Tweet on Draupadi Murmu: రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముపై ఆర్‌జీవీ వివాదాస్పద ట్వీట్- భాజపా ఫైర్!

ABP Desam Updated at: 24 Jun 2022 03:40 PM (IST)
Edited By: Murali Krishna

Tweet on Draupadi Murmu: రామ్‌ గోపాల్ వర్మ మరో కాంట్రవర్సీకి తెరలేపారు. ఈ సారి ఏకంగా ఎన్‌డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముపైనే అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముపై ఆర్‌జీవీ వివాదాస్పద ట్వీట్- భాజపా ఫైర్!

NEXT PREV

Tweet on Draupadi Murmu: ఎన్‌డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముపై ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ (ఆర్‌జీవీ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ ఫైర్ అయింది. రాష్ట్రపతి అభ్యర్థిపై ఆర్‌జీవీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండించింది.


ఆర్‌జీవీపై కేసు


రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలపై హైదరాబాద్ అబిడ్స్ పోలీస్ స్టేషన్‌లో భాజపా నేతలు ఫిర్యాదు చేశారు. NDA రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపతి ముర్మును కించపరిచే విదంగా వర్మ ట్వీట్ చేశారని ఫిర్యాదులో భాజపా నేతలు పేర్కొన్నారు. 


రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని అబిడ్స్ పోలీసులను భాజపా నేతలు గూడూరు నారాయణరెడ్డి , మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కోరారు.


రియాక్షన్


తన వ్యాఖ్యలపై భాజపా ఫైర్ అవడంతో ఆర్‌జీవీ రియాక్ట్ అయ్యారు. తాను ఏ ఒక్కరినీ ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేయలేదని చెప్పుకొచ్చారు.






నేను చేసిన వ్యాఖ్యలు ఎవరినీ ఉద్దేశించి చేసినవు కావు. ఎవరి మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశంతో చేసిన వ్యాఖ్యలు కాదు.                                                                                                                               - ఆర్‌జీవీ, సినీ దర్శకుడు

 


 


Published at: 24 Jun 2022 03:40 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.