అంతర్జాతీయ విమాన సేవలపై నిషేధాన్ని పొడిగించింది భారత్. డిసెంబర్ 15 నుంచి ఈ సేవలను పునరుద్ధరించాలనే నిర్ణయం అమలును వాయిదా వేసింది. ఈ మేరకు పౌర విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ ప్రకటించింది. విమానాల పునరుద్ధరణ ఎప్పటి నుంచి అనేది త్వరలోనే తెలియజేస్తామని తెలిపింది డీజీసీఏ.
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భయాందోళనలు నెలకొనడంతో ఈ నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయంగా పరిణామాలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది.
కరోనా మహమ్మారి విజృంభణతో అంతర్జాతీయ విమానాల రాకపోకలు 2020, మార్చి నుంచి నిలిపివేసింది భారత్. ఇటీవల కొవిడ్ ఉద్ధృతి తగ్గడంతో డిసెంబర్ 15 నుంచి పూర్తిస్థాయిలో అనుమతించాలని నిర్ణయించింది. కానీ ఒమిక్రాన్ భయంతో మరోసారి నిషేధాన్ని పొడిగించింది.
Also Read: Omicron Travel Rules: భారత్ వస్తున్నారా? అయితే ఈ 10 పాయింట్లు పక్కా గుర్తుంచుకోండి!
Also Read: Petrol Price: తగ్గిన పెట్రోల్ ధరలు.. వాహనదారులకు బంపర్ ఆఫర్.. వ్యాట్ తగ్గించిన సర్కార్
Also Read: Govt on Farmers Protests: 'ప్చ్.. రైతులు చనిపోయారా? మాకు తెలియదే.. పరిహారం ఎలా ఇస్తాం?'
Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 8,954 కరోనా కేసులు నమోదు, 267 మంది మృతి
Also read: అన్నం తింటే బరువు పెరుగుతామని భయమా... వండే స్టైల్ మార్చండి, బరువు తగ్గుతారు
Also Read: కొత్త కరోనా వేరియంట్ ఒమిక్రాన్... మొదటి ఫోటో విడుదల చేసిన పరిశోధకులు