Viral News: సాధారణంగా పాము కాటేస్తే ఏం చేస్తాం? వెంటనే విషం పైకి ఎక్కకుండా కాటేసిన చోటి కన్నా కొంచెం పైన ఏదైనా గుడ్డతో గట్టిగా కడతాం. తర్వాత బాధితుడ్ని వీలైనంత త్వరగా ఆసుపత్రికి తీసుకెళ్తాం. అయితే ఉత్తర్‌ప్రదేశ్‌లో మాత్రం ఓ వ్యక్తి డాక్టర్లే అవాక్కయ్యేలా చేశాడు.
ఇదీ జరిగింది
ఉత్తర్‌ప్రదేశ్ అఫ్జల్ నగర్‌లో ఓ వ్యక్తి తన భార్యను పాము కరిస్తే.. భార్యతో పాటు, ఆ పామును సీసాలో వేసి బంధించి ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ఆ పామును చూసి వైద్య సిబ్బంది అవాక్కయ్యారు. పామును ఆసుపత్రికి ఎందుకు తెచ్చావ్? అని అడిగిన ప్రశ్నకు ఆ భర్త ఇచ్చిన సమాధానం విని అంతా అవాక్కయ్యారు.
ఇదేందిరా సామీ
అఫ్జల్ నగర్‌లో నివసించే రామేంద్ర యాదవ్ భార్యను పాము కాటేసింది. దీంతో అక్కడే ఉన్న రామేంద్ర యాదవ్ ఆ పామును పట్టుకొని ప్లాస్టిక్ సీసాలో బంధించాడు. భార్యతోపాటు పామును కూడా స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లాడు. పామును ఎందుకు తీసుకొచ్చావ్? అని వైద్యులు అతడిని ప్రశ్నించారు.
"నా భార్యకు ఏ పాము కరిచిందని మీరు అడిగితే నేనేం చెప్పాలి. అందుకే పామును తీసుకొచ్చాను. ఇక ఏ పాము కరిచిందో మీరే చూసుకొని వైద్యం చేయొచ్చు" అని సమాధానమిచ్చాడు. ఈ ఆన్సర్ విని అక్కడున్న వైద్య సిబ్బంది షాకయ్యారు. పాముకు ఊరిరాడేలా ప్లాస్టిక్ బాటిల్‌కు రంధ్రాలు చేశాడు రామేంద్ర యాదవ్. .
విడిచిపెట్టేది లేదు
అంతేకాదు అతని భార్య ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యాకే పామును సమీపంలోని అడవిలో విడిచిపెడతానని రామేంద్ర యాదవ్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
ఇటీవల
బిహార్‌లో ఇటీవల నాలుగేళ్ల బాలుడిని కరిచి ఓ పాము క్షణాల్లోనే మృతి చెందింది. బిహార్‌లోని గోపాల్‌గంజ్‌లో బుధవారం ఈ ఘటన జరిగింది. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు బాలుడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. బాలుడు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ విషయం చుట్టు పక్కల ప్రాంతాలకు తెలియడం వల్ల అనేక మంది బాలుడిని చూడడానికి వచ్చారు.
Also Read: Gleycy Correia Passes Way: టాన్సిల్స్ తీస్తే చనిపోతారా? పాపం, మాజీ మిస్ బ్రెజిల్‌కు ఏమైంది?