ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. లఖ్‌నవూలోని ఎకానా స్టేడియంలో వరుసగా రెండోసారి సీఎంగా యోగి ప్రమాణ స్వీకారం చేస్తారు.  అయితే ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథి కాగా ఆయనతో పాటు పలువురు రాజకీయ, సినీ, పారిశ్రామిక దిగ్గజాలు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.


బాలీవుడ్ సెలబ్రిటీలు



  1. బోనీ కపూర్

  2. అక్షయ్ కుమార్

  3. కంగనా రనౌత్

  4. అజయ్ దేవగణ్


ప్రత్యేక అతిథులు


వీరితో పాటు ద కశ్మీర్ ఫైల్స్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి, నటుడు అనుపమ్ ఖేర్ సహా ఆ చిత్ర బృందం ప్రత్యేక అతిథులుగా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. 


రాజకీయ ప్రముఖులు



  1. కేంద్ర హోంమంత్రి అమిత్ షా

  2. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా

  3. భాజపా పాలిత రాష్ట్రాల సీఎంలు, ఉపముఖ్యమంత్రులు సహా 13 అఖాడాల ప్రతినిధులు కూడా హాజరుకానున్నారు.


వ్యాపార దిగ్గజాలు



  1. ముకేశ్ అంబానీ

  2. గౌతమ్ అదానీ

  3. కుమార మంగళం బిర్లా

  4. ఎన్ చంద్రశేఖర్

  5. ఆనంద్ మహీంద్రా

  6. సంజీవ్ గొయెంకా

  7. వీరితో పాటు మొత్తం 20 వేల మంది ప్రమాణస్వీకారానికి హాజరుకానున్నట్లు భాజపా తెలిపింది.


భారీ విజయం


ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని భాజపా భారీ విజయాన్ని సాధించింది. వరుసగా రెండోసారి యూపీలో సర్కార్‌ను ఏర్పాటు చేయనుంది. 


గోరఖ్‌పుర్ అర్బన్ నుంచి పోటీ చేసిన యోగి.. 1,03,390 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం యోగికి ఇదే తొలిసారి. యూపీ సీఎంగా ఐదేళ్ల పాటు పూర్తి పదవీకాలం పనిచేసి ఓ ముఖ్యమంత్రి తిరిగి అధికారంలోకి రావడం 37 ఏళ్లలో ఇదే తొలిసారి.


403 అసెంబ్లీ స్థానాల్లో 255 సీట్లు గెలుచుకుంది భాజపా. తన మిత్రపక్షం అప్నాదళ్ (ఎస్)కు 12 స్థానాలు దక్కాయి. మరో మిత్రపక్షం నిషాద్ పార్టీ 6 చోట్ల గెలుపొందింది.


మరోవైపు ప్రధాన ప్రతిపక్షంగా నిలిచిన సమాజ్‌వాదీ పార్టీకి 111 సీట్లు దక్కాయి.


Also Read: Hijab Row: 'హిజాబ్‌' అంశాన్ని సంచలనం చేయొద్దు- అత్యవసర విచారణకు సుప్రీం నో


Also Read: Ukraine Russia War: అణ్వాయుధాల వినియోగంపై రష్యా సంచలన వ్యాఖ్యలు- అమెరికా సీరియస్