Two gunners guarding the street vendors: ఉత్తరప్రదేశ్‌లోని ఎటావా జిల్లాలో రామేస్వర్ అనే వ్యక్తి  తోపుడు బండి మీద పాత బట్టలు విక్రయిస్తూ ఉంటారు. మామూలుగా అయితే ఆయనను ఎవరూ పట్టించుకోరు. ఇక కొట్టే వరకూ ఎవరూ రారు. కానీ హఠాత్తుగా ఆయన మాత్రం తన వెనుక ఇద్దరు సెక్యూరిటీతో కనిపిస్తున్నారు. ఏకే -47 వెపన్లతో వారు రామేశ్వర్‌ను కాపాడుకుంటున్నారు. 


మైనింగ్ మాఫియా దారుణం- DSPని లారీతో ఢీకొట్టి హత్య!





అందర్నీ ఆకర్షించడానికి రామేశ్వర్ ఈ ట్రిక్ ప్లే చేయలేదు. నిజంగానే అతనికి ప్రభుత్వం ఈ గన్‌మెన్ సౌకర్యాన్ని కల్పించింది. అలా అని.. అత్యంత నిజాయితీపరుడైన ఎమ్మెల్యేనో..ఎంపీనో కాదు. నిరుపేద చిరు వ్యాపారే. అయితే ఈ సెక్యూరిటీ కల్పించడానికి ఓ రీజనబుల్ రీజన్ ఉంది. అది కాస్త సినిమా స్టోరీగా దగ్గరగా ఉంటుంది.  


తాత్కాలిక ఉపాధ్యాయులను పర్మినెంట్ చేసే ప్రతిపాదన లేదు, తేల్చేసిన కేంద్రం


రామేశ్వర్‌కు తన స్వగ్రామంలో కాస్త భూమి ఉంది. కానీ దానికి పట్టా లేదు. అందుకే తన భూమికి పట్టా ఇప్పించాలంటూ ఎస్పీ నేత, మాజీ ఎమ్మెల్యే రామేశ్వర్ సింగ్​ సోదరుడు జుగేంద్ర సింగ్‌ను కలిశారు. అయితే వీరిద్దరి మధ్య వివాదం తలెత్తింది. మాటకు మాట అనుకున్నారు.  దీంతో జుగేంద్ర సింగ్​.. తనను కులం పేరుతో దూషించారని రామేశ్వర్ పోలీస్ స్టేషన్‌లో   ఫిర్యాదు చేశారు దయాల్. దీనిపై జుగేంద్ర సింగ్​ హైకోర్టుకు వెళ్లారు. రామేశ్వర్ చేసిన ఆరోపణలన్నీ తప్పని.. ఈ కేసును కొట్టివేయాలని కోర్టును కోరారు. 


అక్రమ మద్యం కేసులో కుక్క అరెస్ట్ - ఆ తర్వాత ప్రారంభమయ్యాయి పోలీసుల కష్టాలు !
 
విచారణలో  రామేశ్వర్ ను కోర్టులో హాజరు కావాలని ఆదేశించింది. కోర్టుకు వచ్చిన రామేశ్వర్‌ను  చూసిన న్యాయమూర్తి.. ఆశ్చర్యానికి గురయ్యారు. ఓ బాధితుడికి ఎందుకు భద్రత కల్పించలేదని పోలీసులను ప్రశ్నించారు. బాధితుడికి ఇద్దరు బాడీగార్డ్స్ ను భద్రతగా నియమించాలని ఆదేశించారు. ఈ కారణంగా ఆయనకు భద్రత వచ్చింది. ఈ భద్రత ఇప్పుడు రామేశ్వర్‌కు ప్రత్యేక గుర్తింపు తెచ్చి పెడుతోంది.  కొత్తగా కస్టమర్లు వస్తున్నారు.  ఈ బాడిగార్డ్స్ ఎన్ని రోజులు ఉంటారో కానీ రామేశ్వర్‌ గురించి ఊరంతా చెప్పుకోవడం ప్రారంభించారు . అతనికి ఇప్పుడు గిరాకీ కూడా పెరుగుతోంది. 


భారత్ - చైనా సరిహద్దులో 18 మంది మిస్సింగ్- ఒకరు మృతి !