గుప్పెడంతమనసు ఫిబ్రవరి 11 శుక్రవారం ఎపిసోడ్
కార్లో ఉన్న చార్టులు తీసుకొచ్చి మహేంద్రసార్ కి ఇమ్మన్నారని గౌతమ్ కి చెబుతుంది పుష్ప. నీకు వసుధార తెలుసా అంటే తను నాకు బెస్ట్ ఫ్రెండ్ అంటుంది.  ఇప్పుడు వసుధార అని ఏదో మాట్లాడబోతుంటే చార్ట్స్ ఇవ్వండి అని గౌతమ్ ని అడుగుతుంది. కార్లోంచి చార్ట్స్ బయటకు తీస్తుంటే తన దగ్గరున్న చార్ట్ కూడా కిందపడిపోతుంది. వీటన్నింటిలో ఏది వసుధరా బొమ్మో ఎలా వెతకాలి అనుకుని ఓ చార్ట్ తీసి ఇది నాది అని పక్కనపెట్టేసి మిగిలినవి పుష్పకి ఇస్తాడు. చార్టులో వసుధార బొమ్మ ఉంది..నా హార్ట్ లో వసుధార ఉంది అనుకున్న గౌతమ్.. వసుకి సర్ ప్రైజ్ ఇస్తా అనుకుంటాడు. 


మీటింగ్ రూమ్ లో కూర్చున్న జగతి, మహేంద్ర మాట్లాడుకుంటారు. పండుగకు వచ్చి వెళ్లిన విషయం ఆలోచిస్తున్నావా అని మహేంద్ర అంటే..ఆ విషయం ఎప్పుడో వదిలేశాను నువ్వే మోస్తున్నావ్ అంటుంది. ఏడారిలో పదేళ్లకోసారి వానొచ్చినట్టే నేను కూడా వచ్చాను వెళ్లాను, ఏడారిలో నిత్యం వాన పడాలి అనుకోవడం అత్యాశే కదా అంటుంది. ఈ టాపిక్ మనసులో పెట్టుకుని రిషిని విసిగించకు అని జగతి అంటే..తను బాధపడకుండా ఆలోచించి మాట్లాడుతా అంటాడు. చార్టులు తీసుకొచ్చి రిషి సార్ మీకు ఇమ్మన్నారని చెప్పి వెళ్లిపోతుంది పుష్ప. మొదటగా వసుధార బొమ్మ ఉన్న చార్ట్ ఓపెన్ చేసి చూసేలోగా అటెండర్ వచ్చి మీటింగ్ కి పిలుస్తాడు. ఇవన్నీ చూడు మహేంద్ర అనేసి వెళ్లిపోతుంది జగతి. మహేంద్ర కూడా ఆ చార్ట్ ఓపెన్ చేసేలోగా కాల్ రావడంతో వెళ్లిపోతాడు. 


Also Read: సౌందర్య ఇంట్లో దీప-కార్తీక్ పెళ్లివేడుక, వదలబొమ్మాళి అంటూ ఎంట్రీ ఇచ్చిన మోనిత, కార్తీకదీపం శుక్రవారం ఎపిసోడ్
బుక్స్ కోసం లైబ్రరీకి వెళుతుంది వసుధార. రిషి కూడా లైబ్రరీలోనే ఉంటాడు. టైమ్ అయిపోవడంతో లోపలెవరైనా ఉన్నారా చూసిన లైబ్రేరియన్ ఎవ్వరూ లేరనుకుని లైట్స్ ఆఫ్ చేసి, డోర్స్ వేసేసి వెళ్లిపోతాడు. బండిపై వెళ్లాలికదా అని ఫోన్ సైలెంట్ మోడ్ లో పెట్టేసి వెళ్లిపోతాడు. రిషి, వసుధార మొదట పవర్ ఆఫ్ అయిందా అనుకుంటారు..ఆ తర్వాత ఒకర్నొకరు చూసుకుంటారు. బుక్స్ దొరికాయా అని ఒకర్నొకరు అడుగుతారు. కరెంట్ వచ్చాక మీ బుక్ నేను, నా బుక్ మీరు వెతకండి అనుకుంటారు. లైబ్రేరియన్ గారూ అని పిలిచి ఎవ్వరూ లేకపోవడంతో జనరేటర్ ఆన్ చేయించడానికి వెళ్లాడేమో అనుకుంటారు. కాసేపటికి డోర్స్ క్లోజ్ అయిన విషయం గమనిస్తారు. 


