లఖింపుర్ ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా ఆసుపత్రిలో చేరారు. ఆయనకు డెంగీ సోకినట్లు వైద్యులు తెలిపారు. జైలు వద్ద ఉన్న ఆసుపత్రిలోనే ఆయనకు చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
శుక్రవారం ఆయనకు రెండు రోజుల కస్టడీ విధిస్తూ కోర్టు ఆదేశాలిచ్చింది. అయితే తనకు జ్వరంగా ఉందని ఆశిష్ చెప్పడంతో అధికారులు ఆయన రక్తం శాంపిళ్లను పరీక్షకు పంపారు. రిపోర్టులో ఆశిష్‌కు డెంగీ వచ్చినట్లు ధ్రువీకరణైంది. అతని ఆరోగ్యం క్షీణించడంతో ఆశిష్ మిశ్రాను శనివారం రాత్రి 10 గంటలకు జైలు ఆసుపత్రిలో చేర్చారు.
ఇప్పటికే ఆశిష్ మిశ్రాకు రెండు సార్లు పోలీసు కస్టడీ విధించింది కోర్టు. లఖింపుర్ కేసులో మరో ముగ్గుర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటివరకు మొత్తం 13 మంది పోలీసులు అరెస్ట్ చేశారు.
ఏం జరిగింది?
కేంద్రం తీసుకువచ్చిన మూడు సాగు చట్టాలపై నిరసన వ్యక్తం చేస్తోన్న రైతులపైకి ఓ వాహనం దూసుకెళ్లిన ఘటనలో నలుగురు అన్నదాతలు ప్రాణాలు కోల్పోయారు. ఆ హింసాత్మక ఘటనలో మరో ఇద్దరు భాజపా కార్యకర్తలు, ఓ డ్రైవర్ సహా ఓ జర్నలిస్ట్ ప్రాణాలు కోల్పోయాడు. ఆగ్ గత ఆదివారం జరిగిన ఈ ఘటన యావత్ దేశాన్నే షాక్‌కు గురి చేసింది.
అయితే రైతులపైకి దూసుకువచ్చిన కారులో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా ఉన్నట్లు రైతులు ఆరోపించారు. అనంతరం పోలీసులు ఆశిష్ మిశ్రాను అరెస్ట్ చేశారు.
Also Read: Covid-19 New variant: కరోనా మరో అవతారం.. ఏవై. 4.2.. ఇది చాలా ఫాస్ట్ గురూ! మరి భారత్‌కు వచ్చేసిందా?
Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 15 వేల కేసులు నమోదు, 561 మంది మృతి
Also Read: ఈ క్రికెటర్లు రిచ్చో రిచ్చు! టీ20 ప్రపంచకప్ ఆడేస్తున్న కోటీశ్వరులు వీరే!
Also Read: ఐపీఎల్ క్రేజ్‌కు ఫిదా! కొత్త ఫ్రాంచైజీపై 'మాంచెస్టర్ యునైటెడ్' ఆసక్తి!
Also Read: పాక్‌వి గంభీరమైన ప్రేలాపనలే! దాయాదిపై భారత జైత్రయాత్రకు కారణాలు చెప్పిన వీరూ