జమ్ముకశ్మీర్ బందిపొరా జిల్లాలో పోలీసులపై గ్రనేడ్ దాడి చేశారు ఉగ్రవాదులు. ఈ దాడిలో ఓ పోలీసు ప్రాణాలు కోల్పోయారు. నలుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు.
ఏం జరిగింది?
నిషత్ పార్క్ సమీపంలో పోలీసులు, సీఆర్పీఎఫ్ దళాలు ఓ చోట ఉన్నాయని తెలిసి పక్కా పథకం ప్రకారమే ఈ దాడి చేసినట్లు అధికారులు తెలిపారు. ఆ సమయంలో ఉగ్రవాదులే గ్రెనేడ్ దాడి చేశారని అధికారులు తెలిపారు.
గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించామని వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వెల్లడించారు. జమ్ము కశ్మీర్ పోలీసు శాఖలో డ్రైవర్‌గా పనిచేసే జుబేర్ అహ్మద్ దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయాడని వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దర్యాప్తు కొనసాగుతోందన్నారు. దాడి చేసిన వ్యక్తిని గుర్తించేందుకు ఆ ప్రాంతాన్నంతటినీ తమ అధీనంలోకి తీసుకున్నట్లు వెల్లడించారు.
రిపబ్లిక్ డే ముందు
గణతంత్ర వేడుకులకు ముందు రోజున కూడా జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. జనవరి 25న శ్రీనగర్ పట్టణంలో గ్రనేడ్ బాంబులతో తెగబడ్డారు. స్థానికంగా ఉన్న హైస్ట్రీట్ వద్ద సాయంత్రం సమయంలో బాంబులతో దాడికి పాల్పడినట్టు పోలీసులు వెల్లడించారు.
భద్రతా సిబ్బందిని టార్గెట్‌గా చేసుకుని ఉగ్రవాదులు ఈ గ్రనేడ్ దాడికి పాల్పడారు. ఈ బాంబు దాడిలో నలుగురు తీవ్రంగా గాయపడినట్టు పోలీసులు తెలిపారు.
Also Read: BSF Seized Pak Boats: గుజరాత్ తీర ప్రాంతంలోకి చొరబడిన పాక్ పడవలు.. స్వాధీనం చేసుకున్న బీఎస్ఎఫ్
Also Read:SC on Hijab Row: 'హిజాబ్'పై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ పిటిషన్- విచారణకు సుప్రీం నో