ఈ రోజంతా ఇక్కడే ఉండాలా మేడంకి కాల్ చేస్తాను అని వసుధార అంటే.. నువ్వు కొంపలు ముంచే పనిచేయకు, ఇద్దరం లోపల ఉన్నామని బయటివారికి తెలిస్తే బావోదు అంటాడు. ఇప్పుడేం చేద్దాం అంటే అంత్యాక్షరి ఆడుకుందాం అని రిషి అంటే నేను రెడీ అంటుంది వసు. వెటకారమా నేనేదో సరదాగా అంటే నీకు అలా అర్థమైందా అంటాడు. లైబ్రేరియన్ ఫోన్ తీయడం లేదని రిషి చెప్పడంతో ఇప్పుడేం చేయాలి సార్ అంటుంది వసు. మెయిన్ గేట్ లో ఉన్న వాచ్ మెన్ కి కాల్ చేసిన రిషి లైబ్రేరియన్ నీకు కనిపించాడా, లైబ్రరీ డూప్లికేట్ కీ ఏమైనా ఉందా అడుగుతాడు. రెండూ అతని వద్దే ఉంటాయంటాడు వాచ్ మెన్. లైబ్రెరియన్ కి ఎంత కాల్ చేసినా ఫోన్ సైలెంట్ లో ఉండడంతో తీయడు. 


Also Read:  లైబ్రరీలో ఇరుక్కుపోయిన టెన్షన్లో రిషి, ధ్యానంలో వసు, బయట గౌతమ్ .. గుప్పెడంత మనసు గురువారం ఎపిసోడ్
టెన్షన్ పడకండి సార్ ఇలాంటప్పుడే అని వసు మొదలెట్టేలోగా..ఆంత్యాక్షరి ఆడాలా, ఆసనాలు వేయాలా, నంబర్లు లెక్కెట్టాలా అని ఫైర్ అవుతాడు. రిషికి ఏం చేయాలో అర్థంకాక అటు ఇటు తిరుగుతూ ఉంటే వసుధార ధ్యానం చేస్తుంటుంది. మీలా టెన్షన్ పడకుండా ఉండాలని ప్రశాంతత కోసం ధ్యానం చేస్తున్నా అంటుంది. లైబ్రేరియన్ కాల్ లిఫ్ట్ చేయడం లేదు నీకు అర్థం కావడం లేదా అని రిషి అంటే..ఆయన ఏ టెన్షన్లో ఉన్నాడో ఏమో ఎవరికి తెలుసు ..ఈ సారి కూల్ గా కాల్ చేయండి లిఫ్ట్ చేయండి అంటుంది. కోపంగా చూడొద్దు ప్రశాంతంగా డయల్ చేయండని వసు చెప్పగా.. నువ్వు సూక్ల్ టైమ్ లో సూత్రాలన్నీ నాపైనే ప్రయోగిస్తావ్ కదా అంటాడు రిషి. 


మరోవైపు అప్పుడే బండి దిగిన లైబ్రేరియన్  రిషి సార్ ఇప్పుడు కాల్ చేస్తున్నారేంటని లిఫ్ట్ చేస్తాడు. ఇప్పుటివరకూ కాల్ లిఫ్ట్ చేయలేదు ఎందుకు అని రిషి అరుస్తుంటే..కూల్ సార్ కూల్ అంటుంది వసుధార. ఎపిసోడ్ ముగిసింది..


రేపటి (శనివారం) ఎపిసోడ్ లో
లైబ్రరీలో కూర్చున్న వసు ఏదో ఆలోచిస్తుంటే..ఏమైందని అడుగుతాడు రిషి. నేను మనసులో కొన్ని అనుకుంటున్నాను..వాటికి మీరు ఆన్సర్ చేయండి అంటుంది. 
వసు: దేవుడా ఇలా లైబ్రరీలో ఇరుక్కుపోయామేంటి 
రిషి: పర్వాలేదులే ఏం కాదు
వసు: దేవుడా రిషి సార్ కి కోపం రాకుండా చూడు
రిషి: షాక్ అయి చూసిన రిషి
ఇంతలో లైబ్రేరియన్  రావడంతో మళ్లీ వచ్చావేంటని అడిగిన గౌతమ్ కి... లోపల రిషి సార్ ఉండిపోయారని చెబుతాడు. డోర్ లాక్ తీయడంతో లోపల వసు కూడా ఉండడంతో చూసి షాక్ అవుతాడు గౌతమ్...