యూపీ ఎన్నికల నగరా మోగింది. గతంలోలా ఈ సారి ఎన్నికలు ఏకపక్షంగా సాగే అవకాశాలు కనిపించడం లేదు. సమాజ్ వాదీ పార్టీ బాగా పుంజుకుంది. చాలా సర్వేల్లో బీజేపీ ముందంజలో ఉన్నదని తేలినప్పటికీ సమాజ్ వాదీ పార్టీ గట్టి పోటీ ఇస్తోంది. బీఎస్పీ, కాంగ్రెస్ పార్టీ కూడా ఉనికి చాటుకునేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ క్రమంలో యూపీలో కుల సమీకరణాలు అత్యంత కీలకంగా మారాయి. 


Also Read: యూపీ సీఎంగా తొలి ప్రాధాన్యత ఎవరికి?.. ABP- సీ ఓటర్ సర్వే ఫలితాలు ఇవే!


అభివృధ్ది ప్రచారం చేస్తున్న బీజేపీ !


అధిక సంఖ్యలో బీజేపీకి ఎంపీలను అందించిన ఉత్తరప్రదేశ్‌లో నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తలెత్తిన రైతుల ఆగ్రహ జ్వాలలు బీజేపీని ఇబ్బంది పెట్టాయి. ఈ పరిస్థితి గమనించిన ప్రధాని మోడీ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. వ్యవసాయ చట్టాలను తీవ్రంగా వ్యతిరేకించిన రైతులు పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో ఎక్కువ మంది ఉన్నారు. వీరంతా జాట్‌ వర్గీయులు. 2014 ఎన్నికల్లో బీజేపీకి వీరంతా ఏకపక్షంగా మద్దతు పలికారు. అందుకే భారీ విజయం లభించింది. జాట్ల కోపాన్ని తగ్గించడానికి, సాధ్యమైతే వారిని తిరిగి తమ వైపు తిప్పుకోవడానికి మోదీ నూతన వ్యవసాయ చట్టాల రద్దు నిర్ణయాన్ని ప్రకటించారు.  రాష్ట్రం లోనూ, కే్రందంలోనూ అధికారంలో ఉన్న బీజేపీకి అధికార వ్యతిరేకత ఇబ్బందికరంగా మారుతోంది. ఎప్పుడూ లేని విధంగా అభివృద్ధిని ప్రచారం చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది. శాంతిభద్రతలు కాపాడుతున్నామని బీజేపీ గొప్పగా ప్రకటించుకుంటోంది. 


Also Read:  ఎలక్షన్ టైం కదా.. రైతులు కొట్టినా తియ్యని దెబ్బే..! ఉత్తరాది బీజేపీ ఎమ్మెల్యేకు ఎంత కష్టమో...?


కుల సమీకరణాల్లోనూ బీజేపీ బిజీ..బిజీ !


యూపీ జనాభాలో 10 శాతం బ్రాహ్మణులే ఉన్నారు. వీరు మొదటి నుంచి బీజేపీ మద్దతుదారులు. కానీ యూపీలో మరో బలమైన ఠాకూర్‌ కులానికి చెందిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌  ఠాకూర్‌ల ఆధిపత్యం పెరగడానికి ఇతోధికంగా మద్దతు ఇస్తున్నా డనే అసంతృప్తి బ్రాహ్మణవర్గంలో ఉంది. ఈ కారణంగా యూపీలో బీజేపీకి ఉన్న సంప్ర దాయ ఓట్లు దూరమయ్యే అవకాశం ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. బీజేపీకి యూపీలో 40 శాతం ఓట్లు ఉన్నాయి. ఆ పార్టీని ఓడించాలంటే మిగతా పార్టీలు అంతకన్నా ఎక్కువ ఓట్లు పొందాలి. 


Also Read: 'యూపీ ఎలక్షన్లు 2024 సాధారణ ఎన్నికలకు సెమీస్ కావు'


ప్రతిపక్షాల ఐక్యత లేకపోవతంతో చీలిపోనున్న అధికార వ్యతిరేక ఓట్లు !


ప్రస్తుతం ప్రతిపక్షాల మధ్య ఐక్యత లేకపోవడం, ప్రధాన పార్టీలన్నీ దేనికది ఒంటరిగా ఎన్నికల బరిలో నిలవాలని భావించ డంతో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లన్నీ చీలిపోయే అవకాశం ఉంది. ఈ పరిస్థితి బీజేపీకి అనుకూలించే అంశమే. అఖిలేశ్‌ అనేక చిన్న ఏక కుల పార్టీలతో పొత్తుపెట్టుకొని రేసులో ముందున్నారు. ప్రస్తుతం పోటీ బీజేపీ- ఎస్పీ మధ్యనే కనిపిస్తోంది. బీజేపీకి తగ్గే ఓట్లు  ఎస్‌పీ ఖాతాలో పడతాయని భావిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీకి వచ్చింది కేవలం 22 శాతం ఓట్లే. ఈ సారి మరింత మెరుగైన ప్రదర్శన కోసం ఆయన ప్రయత్నిస్తున్నారు. 


Also Read: ఐదు రాష్ట్రాల ఎన్నికలపై కరోనా ఆంక్షలు ! సెమీఫైనల్స్‌లో "ఎలక్షన్ ఫ్లేవర్" మిస్ అయినట్లే !?


కాంగ్రెస్ ఎంత పోరాడినా కష్టమే ! 


కాంగ్రెస్ తరపున ప్రియాంకా గాంధీ ఉత్తరప్రదేశ్‌లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. కాంగ్రెస్‌కు సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే శక్తి లేదని ఓటర్ల అభిప్రాయం.  ఓడిపోయే పార్టీకి ఓటువేసి తమ ఓటును వ్యర్థం చేసుకోకూడదనే నియమాన్ని మన ఓటర్లు ఎటూ తప్పరు కాబట్టి.. గెలిచే పార్టీకే ఓటు వేస్తారు. ఆ విధంగా చూస్తే ప్రియాంక పోరాటం ఎస్‌పీకి లాభం చేకూర్చ బోతోందని భావిస్తున్నారు. అయితే కప్రియాంకాగాంధీ మహిళా సెంటిమెంట్‌ను ప్రయోగిస్తున్నారు. 


Also Read: 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల... ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఎన్నికలు



ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి