Viral Video: వర్షాకాలం వస్తే చాలు.. ఏ పాము ఎక్కడి నుంచి వస్తుందోనని భయపడుతుంటారు జనాలు. అలాంటిది ఏకంగా పాము.. షూలో తలదాచుకుంటే పరిస్థితేంటి? అవును తాజాగా అలాంటి ఘటనే జరిగింది. చెప్పుల స్టాండులో ఉన్న షూలో ఓ నాగుపాము ముడుచుకొని పడుకుంది.
ఇదీ జరిగింది
తన చెప్పుల స్టాండులో నుంచి షూ వేసుకునేందుకు వచ్చిన ఓ మహిళకు అందులో లోపల నాగుపాము ముడుచుకొని పడుకొని ఉండటం చూసి షాక్‌కు గురైంది. వెంటనే ఓ ఇనుప రాడ్‌ను షూ లోపల నెట్టడంతో నాగుపాము పడగ విప్పి మహిళను కాటు వేసేందుకు ప్రయత్నించింది. చివరికి ఎలాగోలా ఆ పామును బయటకు పంపారు.
వైరల్
ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS) అధికారి సుశాంత నంద షూలో పడుకున్న నాగుపాము వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. క్యాప్షన్‌లో వర్షాకాలంలో పలు ప్రదేశాలలో పాములు కనిపిస్తాయి కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. షూలోపల నాగుపాము పడుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది చూసిన నెటిజన్లు తమ జీవితంలో పామును చూసిన ఘటనల గురించి కామెంట్లు పెడుతున్నారు. వర్షాకాలం జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
మరో పాము
రెండు రైలు పట్టాలు కలిసే పాయింట్లో పాము దూరడంతో ఇటీవల రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఈ సంఘటన తెల్లవారుజామున పుత్తూరు రైల్వే స్టేషన్ పరిధిలో జరిగింది. రైల్వే సిగ్నల్ పడకపోవడం వల్ల స్టేషన్ మాస్టర్,పుత్తూరు సబ్ ఇన్స్పెక్టర్ శేఖర్ కి విషయం తెలియ జేశారు. సిగ్నల్ పాయింట్ దగ్గర పాము ఉందని తెలుసుకొని క్లియర్ చేశారు. బీసీఎన్ గూడ్స్ ట్రైన్ దాదాపు 30 నిమిషాల వరకు ఆగాల్సి వచ్చింది. ఈ సమయంలో ప్యాసింజర్ ట్రైన్లు ఏమి లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. పాము చనిపోయినట్లు రైల్వే అధికారులు నిర్ధరించారు.
Also Read: Russian Citizenship to Ukrainians: పుతిన్ మరో సంచలనం- ఇక ఉక్రెయిన్ వాసులకు వేగంగా రష్యా పౌరసత్వం!
Also Read: James Webb's First Images Target: విజ్ఞానశాస్త్ర ప్రపంచం ఆసక్తిగా చూస్తున్న ఫోటోలు ఇక్కడివే