచన కార్యరూపం దాల్చుతుంది. ఉద్యోగులకు ఈ వారం అన్నీ శుభఫలితాలే ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కానీ ఖర్చు విషయంలో ప్రణాళికలు చాలా అవసరం. వారం ఆరంభంలో కన్నా వారాంతం బాలవుంటుంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. 


సింహ రాశి


ఈ వారం సింహరాశివారికి శుభఫలితాలే ఉన్నాయి. ఉద్యోగం, వ్యాపారం ప్రోత్సాహకరంగా ఉంటుంది. కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. ఆర్థిక ఇబ్బందులు సమసిపోతాయి. స్నేహితులు , సన్నిహితుల నుంచి అవసరం అయిన సమయంలో సహకారం లభిస్తుంది. ఇల్లు, వాహనం కొనుగోలు చేయాలన్న ప్రయత్నాలు ఫలిస్తాయి. వారం మధ్యలో ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వారాంతంలో వివాదసూచనలున్నాయి అప్రమత్తంగా ఉండండి...


కన్యా రాశి


కొన్నాళ్లుగా వెంటాడుతున్న సమస్యల నుంచి ఈ వారం ఉపశమనం లభిస్తుంది. ఆర్థిక లావాదేవీలు మెరుగుపడతాయి. వివాదాల నుంచి బయటపడతారు. నూతన వస్తువులు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగులకు చిన్న చిన్న మార్పులుంటాయి కానీ అవి అనుకూలంగా ఉంటాయి. వ్యాపారంలో గందరగోళం తొలగిపోతుంది. కష్టమైన పరిస్థితులు ఎదురైనా మీ ఆలోచనలో ప్రతికూలత రానివ్వవద్దు. కళారంగంలో ఉండేవారి మంచి అవకాశాలు వస్తాయి. వారం చివర్లో అనవసర ఖర్చులుంటాయి.


Also Read: షష్ఠి తిథిలో ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం - ఈ తిథి మంచిదేనా , తారాబలమే ప్రధానమా!
  
తులా రాశి


ఈ వారం తులారాశివారికి మిశ్రమ ఫలితాలను అందిస్తోంది. అనుకున్న పనులన్నీ ఉత్సాహంగా పూర్తిచేసేస్తారు. అయితే  అనవసర వివాదాల్లో చిక్కుకునే అవకాశం ఉంది కాస్త ఓపికగా వ్యవహరించాలి. ఆవేశంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి కానీ అనవసర ఖర్చులకు దూరంగాం ఉండాలి. ఉద్యోగులు, వ్యాపారులు, కళాకారులు, విద్యార్థులకు శుభఫలితాలున్నాయి.  


వృశ్చిక రాశి


ఈ వారం మీరు తీసుకునే నిర్ణయాలు మీకు బాగా కలిసొస్తాయి. కొన్ని విషయాల్లో కొనసాగుతున్న డైలమా తొలగిపోతుంది. అయితే ఏం చేసినా ధైర్యంగా అడుగువేయండి. ఇక పూర్తికాదు అనుకున్న ఓ పని అనుకోకుండా పూర్తికావడం మీలో ఆనందాన్ని పెంచుతుంది.  ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. రహస్య విషయాలపై అధ్యయనం చేస్తారు. ఇంట్లో శుభకార్యాల నిర్వహణకు ప్లాన్ చేసుకుంటారు. రాజకీయ రంగంలో ఉండేవారికి మంచి పదవులు దక్కుతాయి. శత్రువులు కూడా మీకు మిత్రులవుతారు. వ్యాపారం బాగానే సాగుతుంది. ఉద్యోగులకు మిశ్రమ ఫలితాలున్నాయి. వారం ప్రారంభంలో అనారోగ్య సూచలు...


ధనస్సు రాశి


ధనస్సు రాశివారికి ఈవారం టైమ్ బావుంది. ప్లాన్ చేసుకున్నవన్నీ పూర్తిచేసేస్తారు. ఉద్యోగులకు ఊహించని హోదాలు దక్కుతాయి. వ్యాపారులు, పారిశ్రామిక రంగంలో ఉండేలవారికి టైమ్ అనుకూలిస్తుంది. నిరుద్యోగుల నిరీక్షణ ఫలిస్తుంది.  వారం మధ్యలో అనుకోని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు కలిసొస్తాయి. వాహనం, స్థిరాస్తులు కొనుగోలు చేయాలన్న ఆలోచన కార్యరూపం దాల్చుతుంది. ఓ శుభవార్త వింటారు..


మకర రాశి


ఈ వారం మకర రాశివారు మనోధైర్యంతో ఏ పని ప్రారంభించినా పూర్తిచేయడంలో సక్సెస్ అవుతారు. అనవసర విషయాలపై అధిక చర్చ వద్దు. ఉద్యోగులు, వ్యాపారులు తమ బాధ్యతల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉండకపోయినా అవసరానికి చేతికి డబ్బు అందుతుంది. గతంలో పెట్టిన పెట్టుబడులు మంచి ఫలితాలను ఇస్తాయి. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. ఆస్తి విషయంలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు.  


కుంభ రాశి


ఆర్థిక ఇబ్బందుల నుంచి కంత ఉపశమనం లభిస్తుంది. మాటతీరుతో కట్టిపడేస్తారు. విద్యార్థులు ప్రతిభ ప్రదర్శించేందుకు ఇదే మంచి సమయం. వ్యాపారం విస్తరిస్తారు. ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. గడిచిన వారం కన్నా మంచి ఫలితాలే సాధిస్తారు కానీ ప్రతి విషయంలోనూ ఆచితూచి అడుగువేయండి. ప్రయాణాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. 


మీన రాశి


ఈ వారం మీనరాశివారికి అన్నీ శుభఫలితాలే ఉన్నాయి. గౌరవమర్యాదలు పెరుగుతాయి. పెద్దలతో పరిచయాలు ఏర్పడతాయి. మీ తెలివితేటలతో కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. ఉద్యోగులకు తిరుగులేదు. భవిష్యత్ కోసం పెట్టుబడులు పెట్టేందుకు ప్రణాళికలు వేసుకుంటారు.  వారం ఆరంభంలో కొన్ని వివాదాలు, అనారోగ్య సమస్యలున్నా ఆ తర్వాత సర్దుకుంటాయి. పూర్తిచేయాలి అనుకున్న పనులు వాయిదా వేయవద్దు.  


Also Read: ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారోత్సవం రోజే 'రంభా వ్రతం' - ఏంటీ పూజ , విశిష్టత ఏంటి!


గమనిక: ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.