ABP  WhatsApp

Nobel Prize 2021: డేవిడ్, ఆర్డెమ్‌కు వైద్య రంగంలో సంయుక్తంగా నోబెల్ బహుమతి

ABP Desam Updated at: 04 Oct 2021 04:26 PM (IST)
Edited By: Murali Krishna

వైద్య విభాగంలో నోబెల్​ బహుమతి -2021ని ప్రకటించారు. డేవిడ్​ జులియస్​, ఆర్డెమ్​ పటాపౌటియన్​కు సంయుక్తంగా అవార్డు లభించింది.

వైద్య రంగంలో నోబెల్ బహుమతి ప్రకటన

NEXT PREV

2021 ఏడాదికి గాను వైద్యశాస్త్రానికి సంబంధించిన నోబెల్​ బహుమతిని ప్రకటించారు. డేవిడ్​ జులియస్​, ఆర్డెమ్​ పటాపౌటియన్​ను సంయుక్తంగా నోబెల్​ బహుమతి వరించింది. వేడి, చలి, స్పర్శకు మానవ శరీరంలోని నాడీ వ్యవస్థ ఎలా ప్రతిస్పందిస్తుందనే అంశంపై వీరిద్దరూ పరిశోధనలు చేశారు.










నోబెల్ కమిటీ సెక్రటరీ జనరల్ థామస్ పెర్ల్‌మన్ విజేతలను ప్రకటించారు.



ప్రపంచంలోని మరో రహస్యాన్ని వీరి పరిశోధన బయటపెట్టింది. ఇది మన మనుగడకే చాలా కీలకం. కనుక ఇది చాలా గొప్ప పరిశోధన. దీర్ఘకాలిక నొప్పులు సహా మరెన్నో వ్యాధులకు చికిత్సా విధానాల అభివృద్ధికి వీరి పరిశోధనలు ఉపకరిస్తాయి. -                                  థామస్ పెర్ల్‌మన్, నోబెల్ కమిటీ సెక్రటరీ జనరల్


ఉష్ణ గ్రాహకాలపై పరిశోధన కోసం మిరపకాయల్లోని కాప్సాయ్​సిన్​ అనే ఘాటైన పదార్థాన్ని డేవిడ్ ఉపయోగించారు. వేడికి ప్రతిస్పందించేలా చర్మంలో ఉండే సెన్సార్​ను గుర్తించారు. ఇదే తరహాలో చర్మం, శరీరంలోని అవయవాలు స్పర్శకు ఎలా స్పందిస్తాయనే అంశంపై ఆర్డెమ్ పరిశోధన చేశారు.


ఈ అవార్డులో భాగంగా బంగారు పతకంతో పాటు దాదాపు 1.14 మిలియన్ల అమెరికన్ డాలర్లను బహుమతిగా ఇస్తారు. ఇదే ఈ ఏడాదిలో ప్రకటించిన మొదటి నోబెల్ బహుమతి. భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, సాహిత్యం, శాంతి, ఆర్థిక శాస్త్రంపై త్వరలోనే బహుమతులు ప్రకటించనున్నారు.


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

Published at: 04 Oct 2021 04:11 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.