సెయింట్ లుకస్ చర్చి... శ్రీనగర్‌లో అతి పురాతనమైన చర్చి. క్రిస్మస్ సందర్భంగా 30ఏళ్ల తర్వాత తెరుచుకుంది. దీంతో ఆ పరిసర ప్రాంతాల్లో పండగ వాతావరణం నెలకొంది.
ఉగ్రవాదుల అలజడి కారణంగా 1990లో దీన్ని మూసివేశారు. అక్కడ ఎలాంటి ఉగ్రవాదుల సంచారం లేదని తెలుసుకున్న తర్వాత ఇప్పుడు తెరిచారు.
శ్రీనగర్‌లోని డల్‌గేట్ ఏరియాలో శంకరాచార్య కొండ దిగువ ఉన్న చెస్ట్ ఆసుపత్రి సమీపంలో ఉందీ చర్చి. మంగళవారమే ఈ చర్చిని తెరిచిన అధికారులు... బుధవారం నుంచి భక్తుల దర్శనానికి ప్రార్థనలకు అనుమతి ఇచ్చారు.
దాదాపు శతాబ్ధానికిపైగా చరిత్ర ఉన్న ఈ చర్చిని జమ్ముకశ్మీర్ పర్యాటక శాఖ అభివృద్ధి చేసింది. స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా డెవలప్ చేసింది.
కాస్త మెరుగులు దిద్దిన తర్వాత ఇప్పుడు ఓపెన్ చేశారు. దీన్ని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆన్‌లైన్‌లో ప్రారంభించారని చర్చి నిర్వాహకులు కెన్నడీ డేవిడ్ రాజన్ తెలియజేశారు.
ఈ పురాతన చర్చి తెరుచుకోవడంతో క్రైస్తవుల్లో ఆనందం నెలకొంది. దేవుని ఆశీస్సుల కారణంగానే పురాతనమైన చర్చి క్రిస్మస్ నెలలో ఓపెన్ అయిందని పేర్కొన్నారు.
Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 6,317 మందికి కరోనా.. 213కు చేరిన ఒమిక్రాన్ కేసుల సంఖ్య
Also Read: Divorce: దుబాయ్ రాజు విడాకులు.. భార్యకు భరణం ఎన్ని కోట్లు చెల్లించాలో తెలుసా
Also Read: Goodbye 2021: బైబై బాబు.. చెప్పేముందు ఇక్కడ ఓ లుక్కేయండి.. 2021లోనే తొలిసారి!
Also Read: Omicron Death In US: అమెరికాలో ఒమిక్రాన్‌తో తొలి మరణం నమోదు.. యూఎస్‌లో మొదలైన కలవరం
Also Read: 'ఆర్ఆర్ఆర్' ప్రీరిలీజ్ ఈవెంట్.. గెస్ట్ లుగా చిరంజీవి, బాలకృష్ణ..?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి