రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఉక్రెయిన్ వాసులంతా త్వరితగతిన రష్యా పౌరసత్వం పొందడానికి వీలు కల్పించే ఉత్తర్వుపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సోమవారం సంతకం చేశారు.
ఏం జరుగుతుంది?
దీని ద్వారా ఉక్రెయిన్‌పై మాస్కో ప్రభావాన్ని మరింత విస్తరించే ప్రయత్నం మొదలైనట్లయింది. ఉక్రెయిన్‌లోని దొనెట్స్క్, లుహాన్స్క్, జపోరిజిజియా, ఖేర్సన్ ప్రాంతాల నుంచి వచ్చినవారికే ఇలా సులభతర విధానంలో రష్యా పౌరసత్వం లభించేది. దాదాపు ఇవన్నీ రష్యా నియంత్రణలోనే ఉండేవి.
తాజాగా ఉక్రెయిన్ మొత్తానికి ఈ విధానాన్ని వర్తింపజేయాలని పుతిన్ నిర్ణయించారు. 2019లో ఈ విధానాన్ని రెండు ప్రాంతాల వారి కోసం ప్రారంభించగా ఈ ఏడాది మే నెలలో మరో రెండు ప్రాంతాలను చేర్చారు. ఇప్పటివరకు దాదాపు 7.20 లక్షల మందికి రష్యా పాస్‌పోర్టులు జారీ అయ్యాయి. ఉక్రెయిన్ జనాభాలో 18% మంది వీటిని పొందారు.
ఉక్రెయిన్ రియాక్షన్
రష్యా అధ్యక్షుడు తీసుకున్న ఈ నిర్ణయంపై ఉక్రెయిన్ తీవ్రంగా స్పందించింది. ఇలాంటి చర్యలతో ఉక్రెయిన్‌పై పుతిన్ మరో విధంగా దాడి చేస్తున్నారని పేర్కొంది.
మరోసారి
మరోవైపు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరోసారి తండ్రి కాబోతున్నారు. ఆయనకు కుమార్తె పుట్టబోతుంది అంటూ పలు మీడియాల్లో కథనాలు వస్తున్నాయి. పుతిన్ ప్రేయసి, మాజీ జిమ్నాస్ట్ అలీనా కబయేవా ప్రెగ్నెంట్ అని వార్తలు బయటకు వచ్చాయి.
కబయేవా గర్భం దాల్చిందని, త్వరలోనే ఆమె మరోబిడ్డకు జన్మనివ్వబోతోందని సోషల్ మీడియాలో కూడా వార్తలు వస్తున్నాయి. తాజాగా జరిపిన లింగ నిర్దారణ పరీక్షల్లో ఆమెకు ఆడపిల్ల పుట్టనున్నట్లు తేలింది.
ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ అయిన రిథమిక్ జిమ్నాస్ట్ అలీనాకు పుతిన్ వల్ల ఇప్పటికే ఇద్దరు కుమారులు ఉన్నట్లు సమాచారం. 2015లో అలీనాకు కుమారుడు జన్మించాడు. 2019లో రెండో కుమారుడు జన్మించాడని స్విస్ బ్రాడ్ షీట్ వార్తా సంస్థ ఓ కథనంలో రాసుకొచ్చింది.
Also Read: James Webb's First Images Target: విజ్ఞానశాస్త్ర ప్రపంచం ఆసక్తిగా చూస్తున్న ఫోటోలు ఇక్కడివే
Also Read: James Webb Space Telescope Image: విశ్వం రహస్యం ఇదే- నాసా జేమ్స్ వెబ్ తీసిన తొలి ఫొటో విడుదల!