Andhra Pradesh News Today | సాయిబాబాకు నివాళులు అర్పించేందుకు వెళ్లిన మాజీ మంత్రి కేటీఆర్‌కు చేదు అనుభవం
ప్రొఫెసర్‌ సాయిబాబా పార్థివదేహానికి నివాళులు అర్పించేందుకు మౌలాలిలోని ఆయన నివాసానికి పలువురు ప్రముఖులు, నేతలు, ఆయన అభిమానులు క్యూ కట్టారు. సీపీఐ నేత నారాయణ సహా పలువురు వామపక్ష నేతలు సాయిబాబాకు నివాళులు అర్పించి, ఆయన సేవల్ని కొనియాడారు. అనంతరం మౌలాలిలోని ఆయన నివాసానికి సాయిబాబా భౌతికకాయాన్ని తరలించారు. ఈ క్రమంలో సాయిబాబాకు నివాళులు అర్పించేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం వెళ్లగా చేదు అనుభవం ఎదురైంది. పౌర హక్కుల నేతలు, ఉద్యమకారుల నుంచి కేటీఆర్ కు నిరసన సెగ తగిలింది. KTR గో బ్యాక్ అంటూ గట్టిగా నినాదాలతో నిరసన వ్యక్తం చేశారు.  పూర్తి వివరాలకు క్లిక్ చేయండి



మరో వివాదంలో మంత్రి కొండా సురేఖ- ఈసారి సీఐ కుర్చీలోనే కూర్చొని హడావుడి- తీవ్ర స్థాయికి చేరిన రేవూరితో విభేదాలు
వరంగల్ జిల్లా పరకాలలోని గీసుకొండలో ఉద్రిక్తత చోట చేసుకుంది. సీఐ కుర్చీలో తెలంగాణ మంత్రి కొండా సురేఖ కూర్చోవడంతో ఆమె వర్గీయులు భారీగా పోలీస్ స్టేషన్‌కు రావడంతో ఆదివారం అర్థరాత్రి ఉద్రిక్త నెలకొంది. ఎమ్మెల్యే రేవూరి, మంత్రి కొండా సురేఖకు సంబంధించి పది నెలలుగా తీవ్రమైన వర్గ విభేదాలు తలెత్తాయి. పలు మార్లు అధినాయకత్వం జోక్యం చేసుకున్నా ఈ వివాదం మాత్రం కొలిక్కి రావడం లేదు. గీసుకొండలో ఏర్పాటు చేసిన ఓ ఫ్లెక్సీ మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి వర్గాల మధ్య విభేదాలను మరోసారి బయటపెట్టాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


పల్లెపండగ వారోత్సవాలు ప్రారంభం, పాలనలో తన మార్క్ చూపిస్తున్న పవన్ కల్యాణ్
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 30వేల అభివృద్ధి పనులు ఒకేసారి శ్రీకారం చుట్టారు. పైగా ఒకేసారి 4500 కోట్లు ఖర్చు చేస్తున్నారు. దాంతో ఏపీలో పల్లె పల్లెలో పండగ వాతావరణం కనిపిస్తోంది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన మార్క్ పాలన చూపిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామస్థాయి నుంచి సచివాలయం వరకు అనేక మార్పులు చేస్తూ వస్తున్నారు. వైసీపీ హయాంలో పాలనను పూర్తిగా గాడి తప్పించారని ఆరోపిస్తూనే వాటిని సరి చేసి ప్రగతి పట్టాలు ఎక్కిస్తున్నామని కూటమి నేతలు చెబుతున్నారు.   పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభమైన మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియ- లాటరీ ద్వారా ఖరారు
ఏపీలో మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియ నేటి ఉదయం ప్రారంభమైంది. పటిష్ట బందోబస్తు మధ్య ఉదయం 8 గంటల నుంచి అధికారులు లాటరీ తీస్తున్నారు. అధికారిక ప్రక్రియలు పూర్తి చేసిన వారి పేర్లను వేసి అందులో ఆయా షాపులను అధికారులు కేటాయిస్తున్నారు. జిల్లాలో ఎ‌న్ని దుకాణాలు ఉన్నప్పటికీ ఒక్కో దుకాణం ఆర్డర్ ప్రకారం లాటరీ తీసి వారికి అందిస్తారు. ముందుగా ఒకటో నెంబర్ కేటాయించి దుకాణానికి వచ్చిన దరఖాస్తులకు నెంబర్లు ఇచ్చి ఉంటారు. వాటిని ఓ డబ్బాలో వేసి ఒకదాన్ని తీసి విజేతగా ప్రకటిస్తారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి 


పాలనలో చంద్రబాబే ఆదర్శం, రాష్ట్ర ప్రగతిలో ఫలితం కనిపిస్తోంది- పవన్ కల్యాణ్
సీఎం చంద్రబాబు అనుభవం ఏపీకి బలమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పునరుద్ఘాటించారు. జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేసినందుకు ఇప్పుడు మంచి పనులు జరుగుతున్నాయని ప్రజలకు చెప్పారు. ఏపీలో యువతకు ఉపాధి అవకాశాలు లభించి రాష్ట్రాభివృద్ధి జరగాలనే సంకల్పంతో టీడీపీతో కలిసి పోటీ చేశామని తెలిపారు. ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పల్లె పండగ వారోత్సవాలను కృష్ణా జిల్లా కంకిపాడులో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ప్రారంభించారు.  పూర్తి వివరాలకు క్లిక్ చేయండి