ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పార్టీలన్నీ బిజీబిజీగా ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తరువాతి 10 రోజుల్లో 7 సార్లు ఉత్తర్‌ప్రదేశ్ రానున్నారు. దీన్ని బట్టి యూపీ ఎన్నికలపై భాజపా ఏ మేరకు దృష్టి సారించిందో అర్థం చేసుకోవచ్చు. ఈ నెల 24న ప్రయాగ్‌రాజ్ నుంచి అమిత్ షా యూపీ టూర్ మొదలుకానుంది. జనవరి 4 వరకు ఈ పర్యటన ఉంది.


ఇదే షెడ్యూల్..


జనవరి మొదటి వారంలో అమిత్ షా.. అయోధ్యకు వెళ్లనున్నారు. రామలల్లాను దర్శించనున్నారు. అనంతరం అయోధ్యలో రోడ్‌షో నిర్వహించనున్నారు. మొత్తం ఉత్తర్‌ప్రదేశ్‌ టూర్‌లో 21 బహిరంగ సభలు, మూడు రోడ్‌ షోల్లో అమిత్ షా పాల్గొననున్నారు. బరేలీ, అయోధ్య, గోరఖ్‌పుర్‌లో ఈ రోడ్‌ షోలు జరగనున్నాయి.


140..


ఉత్తర్‌ప్రదేశ్‌లోని 140 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అమిత్ షా పర్యటన జరగనుంది. ఒక్కో సమావేశంలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేయనున్నారు. ఇందులో మూడు ఓబీసీ అసెంబ్లీ నియోజకవర్గాలు, 2 అర్బన్ ప్రాంతాలు, ఒక షెడ్యూల్డ్ కేస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్, ఒక ముస్లిం మెజారిటీ నియోజకవర్గాలు ఉన్నాయి. 


చాణక్యుడు..


పర్యటన చివరి మూడు రోజుల్లో మూడు రోడ్‌ షోలు జరగనున్నాయి. 2014 లోక్‌సభ ఎన్నికల సమయంలో అమిత్ షా.. ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రానికి ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. 80 లోక్‌సభ స్థానాలున్న ఉత్తర్‌ప్రదేశ్‌లో 71 స్థానాలు గెలిచింది భాజపా. అనంతరం 2017లో జరిగిన ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో 403 స్థానాలకు గాను భాజపా 325 చోట్ల గెలిచింది. ఆ సమయంలో అమిత్ షా.. భాజపా జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు.


2019 లోక్‌సభ ఎన్నికల్లో భాజపా 62 స్థానాల్లో గెలుపొందింది. ఎస్‌పీ-బీఎస్‌పీ-ఆర్‌ఎల్‌డీ కూటమి, కాంగ్రెస్‌ను ఓడించింది భాజపా.


తాజా సర్వే..


ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీకి 212- 224 సీట్ల మధ్య లభించే అవకాశం ఉందని తాజా ఏబీపీ- సీఓటర్ సర్వేలో తేలింది. యూపీలో మొత్తం అసెంబ్లీ స్థానాలు 403. 40శాతం ఓట్లు బీజేపీ ఖాతాలో పడే అవకాశం ఉంది. ఈ కారణంగా బీజేపీకి సాధారణ మెజార్టీ రావడం ఖాయంగా కనిపిస్తోంది. గట్టి పోటీ ఇస్తున్న సమాజ్ వాదీ పార్టీ 151 నుంచి 163 స్థానాలు లభించే అవకాశం ఉంది. ఆ పార్టీ మిత్రపక్షాలతో కలిసి 34 శాతం ఓట్లను కైవసం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. 


ఇక గతంలో అధికారం చేపట్టిన బహుజన సమాజ్ పార్టీ పరిస్థితి ఏమంత బాగోలేదని తేలింది. ఆ పార్టీకి కేవలం 13 శాతం ఓట్లు 12 నుంచి 24 మాత్రమే అసెంబ్లీ సీట్లు వస్తాయని ఏబీపీ-సీ ఓటర్ సర్వేలో తేలింది. ఇక ప్రియాంకా గాంధీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం చేస్తున్ా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏ మాత్రం మెరుగుపడటం లేదు. 2 నుంచి పది అసెంబ్లీ సీట్లు మాత్రమే ఆ పార్టీకి లభించే అవకాశాలు ఉన్నాయి. ఏడు శాతం ఓట్లు సాధించనుంది. 


Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 6,317 మందికి కరోనా.. 213కు చేరిన ఒమిక్రాన్ కేసుల సంఖ్య


Also Read: YouTube Channels Blocked: పాకిస్తాన్‌కు భారీ షాక్.. 20 యూట్యూబ్ ఛానెళ్లు, వెబ్‌సైట్స్ బ్లాక్ చేసిన కేంద్ర ప్రభుత్వం


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి