మంత్రి కూతుర్ని సామాన్యుడు ప్రేమిస్తాడు. కానీ మంత్రి ఒప్పుకోడు. పైగా తన అధికారాన్ని ఉపయోగించి పోలీసుల్ని ప్రయోగించి వేధిస్తాడు. చివరికి ఆ ప్రేమికుడు మంత్రి కూతుర్ని తీసుకెళ్లి గుళ్లో పెళ్లి చేసుకుంటాడు.  తమిళనాడులో ఇలాంటి స్టోరీలతో చాలా సినిమాలు వచ్చాయి. కానీ అక్కడ సూపర్ హిట్ సినిమాలన్నీ విషాదాంతాలే. అలా ప్రేమ పెళ్లిళ్లు ఎక్కువగా విఫలం చేసే స్టోరీలు బాక్సాఫీస్ వద్ద కాసులు రాలుస్తంటాయి. కానీ నిజ జీవితంలో మాత్రం అక్కడి ప్రేమికులు ఫెయిల్యూర్ చూడరు..సక్సెస్సే ఎక్కువ చూస్తారు. దానికి ఉదాహరణగా.. తాజాగా తమిళనాడు మంత్రి శేఖర్ బాబు కుమార్తె ప్రేమ , పెళ్లి వ్యవహారం నిలుస్తోంది. 


నిరుద్యోగులకు కేసీఆర్ టీజర్ - బుధవారం ఉ. 10 గంటలకు అసెంబ్లీలో అసలు ప్రకటన !


తమిళనాడు డీఎంకే సీనియర్ నేత, మంత్రి శేఖర్‌బాబు కుమార్తె జయకళ్యాణి ..సతీష్  అనే యువకుడ్ని ప్రేమించింది.ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ జయకల్యాణి తండ్రి .. మంత్రి శేఖర్ బాబు అంగీకరించలేదు. పైగా సతీష్‌ను రెండు నెలలపాటు పోలీసులతో నిర్బంధించారు. తర్వాత  బయటకు వచ్చిన సతీష్ జయకల్యాణిని తీసుకుని వెళ్లి  బెంగళూరులోని హిందూ ధార్మిక సంస్థలో సోమవారం పెళ్లి చేసుకున్నారు.  తమ ప్రేమకు ఇంట్లో పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఇలా ప్రేమ పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని జయకళ్యాణి వీడియో విడుదల చేసింది.  అయితే తన తండ్రి నుంచి తమకు ప్రాణ హాని ఉందని ఆమెతో పాటు ఆమె భర్త  పోలీసులను ఆశ్రయించారు. తమకు రక్షణ కల్పించాలని కోరారు. 



 తమిళనాడులో అడుగుపెడితే చంపేస్తామని తమ తల్లిదండ్రులు బెదిరిస్తున్నారని.. కాబట్టి పోలీసులు తమకు రక్షణ కల్పించాలని కోరుతూ తమిళనాడు సీఎం స్టాలిన్‌కు ఈ కొత్త జంట ఓ వీడియో కూడా విడుదల చేసింది.  తమిళనాడు సీఎం స్టాలిన్‌కు మంత్రి శేఖర్‌బాబు అత్యంత సన్నిహితుడు. సాధారణంగా మంత్రి కుమార్తె లవ్ స్టోరీ.. అందులోనూ వీరు ఇంట్లో వారిని ఎదురించి పెళ్లి చేసుకున్నారు..పైగాతండ్రి చంపేస్తామని బెదిరిస్తున్నారని పోలీసులను కూడా ఆశ్రయించింది. అందుకే వీరి లవ్ మ్యారేజ్ ఇప్పుడు తమిళనాడులో హాట్ టాపిక్ అవుతోంది. 


ఆకాశయానం మళ్లీ మొదలు, రెండేళ్ల తర్వాత ఇంటర్నేషనల్‌ ఫ్లైట్స్‌ సర్వీసులు స్టార్ట్‌


కుమార్తె లవ్ మ్యారేజ్‌పై మంత్రి శేఖర్ బాబు కుటుంబం ఇంత  వరకూ స్పందించలేదు.  తమ కుమార్తె ప్రేమ వివాహాన్ని అంగీకరిస్తామని కానీ..లేదా వ్యతిరేకిస్తామని కానీ ఎలాంటి ప్రకటనా చేయలేదు. తమ కుటుంబ అంశం రాజకీయం చేయవద్దని.. మంత్రి కుటుంబీకులు చెబుతున్నారు.