భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతి 2021ని కమిటీ ప్రకటించింది. ఫిజిక్స్‌లో ముగ్గురికి నోబెల్ బహుమతి దక్కింది. సుకురో మనాబే, క్లాస్‌హాసెల్‌మేన్, జార్జియోపారిసీకి సంయుక్తంగా ఈ పురస్కారం ఇస్తున్నట్లు నోబెల్ కమిటీ ప్రకటించింది.
భూతాపం తీవ్రతను అంచనా వేయడంపై సాగిన పరిశోధనల నేపథ్యంలో వీరికి అవార్డు ఇస్తున్నట్లు తెలిపింది.
వైద్య శాస్త్రంలో..
2021 ఏడాదికి గాను వైద్యశాస్త్రానికి సంబంధించిన నోబెల్ బహుమతిని ప్రకటించారు. డేవిడ్ జులియస్, ఆర్డెమ్ పటాపౌటియన్ను సంయుక్తంగా నోబెల్ బహుమతి వరించింది. వేడి, చలి, స్పర్శకు మానవ శరీరంలోని నాడీ వ్యవస్థ ఎలా ప్రతిస్పందిస్తుందనే అంశంపై వీరిద్దరూ పరిశోధనలు చేశారు.
ఉష్ణ గ్రాహకాలపై పరిశోధన కోసం మిరపకాయల్లోని కాప్సాయ్‌సిన్ అనే ఘాటైన పదార్థాన్ని డేవిడ్ ఉపయోగించారు. వేడికి ప్రతిస్పందించేలా చర్మంలో ఉండే సెన్సార్‌ను గుర్తించారు. ఇదే తరహాలో చర్మం, శరీరంలోని అవయవాలు స్పర్శకు ఎలా స్పందిస్తాయనే అంశంపై ఆర్డెమ్ పరిశోధన చేశారు.
ఈ అవార్డులో భాగంగా బంగారు పతకంతో పాటు దాదాపు 1.14 మిలియన్ల అమెరికన్ డాలర్లను బహుమతిగా ఇస్తారు. ఇదే ఈ ఏడాదిలో ప్రకటించిన మొదటి నోబెల్ బహుమతి. భౌతిక శాస్త్రానికి సంబంధించి ఈరోజు పురస్కారం ప్రకటించారు. రసాయన శాస్త్రం, సాహిత్యం, శాంతి, ఆర్థిక శాస్త్రంపై త్వరలోనే బహుమతులు ప్రకటించనున్నారు.
Also Read: Nobel Prize 2021: డేవిడ్, ఆర్డెమ్‌కు వైద్య రంగంలో సంయుక్తంగా నోబెల్ బహుమతి
Also Read:WhatsApp Down: వాట్సాప్, ఫేస్‌బుక్ డౌన్.. ఫన్నీ మీమ్స్‌తో ఆడేసుకుంటున్న నెటిజన్స్