ఆండ్రాయిడ్ ఫోన్‌లలో గూగుల్ ఫోటో స్కానింగ్ తెచ్చినప్పటి నుంచి కంపెనీ తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. అనుమతి లేకుండా ఆండ్రాయిడ్ పరికరాల్లో గూగుల్ కొత్త నిఘా టూల్ ఇన్‌స్టాల్ చేసిందని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. గూగుల్ ఫీచర్ యూజర్ల గోప్యత, వ్యక్తిగత డేటాపై నియంత్రణపై ఆందోళన పెంచుతోంది. కానీ తాము డేటా స్కాన్ చేయడానికి గల కారణాలు చెబుతూనే యూజర్ల డేటాను స్టోరేజీ చేయడం లేదని, ప్రైవసీ భంగం వాటిల్లిదని స్పష్టం చేసింది.

Continues below advertisement

గూగుల్ ప్రారంభ ప్రకటన ఏంటి.. ఫోర్బ్స్ రిపోర్ట్ ప్రకారం.., ఏదైనా కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టినప్పుడు, యూజర్ అనుమతి లేకుండా ఫోటోలు లేదా ఇతర కంటెంట్‌ను స్కాన్ చేయడం లాంటివి చేయడం లేదని గూగుల్ తమ వినియోగదారులకు హామీ ఇచ్చినట్లు ఫోర్బ్స్ నివేదించింది. సేఫ్టీకోర్ అనేది పరికరంలో కంటెంట్‌ను సురక్షితంగా, ప్రైవేట్‌గా ఉంచే ఒక  ఫ్రేమ్‌వర్క్. సేఫ్టీకోర్ అనేది వినియోగదారులకు కంటెంట్‌ను గుర్తించడంలో సహాయపడటానికి దోహదం చేస్తుందని గూగుల్ పేర్కొంది. ఈ ఆప్షనల్ ఫీచర్ ద్వారా యాప్‌లు కోరినప్పుడు మాత్రమే కంటెంట్‌ను కేటగిరీలుగా విభజిస్తుంది. ఫొటో స్కానింగ్ ఫీచర్ ఏ డేటాను తిరిగి Googleకి పంపదని వినియోగదారులకు సంస్థ హామీ ఇచ్చింది.

Googleకు 300 కోట్ల మంది ఆండ్రాయిడ్, ఈమెయిల్, బ్రౌజింగ్ యూజర్లు ఉన్నారు. AI స్కానింగ్, మానిటరింగ్ కు వారు తమ డివైజ్ లో అనుమతికి పరిమితులు పెట్టుకోవాలి. కొన్ని ఫీచర్లు ఉన్నప్పటికీ ఈ మధ్య కాలంలో డేటా ప్రైవసీపై ఆందోళన పెరుగుతోంది. 

Continues below advertisement

గూగుల్ మీ మెస్సేజెస్ కంటెంట్‌ను స్కాన్ చేస్తుంది.. ఫోర్బ్స్ తాజా రిపోర్ట్ ప్రకారం.. గూగుల్ ఫొటో స్కాన్ ఫీచర్ సున్నితమైన కంటెంట్‌ను స్కాన్ చేసే అవకాశం ఉంది. 9to5Google ప్రకారం, "Google Messages ఇప్పుడు ఆండ్రాయిడ్ డివైజ్ లలో అశ్లీల చిత్రాలను బ్లర్ చేయాలని హెచ్చరికలు జారీ చేస్తుంది. ఇది ఆ ఫొటోలను అస్పష్టం చేయడంతో పాటు అలాంటి కంటెంట్ హానికరం కావచ్చని వార్నింగ్ అందిస్తుంది. దాంతో వినియోగదారులకు ఆ ఫొటోలు స్పష్టంగా చూడటమో, లేక బ్లాక్ చేసే అవకాశం కల్పించింది. 

ఏఐ స్కానింగ్‌పై Google హామీ ఇదేమీ డివైజ్‌లో ఏ డేటా ఉందని పరిశీలిస్తుంది, కానీ గూగుల్‌కు తిరిగి ఏ డేటాను స్టోరేజ్ కోసం పంపదని కంపెనీ స్పష్టం చేసింది. గూగుల్ ఇచ్చిన ఈ హామీకి Android ప్రాజెక్ట్ అయిన GrapheneOS సపోర్ట్ చేస్తుంది. SafetyCore అనేది గూగుల్ తో ఏ ఇంతర సంస్థకు సైతం డేటాను తిరిగి సమర్పించదని స్పష్టం చేసింది.  అయితే గ్రాఫీన్ఓఎస్, సేఫ్టీకోర్ "కంటెంట్‌ను స్పామ్, స్కామ్‌, మాల్వేర్ గా విభజించడం కోసం  క్లయింట్-సైడ్ స్కానింగ్‌ చేస్తుందని తెలిపింది. అంటే యాప్స్ యూజర్ కంటెంట్ ను చూస్తాయి.. కానీ ఆ డేటాను షేర్ చేయడం, సేవ్ చేయడం లాంటివి చేయదు. అవసరమైతే కంటెంట్ విషయంలో యూజర్లను అలర్ట్ చేస్తాయి.

ఓపెన్-సోర్స్ పై ఆందోళనలు..గ్రాఫీన్ఓఎస్ కొత్త వ్యవస్థలో పారదర్శకత లేని కారణంగా ఓపెన్ సోర్స్ పై యూజర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సేఫ్టీకోర్ ఓపెన్-సోర్స్ కాదని, ఆండ్రాయిడ్ ఓపెన్ సోర్స్ ప్రాజెక్టుతో పాటు  మెషిన్ లెర్నింగ్ మోడల్‌ పబ్లి్క్‌గా అందుబాటులో లేవని ప్రాజెక్ట్ విచారం వ్యక్తం చేసింది. ఓపెన్-సోర్స్ లేకపోవడంతో డేటా దుర్వినియోగం అవుతుందని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 

గూగుల్ కొత్త ఫోటో స్కానింగ్ టెక్నాలజీ ఆండ్రాయిడ్ పరికరాల్లో కంటెంట్‌ను స్కాన్ చేయడం ద్వారా యూజర్లకు గోప్యత, భద్రతను అందిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. కానీ ఓపెన్-సోర్స్ లో పారదర్శకత లేకపోవడం వల్ల డేటా దుర్వినియోగం అవుతుందని ఆందోళన పెరుగుతోంది.