Ukraine Jaguar Kumar: ఉక్రెయిన్‌పై రష్యా బాంబుతో విరుచుకుపడుతోంది. ఉక్రెయిన్ లో రోజురోజుకూ పరిస్థితులు క్షీణిస్తున్నాయి. లక్షల మంది దేశం విడిచివెళ్తున్నారు. ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయుల కోసం కేంద్రం ఆపరేషన్ గంగ పేరుతో తరలింపు చేపట్టింది. అయితే ఓ తెలుగు వైద్యుడు ఉక్రెయిన్ విడిచి రానంటున్నారు. అందుకు ఓ బలమైన కారణం కూడా చెబుతున్నారు. పది రోజులుగా ఉక్రెయిన్ పై రష్యా సైనిక దాడి చేస్తుంది. సైనికులతో పాటు జనావాసాలపై కూడా రష్యా బాంబులు కురిపిస్తుంది. దీంతో అక్కడి వారంతా భూగర్భ మెట్రో స్టేషన్లు, బంకర్లలలో తలదాచుకున్నారు. చాలా మంది కాలినడకన పోలాండ్, హంగేరీ సరిహద్దులకు చేరుకుంటున్నారు. 






పెంపుడు పులితో బంకర్ లో 


ఉక్రెయిన్‌ (Ukraine)లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఆహారం, నీళ్లు లేకు విద్యార్థులు నానా అగచాట్లు పడుతున్నారు. అయితే ఓ తెలుగు యువకుడు తాను మాత్రం ఉక్రెయిన్ ను వీడేందుకు ఇష్టపడడంలేదు. అందుకు యువకుడు ఓ కారణం చెప్పాడు. తాను ఉక్రెయిన్‌ను వదిలి రాకపోవడానికి ఓ చిరుత పులి కారణం అంటున్నాడు. పెంపుడు పులిని పెంచుకుంటున్నాడు ఆ యువకుడు. ఆంధ్రప్రదేశ్ లోని తణుకుకు చెందిన కుమార్ ఉక్రెయిన్‌లో వైద్యుడుగా పనిచేస్తున్నాడు. యూట్యూబ్‌లో జాగ్వార్ కుమార్‌గా అతని వీడియాలో చాలా వైరల్. కుమార్ కు పులులంటే చాలా ఇష్టం. లంకేశ్వరుడు సినిమాలో మెగాస్టార్ చిరంజీవి చిరుతను పెంచుకోవడం చూసిన కుమార్ తాను కూడా పులిని పెంచుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఉక్రెయిన్ వెళ్లిన కుమార్ అక్కడి ప్రభుత్వం నుంచి అనుమతి పొంది పులిని పెంచుకుంటున్నాడు. ఇక్కడి వరకూ బాగానే ఉంది. తాజాగా ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం ప్రకటించాడు. యుద్ధంతో ఉక్రెయిన్ నుంచి ప్రజలు ఇతర దేశాలకు తరలివెళ్లిపోతున్నారు. కానీ కుమార్ వెళ్లలేని పరిస్థితి నెలకొంది. కుమార్ నివసించే ప్రాంతంలోని వారంతా ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. కుమార్ మాత్రం పులితో కలిసి బంకర్‌లోనే ఉంటున్నాడు.


యుద్ధం తర్వాత పరిస్థితులపై వీడియోలు 


భీకర యుద్ధం జరుగుతున్నా, తాను పెంచుకుంటున్న పులి కోసం ఉక్రెయిన్ లోనే ఉంటానని కుమార్ అంటున్నారు. గ‌త 19 నెల‌లుగా కుమార్ ఈ పులిని పెంచుకుంటున్నాడు. యుద్దం జ‌రుగుతున్న ప్రాంతంలో తానొక్కడినే ఉన్నాన‌ని కుమార్ అంటున్నారు. కుమార్ తన యూట్యూబ్‌ లో వీడియోలు పెట్టాడు. ఈ వీడియోలు నెటిజన్లు, స్నేహితులు ఉక్రెయిన్ వదిలి వచ్చేయాలని కుమార్ కు సూచిస్తున్నారు. యుద్ధం ముగిసిన తర్వాత ఉక్రెయిన్ లోని పరిస్థితులను యూట్యూబ్ అప్‌లోడ్ చేస్తానని కుమార్ అంటున్నాడు.