Gleycy Correia Passes Way: సర్జరీలు వికటించి అందవికారంగా మారిన సెలబ్రెటీల గురించి, ప్రాణాలు కోల్పోయిన ప్రముఖుల గురించి మనం వినే ఉంటాం. అయితే అవన్నీ కాస్త ప్రమాదకర సర్జరీలు అయి ఉండొచ్చు. అయితే ఓ సాధారణ సర్జరీ వికటించడం వల్ల ప్రాణాలు కోల్పోయింది మాజీ మిస్ బ్రెజిల్ గ్లెసీ కొర్రెయియా.
ఏమైంది?
గ్లెసీ కొర్రెయియా ఓ మోడల్, బ్యూటీషియన్. అంతే కాదు 2018లో ఆమె మిస్ బ్రెజిల్ కిరీటం గెల్చుకుంది. ఆ తర్వాత సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా ఎంతో పేరు తెచ్చుకుంది. అయితే గొంతు టాన్సిల్స్ తొలగించుకునేందుకు 2022 ఏప్రిల్ 4న ఆమె సాధారణ సర్జరీ చేయించుకుంది.
కోమాలోకి
అయితే ఏమైందో ఏమో కానీ నాలుగు రోజుల తర్వాత మెదడులో రక్తస్రావంతో పాటు గుండెపోటు వచ్చింది. దీంతో కోమాలోకి వెళ్లిపోయింది. అయితే కోలుకుంటుందనుకున్న సమయంలో ప్రాణం మీదకు వచ్చింది. రెండు నెలలు కోమాలో ఉన్న ఈ బ్యూటీ జూన్ 20న కన్నుమూసింది. దీంతో మోడలింగ్ రంగంతో సహా బ్రెజిల్‌లోని తన అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
వికటించిందా?
ఓ ప్రైవేట్ క్లినిక్‌లోనే రెండు నెలల పాటు ఆమె కోమాలో ఉంది. అయితే వైద్యులు ఎంత ప్రయత్నించినా ఆమెను కాపాడలేకపోయారు. మోడలింగ్ రంగంలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ 27 ఏళ్లకే మరణించడంతో కుటుంబం, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.
Also Read: 2002 Gujarat Riots: ఆ కేసులో మోదీకి క్లీన్ చిట్‌ను సమర్థించిన సుప్రీం కోర్టు