కార్తీకదీపం ఫిబ్రవరి 11 శుక్రవారం ఎపిసోడ్
సౌందర్య, దీప, కార్తీక్ అందరూ హైదరాబాద్ బయలుదేరుతుండగా అక్కడకు వస్తుంది రుద్రాణి. మీరెవరో, మీ గురించి తెలియక ఇన్నాళ్లూ మిమ్మల్ని చాలా కష్టాలుపెట్టాను.. నన్ను క్షమించండి అని చెబుతుంది. ఈ చెక్ నాకు వద్దు..ఇకనుంచి  వడ్డీ వ్యాపారం కూడా మానేస్తాను అని చెబుతుంది. నీలో కలిగిన ఈ మార్పుకి సంతోషిస్తున్నాం ఆ చెక్ నీ దగ్గరే ఉండనీ, వీలైతే నలుగురు అనాధ పిల్లల్ని పెంచుకుని వాళ్లకి చదువు చెప్పించు అంటుంది సౌందర్య. ఈ ఇల్లు ఆనంద్ కి చెందుతుంది పెద్దయ్యాక వీడికి ఇద్దాం..ఈ లోగా అనాథ ఆశ్రమంగా మార్చండని సలహా ఇస్తాడు కార్తీక్. నన్ను క్షమించండి, మీరంతా బావుండాలి అంటుంది రుద్రాణి. ఆ సేటుకి మీ నగలు ఇచ్చేయమని అందుకే చెప్పాను మనసులో అనుకుని రుద్రాణి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. నానమ్మ నేను రుద్రాణి దగ్గర ఉన్నానని నీకెలా తెలిసిందని హిమ అంటే.. హోటల్ అప్పారావు ఫోన్లో మీ నాన్న ఫొటో చూసి ఆరా తీస్తే మొత్తం చెప్పాడంటుంది సౌందర్య. 


దీపూ బాగానే ఉన్నాడుగా అంటాడు ఆదిత్య. బాగానే ఉన్నాడంటుంది శ్రావ్య. ఇంతలో కాలింగ్ బెల్ మోగడంతో మమ్మీవాళ్లు వచ్చినట్టున్నారని వెళ్లి తలుపు తీసి దీప, కార్తీక్, పిల్లల్ని చూసి ఆశ్చర్యపోతారు. కొత్తగా ఈ బాబు ఎవరు అని అడుగుతుంది శ్రావ్య. దిష్టితీయమని శ్రావ్యకి చెప్పిన సౌందర్యతో నేను ఏం సాధించానని అంటాడు కార్తీక్. చాలా సాధించావ్, జీవితం అంటే ఏంటో, డబ్బు విలువ, కష్టాలు అన్నీ పిల్లలకు తెలియచెప్పావనంటుంది.  బాబాయ్ ని , దీపుని మరిచిపోయారా అంటాడు ఆదిత్య. కట్ చేస్తే తాడికొండలో హోటల్ యజమాని, అప్పారావు నడుచుకుంటూ వెళుతుంటారు. ఇద్దరూ దీప, కార్తీక్ ని తలుచుకుని బాధపడతారు. వాళ్లెంత గొప్పవాళ్లంటే అక్కకి తెలియకుండా, బావకి తెలియకుండా అక్క హోటల్లో పనిచేశారు. డబ్బులుంటేనే గొప్పోళ్లు కాదని అనుకుంటారు. ఆ పెద్దమేడం వచ్చి రుద్రాణి మొహంమీద చెక్కు విసిరి కొట్టింది, ముక్కు మొహం తెలియని చిన్న పిల్లాడిని కోసం అప్పు ఒప్పుకున్నారు అదీ గొప్పతనం అంటే అంటాడు అప్పారావు. నేను హైదరాబాద్ వెళ్లి సినిమాలు, సీరియల్స్ కోసం ట్రై చేస్తా అంటాడు.


