భారత స్టాక్‌ మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభపడ్డాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు దిగడంతో చక్కని ర్యాలీ కొనసాగింది. మదుపర్ల సంపదగా భావించే బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 611 పాయింట్లు లాభపడగా ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 16,900 పైన ముగిసింది.


క్రితం రోజు 56,319 వద్ద ముగిసిన సెన్సెక్స్ నేడు 56,599 వద్ద ఆరంభమైంది. మార్కెట్లో సానుకూల సెంటిమెంట్‌ ఉండటంతో మదుపర్లు కొనుగోళ్లకు దిగారు. దాంతో 56,989 వద్ద సూచీ ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. 56,471 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకున్న సూచీ చివరకు 611 పాయింట్లతో 56,930 వద్ద ముగిసింది.


మంగళవారం 16,770 వద్ద ముగిసిన నిఫ్టీ నేడు 16,865 వద్ద మొదలైంది. 16,971 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. క్రమంగా 16,819కు చేరుకున్న సూచీ ఇంట్రాడే కనిష్ఠాన్ని అందుకుంది. చివరికి 184 పాయింట్ల లాభంతో 16,955 వద్ద ముగిసింది.







నిఫ్టీ బ్యాంక్‌ 421 పాయింట్లు లాభపడింది. ఉదయం 34,865 వద్ద ఆరంభమైన సూచీ 35,112 వద్ద గరిష్ఠాన్ని అందుకుంది. 36,687 వద్ద కనిష్ఠాన్ని తాకి చివరికి 35,029 వద్ద ముగిసింది.


నిఫ్టీలో హిందాల్కో, టాటా మోటార్స్‌, దివిస్‌ ల్యాబ్‌, ఐచర్‌ మోటార్స్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ లాభపడ్డాయి. ఎస్‌బీఐ లైఫ్‌, విప్రో, గ్రాసిమ్‌, అదానీ పోర్ట్స్‌, ఎన్‌ఈఎస్‌టీ నష్టపోయాయి.  అన్ని రంగాల సూచీలూ గ్రీన్‌లోనే ముగిసియగా ఆటో, బ్యాంక్‌, రియాలిటీ, క్యాపిటల్‌ గూడ్స్‌, ఫార్మా, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, పవర్‌, మెటల్‌ సూచీలు 1-3 శాతం వరకు పెరిగాయి.







Also Read: New Online Payment Rules: జనవరి 1 నుంచి ఆన్‌లైన్ పేమెంట్‌ నిబంధనల్లో మార్పు.. తెలియకపోతే కష్టం!


Also Read: Joker Malware Apps: మీకు తెలియకుండానే మీ డబ్బు కొట్టేస్తున్న జోకర్‌ మాల్వేర్‌.. వెంటనే ఈ 7 యాప్స్‌ డిలీట్‌ చేయండి


Also Read: Snapdeal IPO: ఐపీవోకు స్నాప్‌డీల్‌.. రూ.1250 కోట్ల సమీకరణకు ముసాయిదా దాఖలు