పిల్లి ఏం చేస్తుంది? మహా అయితే వంటింట్లో దూరి పాలు తాగుతుంది. లేదా ఏ ఎలుకో కనబడితే దాన్ని పట్టుకుంటింది. మీరు కూడా ఇలానే అనుకుంటున్నారా? కానీ ఓ పిల్లి ఊహించిన దాని కన్నా ఎక్కువే చేసింది. ఏకంగా రూ. 100 కోట్ల నష్టానికి కారణమైంది. అంతేనా 60 వేల విద్యుత్ కనెక్షన్లు తెగిపోయేలా చేసింది. షాకయ్యారా? అసలేమైందో చూడండి.







ఏం జరిగింది?


మహారాష్ట్రలోని పుణె పట్టణం శివార్లలో పింప్రీ-చించ్వడ్ అనే ప్రాంతంలో వ్యాపారాలు ఎక్కువగా జరుగుతాయి. అయితే ఓ పిల్లి అక్కడున్న ట్రాన్స్ మిషన్ సబ్ స్టేషన్ లోని ట్రాన్స్ ఫార్మర్ మీదకు ఎక్కింది. అయితే అక్కడే అసలు చిక్కు మొదలైంది.


ఆ పిల్లి ట్రాన్స్ ఫార్మర్ మీదకు ఎక్కడంతో షార్ట్ సర్క్యూట్ అయింది. దీంతో అక్కడి పారిశ్రామిక వాడ భోసారితోపాటు ఆ ప్రాంతంలో ఉన్న 60 వేల మంది విద్యుత్ వినియోగదారులకు కరెంట్ సరఫరా కట్ అయింది. ఈ ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న దాదాపు 7000 మంది వ్యాపారస్తుల దుకాణాలకు విద్యుత్ నిలిచిపోయింది.


లెక్కకడితే


పిల్లి చేసిన ఈ పని వల్ల దాదాపు రూ.100 కోట్లకు పైగా నష్టం వాటిల్లి ఉంటుందని అధికారులు అంచనా వేశారు. అధికారులు స్పందించి వెంటనే సమస్యను పరిష్కరించాలని ఆ ప్రాంత కుటీర పరిశ్రమల సంఘం అధ్యక్షుడు సందీప్ బెల్ సారె కోరారు.


మరో మూడు రోజుల పాటు పునరుద్ధరణ అవకాశాలు కనిపించడం లేదు. విద్యుత్తు పొదుపుగా వాడాలని, భారమంతా సింగిల్ ట్రాన్స్ఫార్మర్ల పై పడుతోందని అధికారులు విజ్ఞప్తి చేశారు. విద్యుత్ శాఖ మంత్రితోపాటు ఆ శాఖ ఉన్నతాధికారులు ఇప్పుడు కరెంట్ సరఫరాను మళ్లీ పూర్తిస్థాయిలో పునరుద్ధరించే పనిలో పడ్డారు. రూ. 100 కోట్ల ఆస్తి నష్టానికి పిల్లి కారణమంటే సిల్లీగా ఉంది కదా! కాని ఇది నిజం.


Also Read: Travel: వేసవిలో కుటుంబంతో విహరించేందుకు చల్లని డెస్టినేషన్‌లు ఇవిగో, ట్రిప్ అదిరిపోవడం ఖాయం


Also Read: Russia Ukraine War: 4 వారాల్లో ప్రపంచాన్నే మార్చేసిన రష్యా- ఉక్రెయిన్ యుద్ధం- నెగ్గేదెవరు? తగ్గేదెవరు?