Corona Cases: దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది. కొత్తగా 13,615 కరోనా కేసులు నమోదయ్యాయి. 20 మంది మృతి చెందారు. కొవిడ్​ నుంచి తాజాగా 13,265 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీ రేటు 98.50 శాతానికి పడిపోయింది.







  • డైలీ పాజిటివిటీ రేటు: 3.23 శాతం

  • మొత్తం మరణాలు: 5,25,474

  • యాక్టివ్​ కేసులు: 1,31,043

  • మొత్తం రికవరీలు: 4,29,96,427


వ్యాక్సినేషన్







దేశంలో కొత్తగా 10,64,038 మందికి టీకాలు అందించారు. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 1,99,00,59,536కు చేరింది. మరో 4,21,292 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.


కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్రం.. రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. కరోనా నిబంధనలను తప్పకుండా పాటించేలా చూడాలని తెలిపింది. కరోనా టెస్టులను పెద్ద ఎత్తున నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. మాస్కులు తప్పనిసరిగా వినియోగించాలని కోరింది. మరోవైపు వ్యాక్సినేషన్ కార్యక్రామాన్ని కూడా వేగంగా కొనసాగించాలని నిర్ణయించింది కేంద్ర ఆరోగ్య శాఖ


కరోనా ఫోర్త్ వేవ్ వచ్చే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే పలు రిపోర్ట్‌లు వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో భారత్‌లో కూడా ఫోర్త్ వేవ్ వచ్చే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 


Also Read: Netizens Fires on Gaana App: ‘గానా’ యాప్‌పై నెటిజన్లు ఫైర్! బ్యాన్ చేయాలని డిమాండ్, ట్విటర్‌లో ట్రెండింగ్ - ఎందుకంటే


Also Read: Aircraft Mayday Calls: విమానంలో పైలట్ ‘మే డే’ అని ఎందుకు అంటాడు? దీనివల్ల ఎంత నష్టం ఆపొచ్చో తెలుసా?