ప్రముఖ మెసేజింగ్ యాప్ సేవలు ప్రపంచ వ్యాప్తంగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. భారత కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 9 గంటల సమయంలో సామాజిక మాధ్యమాలైన వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ సేవలు స్తంభించిపోయాయి. మెసేజింగ్ సేవలకు అంతరాయం ఏర్పడింది. వాట్సాప్, ఇన్ స్టా, ఫేస్ బుక్ సర్వర్స్ డౌన్ అవ్వడంతో వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు. సాంకేతిక లోపం తలెత్తడంతో సర్వీసులు నిలిచిపోయినట్లు తెలుస్తోంది.


గతంలో కూడా కొన్నిసార్లు పర్యాయాలు వాట్సాప్, ఫేస్ బుక్ సేవలు నిలిచిపోయాయి. కానీ గతానికి భిన్నంగా ప్రస్తుతం ఒకేసారి వాట్సాప్, ఫేస్ బుక్‌తో పాటు ఇన్‌స్టాగ్రామ్ సేవలు చాలా సమయం నిలిచిపోవడం చర్చయనీయాంశం అయింది. ఇది సైబర్ అటాక్ అయి ఉండొచ్చునని అమెరికా ఇంటెలిజెన్స్ అంచనా వేసింది. చైనా హ్యాకర్లు ఈ చర్యలకు పాల్పడ్డారా అనే కోణంలోనూ విచారిస్తున్నారు. ఎట్టకేలకు మంగళవారం తెల్లవారుజామున అన్ని సేవలను పునరుద్ధరించారు. 


భారత్‌లో 41 కోట్ల మంది ఫేస్ బుక్ యూజర్లు ఉండగా.. వాట్సాప్‌ను 53 కోట్ల మంది వినియోగిస్తున్నారు. చాటింగ్ కోసం అతిగా ఉపయోగించే వాట్సాప్ సేవలు నిలిచిపోవడంతో చాలామందికి ఏదో కోల్పోయిన భావం కలిగింది. దీంతో అంతా ట్విట్టర్ మీద పడ్డారు. ఈ సందర్భంగా వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్‌‌లను ట్రోల్ చేస్తూ ఫన్నీ మీమ్స్ ట్వీట్ చేస్తూ ట్రోలింగ్ మొదలుపెట్టారు. వీటిని చూస్తే మీరు తప్పకుండా నవ్వుకుంటారు. 






















































Also Read: పవన్‌తో విభేదాలు.. ఆయన మార్నింగ్ షో కలెక్షనంత ఉండదు మీ సినిమా: ప్రకాష్ రాజ్


Also Read: పోసాని ఎక్స్‌పైరీ ట్యాబ్లెట్.. అతడి చావు భయంకరంగా ఉంటుంది: బండ్ల గణేష్


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి