దేశంలో కొత్తగా 6,317 కరోనా కేసులు నమోదుకాగా 318 మంది మృతి చెందారు. యాక్టివ్ కేసుల సంఖ్య 78,190కి చేరింది. 6,906 మంది కరోనా నుంచి కోలుకున్నారు. యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 575 రోజుల కనిష్ఠానికి చేరింది. మరోవైపు ఒమిక్రాన్ కేసుల సంఖ్య 213కు చేరింది. 


రికవరీ రేటు 98.4 శాతంగా ఉంది. 2020 మార్చి నుంచి ఇదే అత్యధికం. మరణాల రేటు 1.38 శాతంగా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 0.22గా ఉంది. 2020 మార్చి నుంచి ఇదే అత్యల్పం. కరోనా కేసులు తగ్గుతున్నప్పటికీ ఒమిక్రాన్ కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటివరకు 213 ఒమిక్రాన్ కేసులు నమోదుకాగా 90 మంది డిశ్ఛార్జ్ అయ్యారు.







ఇప్పటివరకు దేశంలో ఒమిక్రాిన్ మరణం నమోదుకాలేదు. ఒమిక్రాన్ వల్ల థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో ప్రభుత్వాలు తగిన ఏర్పాట్లు చేస్తున్నాయి.</p


వ్యాక్సినేషన్..






దేశంలో టీకా పంపిణీ వేగంగా సాగుతోంది. మంగళవారం 57,05,039 మందికి టీకాలు అందించారు. ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,38,95,90,670కి చేరింది.


కీలక ఆదేశాలు..


దేశంలో ఒమిక్రాన్ తీవ్రత పెరుగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. వ్యాప్తిని కట్టడి చేసేందుకు అవసరమైతే నైట్ కర్ఫ్యూ విధించాలని స్పష్టం చేసింది.


ఒమిక్రాన్ కట్టడి కోసం వార్ రూమ్‌లు ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. డెల్టా కంటే ఒమిక్రాన్ మూడు రెట్లు అధికంగా వ్యాప్తి చెందుతోందని కేంద్రం గుర్తు చేసింది. కేసుల సంఖ్య మరింత పెరిగితే కంటైన్‌మెంట్ జోన్లు, రాత్రి కర్ఫ్యూలు వంటి ఆంక్షలు అమలు చేయాలని సూచించింది.


Also Read: YouTube Channels Blocked: పాకిస్తాన్‌కు భారీ షాక్.. 20 యూట్యూబ్ ఛానెళ్లు, వెబ్‌సైట్స్ బ్లాక్ చేసిన కేంద్ర ప్రభుత్వం


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి