అనంతపురం జిల్లా కేంద్రం నుండి సుమారు 55 కిలో మీటర్ల దూరంలో ఉన్న శ్రీ చింతల వెంకట రమణ స్వామి వారి దేవాలయం తాడిపత్రి పట్టణంలో వెలసింది. ఈ ఆలయం అక్కడి భక్తుల చింతలను తీర్చే దేవస్థానంగా భక్తులు నమ్ముతారు. 


క్రీ. శ 16వ శతాబ్దంలో శ్రీ కృష్ణ దేవరాయల కాలంలో గండికోటను కేంద్రంగా చేసుకొని పరిపాలించే పెమ్మసాని వంశీకులలో ఒకరైన తిమ్మ నాయుడు అనే పాలేగాడు, శ్రీ కృష్ణ దేవరాయల అనుమతితో ఈ దేవాలయాన్ని నిర్మించారని చరిత్ర ఆధారాలు తెల్పుతున్నాయి. భక్తులకు వుండే చింతలన్ని తీర్చే రాయుడు కనుక చింతల రాయుడని అంటారు. తిమ్మ నాయుని స్వప్నంలో స్వామి వారు కనిపించి నాకు ఆలయాన్ని నిర్మించమని ఆదేశించాడని చింతవనంలో వెలసిన స్వామి కనుక శ్రీ చింతల వెంకట రమణ స్వామి అని ఆలయానికి పేరు వచ్చింది. ఈ ఆలయంలోకి రాజ గోపురం నుండి లోపలికి ప్రవేశించిన వెంటనే బలిపీఠము, ధ్వజస్తంభం, రాతి రథం మనకు కనిపిస్తాయి. ఈ రాతి రథంలో శ్రీ గారుడ ఆళ్వార్లు శ్రీవారికి అభిముఖంగా అంజలి ఘటిస్తూ దర్శనమిస్తారు.


ఈ ఆలయంలో ప్రతి ఏటా మాఘ శుద్ధ ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి ఈ మూడు దినాలలో సూర్యుడు ఉదయించిన వెంటనే లేత కిరణాలు ఈ రాతి రథంలో ఉన్న రెండు రంద్రాల గుండా లోనికి ప్రవేశించి, గర్భాలయంలో ఉన్న శ్రీవారి పాదాలను తకుతాయి. ఈ సమయంలో శ్రీ వారిని దర్శించుకోవడం అత్యంత పుణ్య దాయకం. శ్రీ వారి పాదాలకు సూర్య భగవానుడు పూజ చేస్తున్నాడు గనుక ఈ క్షేత్రానికి మరొక పేరు భాస్కరక్షేత్రం అని కూడా పిలుస్తారు.


స్వామి వారు తూర్పునకు అభిముఖంగా చతుర్భుజాలతో, శంఖ, చక్ర, వరద, కటిక హస్తలతో జనులను కటాక్షిస్తూ దర్శనమిస్తారు. అంతేగాక, ఈ దేవాలయం అన్ని హంగులతో కూడిన అనేక మండపాలతో నిర్మితమైఉన్నది. గర్భ గుడి, అర్ధ మండపం, రంగ మండపం, కళ్యాణ మండపం, ఏకాంత మండపం మరియు స్వామి వారికి ఎడమవైపున శ్రీ ఆనందవల్లి  తాయర్ల సన్నిధి, ఈ సన్నిధి ముందు భాగాన మూడు వరుసలతో కూడిన తామర పుష్పం చూపురులను అట్టే కట్టేస్తుంది.


ఈ తామర పుష్పం తిప్పితే తిరిగే తట్లు మలచడం ఆ నాటి శిల్పుల నైపుణ్యం, వారి మేధస్సుకు నిదర్శనంగా నిలుస్తోంది. ఆలయ ప్రాకారంలో శ్రీ ఆంజనేయ, శ్రీ భూవరాహ శ్రీ లక్ష్మీ చెన్నకేశవ, ఆళ్వార్లు, శ్రీమత్ భగవత్ రామానుజులవారు, శ్రీ వేదాంత దీక్షితులవారు, శ్రీఅశ్వర్థ వృక్షం, శ్రీ తులసి కోట ఈ విధంగా సంప్రదాయంగాను చాలా విశేషంగాను నిర్మించబడింది. శ్రీవారి గర్భాలయ బయట ప్రాకార గోడలయందు, శ్రీమద్రామాయణం, శ్రీ మద్ భాగవతం, శ్రీ దశావతారములు గట్టాలు ఎంతో సున్నితముగా కడురమ్యముగా చెక్కారు. శ్రీ దశరథ మహారాజు పుత్రకామేష్టియాగం మొదలు సీతాదేవి అగ్ని ప్రవేశం వరకు మూడు వరుసలుగా మలిచారు.




ఎంతో శిల్ప శోభితమైన ఈ ఆలయం ఎంతో చరిత్ర గలిగిన, శిల్పసంపదగలిగిన, ఆధ్యాత్మికంగా వెలసిన ఈ ఆలయాన్ని నలుమూలల నుండి భక్తులు వచ్చి దర్శించుకుంటారు. ప్రతి ఏటా స్వామి వారికి అశ్వయుజ మాసంలో బ్రహ్మోత్సవాలు, పవిత్రోత్సవాలు, ధనుర్మాస పూజలు అన్ని పర్వ దినములలో, కార్తీక మాసంలో ఆకాశ దిపోత్సవాలు విశేషంగా ఉత్సవాలు జరుపుతారు. స్వామి వారికి ప్రతి ఏటా ఆశ్వయుజమాసంలో బ్రహ్మోత్సవాలు, ధనుర్మాసంలో మొదలగు విశేషంగా ఉత్సవాలు జరుపుతారు.


lso Read: శీతాకాలం.. మంచు కురిసే సమయం.. ఈ రాశుల వారికి భలే ఇష్టమట!
Also Read: ఈ రాశులవారు మహా తెలివైనోళ్లు.. వ్యూహాలు రచిస్తే తిరుగులేదు...
Also Read: 2022 ఈ నాలుగు రాశుల వారికి కొత్తకొత్తగా ఉంటుంది, చాలా సమస్యల నుంచి రిలీఫ్ పొందుతారు..
Also Read: 2022 లో ఈ నాలుగు రాశులవారి ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందంటే...


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి