Ukraine Russia Conflict: రష్యా సైనిక చర్య, దాడులతో ఉక్రెయిన్‌ దేశం విలవిల్లాడుతోంది. ఓవైపు పోరాడుతూనే మరోవైపు ఇతర దేశాలను ఉక్రెయిన్ అధక్షుడు జెలెన్ స్కీ సాయం కోరుతున్నారు. ఉక్రెయిన్‌ సంక్షోభంలో చిక్కుకున్న పౌరులను భారతదేశానికి తీసుకువచ్చేందుకు కేంద్రం ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ గంగ కొనసాగిస్తోంది. నేటి ఉదయం బుకారెస్ట్ నుంచి 249 మందిని స్వదేశానికి తీసుకొచ్చారు. 


ఢిల్లీ చేరుకున్న ఐదో విమానం.. 
ప్రధాని మోదీ సర్కార్ కట్టుదిట్టమైన చర్యలతో ఐదవ విమానం నేటి ఉదయం ఢిల్లీ (Indians stranded in Ukraine reaches Delhi airport)కి చేరుకుంది. తొలి మూడు విమానాలలో ఇదివరకే 700కు పైగా భారతీయులను స్వదేశానికి తీసుకురాగా, ఆదివారం మరో విమానం భారత్‌కు పౌరులను క్షేమంగా తీసుకొచ్చింది. సోమవారం ఉదయం 249 మందిని రొమేనియాలోని బుకారెస్ట్ నుంచి తీసుకొచ్చిన విమానం ఢిల్లీకి చేరుకుంది. బాంబు మోతలు, తుపాకీ కాల్పుల మోతలతో దద్దరిల్లిన ఉక్రెయిన్ నుంచి తమను క్షేమంగా స్వదేశానికి ప్రభుత్వం తీసుకురావడంపై వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తోంది.. 
భారత్ చేరుకున్న తరువాత విద్యార్థులు జాతీయ మీడియా ఏఎన్ఐతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం మాకు చాలా సాయం చేసింది. భారత ఎంబసీ అధికారులు మన పౌరులను స్వదేశానికి తీసుకురావడానికి శ్రమిస్తున్నారు. అసలు సమస్య ఏంటంటే.. ఉక్రెయిన్ సరిహద్దులు దాటి రొమేనియాకు రావడం. అక్కడ చిక్కుకున్న మిగతా భారతీయులు కూడా క్షేమంగా తిరిగి రావాలని ఆకాంక్షిస్తున్నాం. ఇంకా ఎంతో మంది ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయారు. తమ వారిని చూడాలని, ఇళ్లకు త్వరగా చేరుకోవాలని ఆశగా ఎదురుచూస్తున్నారని ఉక్రెయిన్ నుంచి ఢిల్లీకి చేరుకున్న విద్యార్థులు చెప్పారు. 






నేటి ఉదయం ఢిల్లీకి చేరిన విమానం..






చర్చలకు ఉక్రెయిన్ ఓకే.. కానీ !
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆహ్వానం మేరకు తప్పని పరిస్థితుల్లో ఉక్రెయిన్ చర్చలకు అంగీకరించింది. తటస్థ వేదికగా ఈ రెండు దేశాల అధినేతలు సమావేశం కానున్నారు. చర్చలకు ఆహ్వానిస్తూనే ప్లాన్ బీని పుతిన్ సిద్ధం చేస్తున్నారు. చర్చలు విఫలమైతే అణ్వాయుధాలను ఉక్రెయిన్‌పై ప్రయోగించేందుకు సిద్ధంగా ఉండాలని సైన్యానికి పుతిన్ సూచించినట్లు సమాచారం. రష్యా చీఫ్ ఆఫ్ ద జనరల్ స్టాఫ్ (సీజీఎస్)కు పుతిన్ ఆదేశాలు ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. తన చర్యలతో పశ్చిమ, నాటో సభ్య దేశాలు రష్యాకు సవాల్ విసురుతోంది.


Also Read: PM Modi Meeting: ఉక్రెయిన్ సంక్షోభంపై ప్రధాని మోదీ హైలెవల్ మీటింగ్, భారతీయుల తరలింపుపై చర్చ!


Also Read: Russia-Ukraine Crisis: 'అణ్వాయుధాలు రెడీ చేయండి'- మరో బాంబు పేల్చిన పుతిన్, అంతా హైటెన్షన్