ABP  WhatsApp

SC on Hijab Row: 'హిజాబ్‌'పై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ పిటిషన్- విచారణకు సుప్రీం నో

ABP Desam Updated at: 11 Feb 2022 12:20 PM (IST)
Edited By: Murali Krishna

SC on Hijab Row: హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టు ఇచ్చిన మధ్యంతర తీర్పుపై స్టే విధించాలని కోరుతూ దాఖలైన విటిషన్‌పై విచారణకు సుప్రీం కోర్టు నికారించింది.

హిజాబ్ వివాదం

NEXT PREV

SC on Hijab Row: హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టు ఇచ్చిన మధ్యంతర తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. డా.జే హల్లీ ఫెడరేషన్ ఆఫ్ మసీద్ మదారిస్, వక్ఫ్ సంస్థలు ఈ పిటిషన్ వేశాయి. హైకోర్టు ఇచ్చిన తీర్పు ముస్లిం మహిళల ప్రాథమిక హక్కులను కాలరాసేలా ఉందని పిటిషన్​లో పేర్కొన్నారు.


అయితే ఈ పిటిషన్‌పై అత్యవసర విచారణకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. దీన్ని దేశవ్యాప్త సమస్యగా మార్చవద్దని న్యాయవాదులకు సుప్రీం కోర్టు సూచించింది.








సరైన సమయంలో ఈ కేసును విచారణకు అనుమతిస్తాం. కర్ణాటకతో పాటు ఆ రాష్ట్ర హైకోర్టులో ఏం జరుగుతుందో మేం గమనిస్తున్నాం. హిజాబ్ అంశంపై సరైన సమయంలో జోక్యం చేసుకుంటాం. దీన్ని దేశవ్యాప్త సమస్యగా మార్చవద్దని న్యాయవాదులకు సూచిస్తున్నాం.                           - సుప్రీం ధర్మాసనం


హైకోర్టు తీర్పు


హిజాబ్‌ వివాదంపై దాఖలైన పిటిషన్లను విచారించిన కర్ణాటక హైకోర్టు మధ్యంత తీర్పు ఇచ్చింది. విద్యాసంస్థల్లోకి అడుగుపెట్టినప్పుడు విద్యార్థులు ఎలాంటి మతపరమైన దుస్తులను ధరించరాదని హైకోర్టు వ్యాఖ్యానించింది. హిజాబ్ లేదా కాషాయ కండువా ఇలా.. ఏదీ ధరించవద్దని పేర్కొంది. కోర్టులో ఈ వ్యవహారంలో పెండింగ్‌లో ఉన్నంతవరకు ఇది పాటించాలని ఆదేశించింది.


కళాశాలల పునఃప్రారంభంపై ధర్మాసనం ఆదేశాలు ఇస్తుంది. కోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్నంతవరకు విద్యార్థులు ఎవరూ హిజాబ్ లేదా కాషాయ కండువా వంటి మతపరమైన దుస్తులను ధరించి కళాశాలలకు వెళ్లొద్దు. సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకు ఈ పిటిషన్‌పై విచారణ కొనసాగిస్తాం.                                             "


-   కర్ణాటక హైకోర్టు

 


 

Published at: 11 Feb 2022 12:16 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.