Maharashtra Political Crisis: మహారాష్ట్ర రాజకీయం రోజురోజుకు వేడెక్కుతోంది. శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్‌ను భాజపా బెదిరిస్తోందని సంజయ్ ఆరోపించారు. పవార్‌ను బెదిరించి మహారాష్ట్రలో తిరగగలరా అంటూ సవాల్ విసిరారు.
మహా వికాస్ అఘాడీ(ఎమ్‌వీఏ) కూటమి ప్రభుత్వాన్ని కాపాడేందుకు శరద్ పవార్ ప్రయత్నిస్తే ఇంటికి వెళ్లనివ్వబోమని, రోడ్డుపై అడ్డుకుంటామని ఓ కేంద్ర మంత్రి బెదిరించారు. ఒకవేళ ఈ పని చేసింది భాజపానే అయితే బయటకు చెప్పుకోండి. ప్రభుత్వం ఉండినా, ఊడినా శరద్ పవార్ లాంటి నేత మీద ఇలాంటి మాటలు ఆమోదయోగ్యం కాదు. ఈ బెదిరింపులను ప్రధాని మోదీ, అమిత్ షా సమర్థిస్తారా? - సంజయ్ రౌత్, శివసేన ఎంపీ
ఎమ్మెల్యేలకు అల్టిమేటం
మరోవైపు రెబల్ ఎమ్మెల్యేలకు సంజయ్ రౌత్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ముంబయికి చేరుకునే అవకాశం ఇచ్చిన రెబల్ ఎమ్మెల్యేలు రాలేదని. ఇక బలపరీక్షలోనే తేల్చుకుంటామన్నారు.
సీఎం ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్ నిరంతరం టచ్‌లో ఉన్నారు. ఎన్‌సీపీ, కాంగ్రెస్, శివసేన నేతలంతా పరస్పరం టచ్‌లో ఉన్నారు. మా బలమేంటో పరీక్షలో నెగ్గి చూపిస్తాం. వాళ్లు ( రెబల్ ఎమ్మెల్యేలు) చాలా రాంగ్ స్టెప్ తీసుకున్నారు. ముంబయికి తిరిగి వచ్చే అవకాశం కూడా ఇచ్చాం. ఇప్పుడు, ముంబయికి రావాలని వాళ్లను సవాలు చేస్తున్నాం. ఇంటా(అసెంబ్లీ).. బయటా(రోడ్లపై) పోరాటం ఏదైనా గెలుపు మాత్రం మాదే. బలనిరూపణతోనే తేల్చుకోవాలని వాళ్లకు సవాల్ విసురుతున్నా. మా ప్రభుత్వం మిగిలిన రెండున్నరేళ్లు కూడా పూర్తి చేసుకుని తీరుతుంది. - సంజయ్ రౌత్, శివసేన ఎంపీ
Also Read: CM Shivraj Chouhan: మధ్యప్రదేశ్ సీఎం మాస్ స్టెప్పులు- ఏం డ్యాన్స్ ఏసినవ్ కాకా!