కేరళలో మరో వైరస్‌ కలకలం రేపుతోంది. నోరో వైరస్‌ పేరుతో పిలుస్తోన్నఈ వ్యాధి అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. 2 వారాల వ్యవధిలో 13 కేసులు నమోదయ్యాయి. వయనాడ్‌ జిల్లాలోనే అన్ని కేసులు నిర్ధారణయ్యాయి. ఈ మేరకు ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్‌ తెలిపారు.






ఎలా వ్యాపిస్తోంది?


ఈ వైరస్ సోకిన వారంతా వయనాడ్​ జిల్లా పూకోడేలోని ఓ పశువైద్య కళాశాల విద్యార్థులు. వాంతులు, డయేరియాను ఈ వైరస్​ లక్షణాలుగా గుర్తించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరించింది.


పశువైద్య కళాశాల క్యాంపస్​ బయట ఉండే హాస్టళ్లల్లోని విద్యార్థుల్లో తొలిసారి ఈ వైరస్​ను గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు.. వారి రక్తనమూనాలను సేకరించి అలప్పుజలోని జాతీయ వైరాలజీ సంస్థ(ఎన్​ఐవీ)కి పంపించారు. వ్యాప్తిని అడ్డుకునేందుకు కఠిన చర్యలు చేపట్టాలని అధికారులకు ఆరోగ్య మంత్రి ఆదేశించారు.


ఇవే ప్రధాన లక్షణాలు..



  1. పొట్ట, పేగులు చుట్టూ ఈ వైరస్ పట్టి ఉంటుంది. దీని వల్ల ఎక్కువగా వాంతులు, డయేరియా వచ్చే అవకాశం ఉంది. 

  2. దీని వల్ల అతిగా దాహం వేస్తుంది. ఏమైనా వ్యాధులు ఉంటే ఈ వైరస్ వెంటనే సోకే ప్రమాదం ఉంది.

  3. పిల్లలు, పెద్దలు తేడా లేకుండా ఈ వైరస్ వ్యాపిస్తుంది. 

  4. ఈ వైరస్ సోకిన వారితో దగ్గరగా ఉంటే వాళ్లూ బాధితులు కాక తప్పదు. అంతేకాకుండా బాధితుల వల్ల కంటేమినేట్ అయిన ప్రాంతం నుంచి కూడా ఈ వైరస్ సోకుతోంది.


చికిత్స..


నోరో వైరస్‌కు ఇప్పటివరకు సరైన చికిత్స ఇది అని చెప్పడానికి లేదు. అయితే రికవరీ అనేది బాధిత వ్యక్తి రోగనిరోధక శక్తి పైన ఆధారపడి ఉంటుంది. ఆరోగ్యకరమైన వ్యక్తులు కొద్ది రోజుల్లోనే కోలుకుంటున్నారు. తాగు నీటి వనరులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని, చికిత్స తీసుకుంటే వ్యాధి నుంచి కోలుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.


మొదటిసారి..


1929లో తొలిసారి నోరో వైరస్‌ను గుర్తించారు. దీన్ని వాంతుల రోగంగా పిలిచేవారు. అయితే 1968లోనే దీన్ని ఓ ప్రమాదకర రోగంగా పరిగణించారు. అమెరికాలోని ఓ ఎలిమెంట్రీ పాఠశాలలో ఈ వైరస్ సోకినప్పుడు అంతా భయపడ్డారు. కానీ 1990 నుంచి మాత్రమే శాస్త్రవేత్తలు ఈ వైరస్‌పై అధ్యయనాలు మొదలు పెట్టారు.


Also Read:Business Idea: ఏం చేద్దామని ఆలోచిస్తున్నారా? ఈ పనిచేయండి.. నెలకు రూ.2 లక్షలు మీ సొంతం!


Also Read: Wife of Dawood aide: 'హార్దిక్ పాండ్య, మునాఫ్ నన్ను రేప్ చేశారు.. నగ్నంగా డ్యాన్స్ చేయించి..ఆ తరువాత'


Also read: Kangana Ranaut: 'కంగనాకు బాగా తలకెక్కింది.. పద్మశ్రీ లాగేసుకొని.. జైల్లోకి తోసేయండి'


Also read: Srinagar Encounter: కశ్మీర్‌ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం


Also read: Corona Cases: దేశంలో కొత్తగా 12,516 కరోనా కేసులు, 501 మరణాలు


Also read: ఏడ్చే మగాడిని నమ్మాల్సిందే... మగాళ్లూ హ్యాపీగా ఏడవండి, మానసిక ప్రశాంతత పొందండి


Also read: ఈ వధువు మామూలుది కాదు... పెళ్లికి పిలిచింది, పెళ్లిభోజనం మాత్రం కొనుక్కోమంది, ధరెంతో తెలుసా?


Also read: డయాబెటిస్ ఉందా... ఈ మూడూ పదార్థాలు రోజూ తినండి, ఎంతో మేలు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి