ఆసియాలోనే అతి పెద్ద తులిప్ గార్డెన్ ఇది. శ్రీనగర్లోని ప్రసిద్ధ దాల్ సరస్సుకు ఎదురుగా ఉన్న జబర్వాన్ పర్వత శ్రేణి ఉంటుంది. ఆ పర్వత శ్రేణి మధ్యలోనే ఉంటుంది ఈ తులిప్ గార్డెన్. ఏడాది తరువాత దీన్ని ప్రజల సందర్శనార్థం తెరిచారు. రంగురంగుల తులిప్ పూలను చూసేందుకు వేల మంది బారులు తీరారు. ప్రతి ఏడాది ఇదే సమయానికి తులిప్ గార్డెన్‌ను ప్రభుత్వం  ఓపెన్ చేస్తుంది. ఎందుకంటే ఆ సమయానికే మొక్కలు బాగా పెరిగి, పూలు పుష్పించి చాలా అందంగా కనిపిస్తుంది తోట. దాదాపు 74 ఎకరాల్లో పరుచుకుని ఉంటుంది తులిప్ తోట. దీన్ని 2008లో ప్రారంభించారు. ఈ గార్డెన్లో దాదాపు 15 లక్షల తులిప్ మొక్కలు ఉన్నాయి. వాటన్నింటికీ పువ్వులు పూస్తే ఎలా ఉంటుందో ఓసారి ఊహించుకోండి. కాస్త దూరం నుంచి చూస్తే రంగురంగుల పూల పరదాలా ఉంటుంది. అందుకే ఎంతో మంది పర్యాటకులు చూసేందుకు వెళతారు.తాజా గాలి వీస్తుంటే ఇంద్రధనుస్సులాంటి పూల మధ్య విహరిస్తుంటే ఆ ఫీలింగ్ మామూలుగా ఉండదు. వేసవి సెలవుల్లో కాశ్మీర్‌కి వెళ్లేవారి సంఖ్య కూడా ఎక్కువే. కాశ్మీర్ వెళితే కచ్చితంగా చూడాల్సిన ప్రదేశం ఇది.  











Also read: ఈ అలవాట్లు మీకున్నాయా? వేసవిలో వీటిని దూరం పెట్టాల్సిందే


Also read: త్వరలో మగవారికీ గర్భనిరోధక మాత్రలు, అవి వస్తే ఆడవారి కష్టాలు తీరినట్టే



Also read: చర్మక్యాన్సర్ వచ్చిన విషయాన్ని కళ్లు చెబుతాయా? లక్షణాలెలా ఉంటాయి?