Happy Women's Day 2022: 'నారీశక్తి'కి సెల్యూట్- మహిళలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

ABP Desam Updated at: 08 Mar 2022 02:17 PM (IST)
Edited By: Murali Krishna

దేశ ప్రగతిలో భాగమైన ప్రతి మహిళకు శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ.

'నారీశక్తి'కి సెల్యూట్- మహిళలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

NEXT PREV

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. వివిధ రంగాల్లో పనిచేస్తోన్న నారీశక్తికి సెల్యూట్ అని ట్వీట్ చేశారు.







మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో పనిచేస్తోన్న నారీశక్తికి నా సెల్యూట్. మహిళా సాధికారతకు ప్రభుత్వం ఎప్పుడూ ముందుటుంది. ఇందుకోసం వివిధ పథకాల ద్వారా కృషి చేస్తోంది. మహిళల గౌరవాన్ని కాపాడేందుకు, అన్ని రంగాల్లో వారికి అవకాశం కల్పించేందుకు మేం కట్టుబడి ఉన్నాం. ఆర్థిక, సామాజిక భద్రత, నాణ్యమైన హెల్త్ కేర్ నుంచి హౌసింగ్ వరకు, విద్య నుంచి పారిశ్రామికి రంగం వరకు భారత అభివృద్ధి ప్రయాణంలో మహిళల పాత్రను పెంచేందుకు ఎంతో కృషి చేస్తున్నాం. భవిష్యత్తులో మరింత కృషి చేస్తాం.                                                               -  ప్రధాని నరేంద్ర మోదీ


నారీశక్తి పురస్కారం


అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నారీశక్తి పురస్కార విజేతలతో ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ముచ్చటించారు. 


సమాజంలో విప్లవాత్మక మార్పులు తీసుకుచ్చేందుకు ప్రయత్నించిన నారీమణులు లేదా సంస్థలకు మహిళా, శిశు మంత్రిత్వ శాఖ ఈ నారీశక్తి పురస్కారాలను ప్రతి ఏడాది అందిస్తోంది.


2020-2021 నారీశక్తి పురస్కారం అవార్డులను కేంద్రం ప్రకటించింది. మొత్తం 28 మందికి నారీశక్తి అవార్డులను ప్రకటించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ అవార్డులను రాష్టప్రతి రాంనాథ్ కోవింద్ అందజేశారు.







Also Read: International Womens Day: రెస్పెక్టెడ్‌ విమెన్‌! ఈక్విటీతోనే ఈక్వాలిటీ - 'ఫండ్లు' కొనండి, డబ్బు పొందండి!


Also Read: Priyanka Narula: చింతకాయతో వరల్డ్‌ ఫేమస్‌, హైదరాబాద్‌ మహిళ వండర్‌ఫుల్ విక్కర్ స్టోరీ

Published at: 08 Mar 2022 01:01 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.