James Webb's First Images Target: జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోపు ఎలా పనిచేస్తుందో ఇంతకు ముందు మనం తెలుసుకున్నాం. కొన్ని మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలోని గెలాక్సీలు, నక్షత్రాల నుంచి వచ్చే ఇన్ ఫ్రా రెడ్ లైట్ ఎంత ఫెయింట్ దైనా.... తన అతిపెద్ద మిర్రర్ ద్వారా వచ్చే లైట్ ను మరింత పెంచుకునే సత్తా జేమ్స్ వెబ్ టెలిస్కోప్ కు ఉంది.  ఆ లైట్ వస్తున్న సోర్స్ మీద పరిశోధనలు చేసి అక్కడ ఎలాంటి పరిస్థితులున్నాయి..అక్కడ జీవం ఉండేందుకు ఆస్కారం ఉందా ఇలా ఎన్నో ప్రశ్నలకు జేమ్స్ వెబ్ టెలిస్కోప్ సమాధానాలు ఇవ్వనుంది.


మొదటి చిత్రాలపై






ఇప్పుడు జేమ్స్ వెబ్ టెలిస్కోప్ విడుదల చేసే ఆ మొదటి చిత్రాలపైనే అంతటా చర్చ నడుస్తుంది. అంతరిక్షంలో ఏయే ప్రాంతాల నుంచి అంటే ఎక్కడి టెలిస్కోప్ తన దృష్టిసారించి ఫోటోలు తీసిందనే అంశంపై మాత్రం డేటాను విడుదల చేసింది నాసా.


యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, కెనడియన్ స్పేస్ ఏజెన్సీ లతో కలిసి నాసా జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ను నిర్వహిస్తోంది. స్పెస్ట్రో స్కోపిక్ డేటా తో ఉండే ఫుల్ కలర్ ఇమేజెస్ ను జూలై 12 న నాసా విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. ఫలితంగా ఈ విశ్వంలో అంతుచిక్కని రహస్యాలుగా ఉండిపోయిన ఎన్నో అంశాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు.


అయితే జేమ్స్ వెబ్ తన ఫస్ట్ ఫోటోలను ఏయే కాస్మిక్ ఆబ్జెక్స్ ను టార్గెట్ చేసిందో తెలుసుకుందాం


1.Carina Nebula (నెబ్యులా కేరీనా)


మనకు కనిపించే విజిబుల్ స్పేస్ లో మనకు తెలిసిన అతిపెద్ద, ప్రకాశవంతమైన నెబ్యులా కేరీనా నే. సదరన్ కెరీనా కన్ స్టలేషన్ కు 7వేల 600 కాంతి సంవత్సరాల దూరంలో ఉండే ఈ కేరీనా నెబ్యూలాను ఫోటోగా తీయనుంది నాసా జేమ్స్ వెబ్ టెలిస్కోప్. నెబ్యూలా అంటే ఔటర్ స్పేస్ లో ఉండే క్లౌడ్ ఆఫ్ గ్యాస్ గానీ డస్ట్ గానీ అన్న మాట. ఇప్పుడు ఏదైనా అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఆకాశంలో దట్టమైన పొగ ఎలా కనిపిస్తుందో ఏ నెబ్యులాలు కూడా అలా అంతరిక్షంలో మెరుస్తూ ఉంటాయి. ఇంకో థియరీ ఏంటంటే ఈ నెబ్యులాల్లోనే స్టార్ట్స్ తయారవుతాయి. సూర్యుడి కంటే పెద్దవైన ఎన్నో స్టార్స్ కి ఈ కెరీనా నెబ్యూలా నే స్థావరమని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. 


2. WASP-96 b (spectrum)


WASP 96 b అనేది మన సౌర కుటుంబానికి బయట ఉన్న అతిపెద్ద ప్లానెట్. ఈ ప్లానెట్ మొత్తం గ్యాస్ తోనే నిండిపోయి ఉంటుంది.  భూమి నుంచి 1 వెయ్యి 150 కాంతి సంవత్సరాల దూరంలో ఉండే WASP 96b.....దాని నక్షత్రం చుట్టూ తిరగటానికి మూడు రోజుల నాలుగు గంటల సమయం పడుతుంది. మన జ్యూపిటర్ మాస్ లో సగం ఉండే ఈ గ్రహాన్ని 2014లో మన శాస్త్రవేత్తలు కనుగొన్నారు. సో మన జేమ్స్ వెబ్ ఫోటో తీస్తున్న రెండో ప్లేస్ ఇదే.


3. Southern Ring Nebula


భూమి నుంచి రెండు వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఈ సదరన్ రింగ్ నెబ్యూలానే.......... ఎయిట్ బరస్ట్ నెబ్యులా అని కూడా అంటారు.  ఓ మృతి చెందిన నక్షత్రం చుట్టూ తిరుగుతున్న ఈ ప్లానెట్ విపరీతంగా తన గ్యాస్ క్లౌడ్స్ ను ఎక్స్ పాండ్ చేస్తూ వెళ్తోంది. సో చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తున్న ఈ గ్రహాన్ని కూడా మన జేమ్స్ వెబ్ ఫొటో తీయనుంది.


4. Stephans Quintet :


ఇది చాలా చాలా పాత గెలాక్సీ గ్రూప్. 1877 లో దీన్ని మన శాస్త్రవేత్తలు కనుగొన్నారు. పెగాసస్ కన్ స్టలేషన్ లో ఉండే ఈ స్టీఫెన్ క్వింటెట్ భూమిని నుంచి 290 మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. వాస్తవానికి ఇవి మొత్తం ఐదు గెలాక్సీల సమూహమైనా స్టీఫెన్ క్వింటెట్ మధ్యలో మిగిలిన నాలుగు గెలాక్సీలు ఇరుక్కుపోవటం చాలా చాలా విచిత్రంగా అనిపిస్తోంది.


5. SMACS 0723:


SMACS 0723 అనేది ఓ మ్యాసివ్ ఫోర్ గ్రౌండ్ గెలాక్సీ క్లస్టర్ అన్న మాట. దీన్ని మ్యాగ్నిఫై చేసి అసలు దీనిలోపల ఏముందో చెక్ చేసి ఫోటోలు తీసేలా నాసా జేమ్స్ వెబ్ దృష్టి సారించింది. వాస్తవానికి ఇది చాలా దూరంలో ఉన్న ఫెయింట్ గెలాక్సీ పాపులేషన్స్ లో ఒకటైనప్పటికీ కూడా జేమ్స్ వెబ్ సత్తా ఏంటో చాటేందుకే దీని ఫోటోను విడుదల చేయనున్నారు మన శాస్త్రవేత్తలు.


మొత్తం మీద జూన్ 12 న విడుదలయ్యే ఈ ఐదు అంతరిక్ష ప్రదేశాలకు సంబంధించి విడుదల కానున్న ఆ కలర్ ఫోటోలు, స్పెక్ట్రోగ్రఫీ డేటా కోసం యావత్ ప్రపంచం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తోంది.


Also Read: James Webb Space Telescope Image: విశ్వం రహస్యం ఇదే- నాసా జేమ్స్ వెబ్ తీసిన తొలి ఫొటో విడుదల!


Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 13,615 కరోనా కేసులు- 20 మంది మృతి