Presidential Election 2022: ద్రౌపదీ ముర్ము శుక్రవారం ఉదయం ఎన్‌డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు. రిటర్నింగ్‌ అధికారిగా వ్యవహరిస్తున్న రాజ్యసభ సెక్రటరీ జనరల్‌ పీసీ మోదీకి ఆమె నామపత్రాలు సమర్పించారు.






ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్‌షా, భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు కేంద్ర మంత్రులు, భాజపా, ఎన్డీయే రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


ప్రతిపాదించిన మోదీ


మొదటగా ప్రధాని ఆమె పేరును ప్రతిపాదించారు. కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ సహా నామినేషన్‌ పత్రాలను 50 మంది ఎలక్టోరల్‌ కాలేజీ సభ్యులు ప్రతిపాదించి, మరో 50 మంది బలపరిచారు.






నామపత్రాల దాఖలుకు ఒకరోజు ముందుగా గురువారమే దిల్లీకి చేరుకున్నారు ముర్ము. గిరిజన నృత్యాలతో, సంప్రదాయ దుస్తులతో వచ్చిన అభిమానులతో అక్కడంతా కోలాహలం కనిపించింది.


అనంతరం ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ముర్ము మర్యాదపూర్వకంగా కలిశారు.


ఇక ప్రచారం షురూ


నామినేషన్ పూర్తి కావడంతో ద్రౌపది ముర్ము కీలక రాష్ట్రాల్లో ఒక్కోరోజు ప్రచారం చేసే అవకాశం ఉంది. ఛత్తీస్‌గఢ్‌, ఉత్తరాఖండ్‌, ఝార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, బిహార్‌ రాష్ట్రాలకు ఆమెను ఆహ్వానించి మద్దతు కోరేలా భాజపా ప్రణాళికలు చేసినట్లు సమాచారం. 


Also Read: CM Shivraj Chouhan: మధ్యప్రదేశ్ సీఎం మాస్ స్టెప్పులు- ఏం డ్యాన్స్ ఏసినవ్ కాకా!


Also Read: New York Gun Law: తుపాకీల వాడకంపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు- అధ్యక్షుడు బైడెన్‌కు షాక్!