ప్రభుత్వ భవనాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగులు వేయడంపై హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. గత ప్రభుత్వం గ్రామాల్లో చెత్త నుండి సంపద తయారు చేసే కేంద్రాలను పెద్ద ఎత్తున నిర్మించింది. వాటన్నింటినీ ప్రభుత్వ నిధులతోనే నిర్మించారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలకు వారి పార్టీ రంగులు వేశారు. ఎక్కడ చూసినా అవే ఉండటంతో హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వాటిపై విచారణ జరిపిన హైకోర్టు ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. 


Also Read : సీమ ప్రాజెక్టులో పనులు జరగడం లేదని కేంద్రం నివేదిక



ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగుల వేయవద్దని  హైకోర్టు చెప్పినా అవే రంగులు ఎలా వేస్తారంటూ ప్రభుత్వ న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. ప్రిన్సిపల్ సెక్రటరీ పంచాయతీరాజ్ డిపార్ట్‌మెంట్‌, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్‌ మేనేజింగ్ డైరెక్టర్‌ను ఈ నెల 16న కోర్టులో వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందిగా న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. ప్రతివాదులు అందరికీ నోటీసులు జారీ చేసింది. రంగుల విషయంలో ప్రభుత్వం గతంలో సుప్రీంకోర్టు వరకూ వెళ్లి పోరాడింది. ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రభుత్వ ఆస్తులన్నింటికీ రంగులు వేయడాన్ని ప్రథమ ప్రాధాన్యంగా పెట్టుకున్నారు. 


Also Read : ఏపీలో కరెంట్ బిల్లులు ఎందుకు పెరిగాయి?



ఇలా దాతలు ఇచ్చిన విరాళంతో నిర్మించిన ఓ పంచాయతీ భవనానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగులు  వేయడంతో కొంత మంది హైకోర్టులో పిటిషన్ వేశారు. రంగులు తొలగించాల్సిందేనని హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వ కార్యాలయాలపై ఏ పార్టీ రంగులు ఉండకూడదు.  అవి వైసీపీ రంగులు కాదని.. ప్రభుత్వం తరపు న్యాయవాది హైకోర్టులో వాదించారు. అయినా హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. తొలి విచారణలోనే ప్రభుత్వ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టి వేసింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సమర్థించింది. దీంతో తప్పని సరి పరిస్థితుల్లో ప్రభుత్వ భవనాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగులను తొలగించాల్సి వచ్చింది.


Also Read : ఇక ఆ వెబ్‌సైట్‌లో ఏపీ జీవోలు !



అయితే ఇప్పటికి అనేక చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగులే ఇంకా ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలకు వేశారు. అవి కూడా ప్రభుత్వ సొమ్ముతో నిర్మించినవే కావడంతో తొలగించక తప్పని పరిస్థితి ఏర్పడింది. గతంలో ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించినట్లుగా కోర్టు భావిస్తే ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. అయితే అవి ప్రభుత్వ ఖర్చుతో చేసినవి కావని.. వైసీపీ నేతలు తమ ఖర్చుతో వేయించారని ప్రభుత్వం ఆదేశిస్తే.. అలా రంగులు వేసిన వారిపై హైకోర్టు చర్యలు తీసుకునే ‌అవకాశం ఉంది. 


Also Read : ప్రభుత్వ ఆంక్షలను కాదని ఏపీలో చవితిని నిర్వహిస్తారా..?