Best Mutual funds for women: షాపింగ్‌ అంటూ ఆడవాళ్లు ఎక్కువగా ఖర్చు చేస్తారని చాలామంది భర్తల కంప్లైంట్‌! బ్యూటీ ప్రొడక్టులు, ఫ్యాషన్‌ యాక్సెసరీస్‌ అంటూ తెగ కొంటుంటారని ఉడుక్కుంటుంటారు! కానీ వారికన్నా ఎక్కువగా మగవాళ్లే డబ్బులు ఖర్చు చేస్తారన్నది ఆర్థిక నిపుణుల మాట! స్త్రీలు తక్కువ మొత్తంలో ఎక్కువ సార్లు కొంటే పురుషులు ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు పెట్టేస్తారట. అందుకే మహిళలకు మ్యూచువల్‌ ఫండ్లలో (Mutual Funds) పెట్టుబడి బెస్ట్‌ అంటున్నారు!


సేవింగ్స్ లో బెస్ట్


ఈ జనరేషన్‌ పిల్లలకు పెద్దగా తెలియదు కానీ! వంటింట్లో పోపుల డబ్బాలో అమ్మ ఎంత పోగేసేదో 30, 40 ఏళ్లవారికి బాగా తెలుసు. పిల్లలడిగితే కాదనుకుండా పదో పరకో చేతిలో పెట్టేవాళ్లు. కొద్ది కొద్దిగా డబ్బులను దాచుకొని ఓ బంగారు నగో, ఇంటికి అవసరమైంది ఇంకేదో కొనేవాళ్లు. అందుకే సేవింగ్స్‌ చేయడంలో వారి తర్వాతే ఎవరైనా అంటున్నారు ఫైనాన్షియల్‌ ఎక్స్‌పర్ట్స్‌. ఇన్‌ప్లేషన్‌ పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో మహిళలు డబ్బు దాచుకోవడమే కాకుండా మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడి పెట్టడం బెస్ట్‌ ఆప్షన్‌గా వారు చెబుతున్నారు.


ఎందుకు పెట్టాలంటే


ప్రతి నెలా సిప్‌ (SIP) కట్టుకోవడం మ్యూచువల్‌ ఫండ్లకున్న గొప్ప ఫీచర్‌. దీర్ఘకాలం ఇలా ప్రతి నెలా జమ చేసుకుంటూ పోతే స్వల్పకాలంలోని మార్కెట్‌ ఆటుపోట్లను సులువుగా దాటేయొచ్చు. పైగా యావరేజింగ్‌ అనేది గొప్పగా ఉపయోగపడుతుంది. ఉదాహరణకు ప్రతి నెలా మ్యూచువల్‌ ఫండ్లలో రూ.10,000 సిప్‌ చేస్తున్నారనుకోండి. ఐదేళ్లకు 36 నెలలు. అంటే రూ.3,60,000 కడతారు. ఇదే సమయంలో 25 శాతంతో ఆ ఫండ్‌ వృద్ధి చెందితే మీచేతికి రూ.10,82,000 అందుతాయి. ఇలాంటి కాంపౌండింగ్‌ ఫ్యాక్టర్‌ (Compounding) సేవింగ్స్‌ (Savings), ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు (Fixed Deposits), రికరింగ్‌ డిపాజిట్లలో మీకు అస్సలు కనిపించదు. మ్యూచువల్‌ ఫండ్లలో రూ.500 నుంచి సిప్‌ చేసుకోవచ్చు. ఈఎల్‌ఎస్‌ఎస్‌ వంటి ఫండ్లలో పెట్టుబడితో మీకు ఆదాయపన్ను భారమూ తగ్గుతుంది.


మ్యూచువల్‌ ఫండ్లు ఎన్ని రకాలు


మ్యూచువల్‌ ఫండ్లు సాధారణంగా మూడు రకాలు. అవి ఈక్విటీ ఫండ్స్‌ (Equity Mutual Funds), హైబ్రీడ్‌ ఫండ్స్‌ (Hybrid Funds), డెట్‌ ఫండ్స్‌ (Debt funds). ఈక్విటీ ఫండ్లలో ఎక్కువ రిస్క్‌ ఉంటుంది. ఎక్కువ ప్రాఫిట్‌ (More risk more profit) వస్తుంది. లాంగ్‌టర్మ్‌ గోల్స్‌కు ఈ ఫండ్లు బాగా సూటవుతాయి. ఉదాహరణకు పిల్లలను పెద్ద చదువులు చదివించడం, పెళ్లి చేయడం, విదేశాలకు పంపించడం, రిటైర్మెంట్‌ నిధి ఏర్పాటు చేసుకోవడానికి అనువుగా ఉంటాయి. హైబ్రీడ్‌ ఫండ్స్‌ అంటే ఈక్విటీ, డెట్‌ సెక్యూరిటీల్లో డబ్బు మదుపు చేస్తారు. ఇందులో కాస్త రిస్క్‌ తక్కువగా ఉంటుంది. రాబడి ఫర్వాలేదు. డెట్‌ ఫండ్స్‌ అంటే మొత్తంగా మనీ మార్కెట్లోనే పెట్టుబడి పెడతారు. రిస్క్‌ చాలా చాలా తక్కువ. ప్రాఫిట్‌ కూడా ఈక్విటీతో పోలిస్తే తక్కువ. కానీ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, రికరింగ్‌ డిపాజిట్ల కంటే ఎక్కువే.


మీకు ఏవి బెస్ట్‌


మీ లాంగ్‌టర్మ్‌ గోల్స్‌ కోసం డబ్బు మదుపు చేయాలంటే కొటక్‌ స్టాండర్ట్‌ మల్టీక్యాప్‌, మిరే అసెట్‌ ఎమర్జింగ్‌ బ్లూచిప్‌ ఫండ్‌ సహా పేరున్న ఏఎంసీల్లో గ్రోత్‌ ఫండ్లను ఎంచుకోవచ్చు. మీడియం టర్మ్‌లో ఫిక్స్‌డ్‌గా రిటర్నులు కావాలంటే డెట్‌, ఈక్విటీ కలిసి హైబ్రీడ్‌ ఫండ్లను ఎంచుకోండి. ఈక్విటీలో నెలకు పదివేల చొప్పున పెట్టుబడికి ఐదేళ్లలో రూ.10 లక్షలకు పైగా వస్తే ఇందులో రూ.7లక్షల వరకు రాబడి ఉంటుంది. స్వల్ప కాలానికి డబ్బు అవసరం అనుకుంటే షార్ట్‌టర్మ్‌ డెట్‌ ఫండ్లలో పెట్టుబడి పెట్టండి. అన్నింటికన్నా ముఖ్యంగా మీ గోల్స్‌కు అనుగుణంగా ఫండ్‌ను ఎంచుకోవడం ముఖ్యం. ఇందుకోసం అవసరమైతే ఎక్స్‌పర్ట్స్‌ను కలవండి.