Also Read:  మోనిత కొడుక్కి సౌందర్య ఇంట్లో వేడుక, షాక్ ఇచ్చిన శౌర్య .. కార్తీకదీపం గురువారం ఎపిసోడ్
ఇప్పుడు ఆరోగ్యం ఎలా ఉందని కార్తీక్ అడుగుతుంటే..  నానమ్మ వాళ్ల ఇంటికి వచ్చాక చాలా సంతోషంగా ఉందని చెబుతుంది శౌర్య. అక్కడకు వచ్చిన దీపకి కూడా సారీ చెబుతాడు. ఇకపై తాడికొండ విషయాలు వదిలేయండి అంటుంది. అమ్మా మనం ఎప్పుడూ ఇల్లుదాటి వెళ్లొద్దంటుంది శౌర్య. ముగ్గురూ మీటింగ్ పెట్టారేంటని సౌందర్య ఎంట్రీ ఇచ్చి..ఇకపై మనం అందరం ఒకజట్టు..ఎవ్వరూ ఎక్కడికీ వెళ్లరు, అందరం కలిసే ఉంటాం, ఎవ్వరూ దూరం చేయలేరు అంటుంది. ఈ ఇంటికి బాస్ ఎవరో చెప్పు అంటే ఇంకెవరు నువ్వే కదా నానమ్మ అంటుంది శౌర్య.


కట్ చేస్తే వంటలక్క ప్రజావైద్యశాలకు చేరుకుంటుంది మోనిత. విన్నీ అని మోనిత పిలవడంతో లోపలి నుంచి గతంలో ట్రీట్మెంట్ తీసుకున్న అరుణ బయటకు వస్తుంది. విన్నీ ఏమైంది అని అడిగితే వాళ్ల బంధువులు వస్తే వెళ్లిందని చెబుతుంది. బస్తీ వాసులు ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు అనుకుంటుంది. ఇంతలో ఫోన్ రింగవడంతో కాల్ లిఫ్ట్ చేసి ఎవరు మీరు అంటుంది. నేను మీ బాబాయ్ ని, హార్ట్ సర్జరీ కోసం ముంబై వచ్చానంటాడు. సడెన్ గా బాబాయ్ ఇండియాకు వచ్చాడెందుకు, బాబాయ్ గోల నాకెందుకు ఎందుకూ పనికిరాడు తన గురించి నేనెందుకు బాధపడాలి అనుకుంటుంది. కార్తీక్ , నా ఆనందరావు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు అనుకుంటుంది.


Also Read: టెన్షన్లో రిషి, ధ్యానంలో వసు, షాక్ లో గౌతమ్, గుప్పెడంతమనసు శుక్రవారం ఎపిసోడ్
దీప చేతిలో గుక్కపెట్టి ఏడ్చిన బాబుని సౌందర్య తీసుకుని ఆడించినా గుక్కపట్టి ఏడుస్తూనే ఉంటాడు. నానమ్మ వీడు చాలా తెలివైన వాడు నాన్న ఎత్తుకోగానే ఏడుపు ఆపేసి నవ్వుతుంటాడు. వీడు డాడీ ఎత్తుకుంటే సైలెంట్ అయిపోతాడని హిమ అంటే.. నా కొడుకు ఎత్తుకుంటే నీకెందుకు అంత ఆనందం అంటాడు కార్తీక్. కట్ చేస్తే లక్ష్మణ్ ని పిలిచి తాడికొండలో కార్తీక్ గురించి తెలిసిన విషయాలన్నీ చెబుతుంది. నువ్వు తాడికొండ వెళ్లి కార్తీక్ ని వెతుకు, నేను ఇక్కడ సౌందర్య ఆంటీ ఇంటిపై ఓ కన్నేసి ఉంచుతా అంటుంది. దీప మీకు ఏం చేసిందో తెలియలేదు కానీ నేను మీకు గొప్ప మంచి చేశాకే ఈ బస్తీలోంచి కదులుతాను అని చెప్పి ఖర్చులకు డబ్బు ఇస్తుంది. సరే అని వెళ్లిపోతాడు లక్ష్మణ్. సౌందర్య ఆంటీ ప్లాన్ చేసి మా ఇద్దర్నీ కలుసుకోకుండా చేసి ఉంటుందా..మీ ఆలోచనలు పసిగడతాను..కార్తీక్ ని త్వరలోనే చేరుకుంటా అనుకుంటుంది మోనిత.


ఇంట్లో బాబుతో అంతా ఆడుకుంటూ ఉంటారు. ఏ తల్లి బిడ్డో వీడు మనింటికి చేరాడు అని సౌందర్య అంటుంది. తమ్ముడిని బాగా చూడు నానమ్మ ... నాన్న లాగే ఉంటాడు కదా అంటుంది శౌర్య.


రేపటి (శనివారం) ఎపిసోడ్ లో
ఫ్యామిలీ అంతా సంతోషంగా ఉన్న సమయంలో మోనిత ఎంట్రీ ఇస్తుంది. మళ్లీ కథ ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి...