Sharad Pawar on Eknath Shinde: మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వంపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) అధినేత శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో 6 నెలల్లో షిండే సర్కార్ కూలిపోతుందని పవార్ అన్నారు. ముంబయిలో పార్టీ శాసనసభ్యులతో జరిగిన సమావేశంలో పవార్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఆరు నెలలే
షిండే ఏర్పాటు చేసిన ఈ ప్రభుత్వంలో ఉన్న శివసేన రెబల్ ఎమ్మెల్యులు తిరిగి ఉద్ధవ్ ఠాక్రే వద్దకు చేరతారని పవార్ అభిప్రాయపడ్డారు. మధ్యంతర ఎన్నికలకు 6 నెలలే ఉన్నందున ఎన్‌సీపీ సభ్యులు వీలైనంతగా తమ తమ నియోజకవర్గాల్లో ఎక్కువ సమయం తిరగాలని పవార్ దిశానిర్దేశం చేశారు.
లడ్డూలు ఇవ్వలేదు
ఎన్నో ప్రభుత్వాల ఏర్పాటులో భాగస్వామిగా ఉన్నా, ముఖ్యమంత్రిగా ఎన్నికైనా ఏనాడు తనకు గవర్నర్ లడ్డూలు ఇవ్వలేదని పవార్ అన్నారు. కానీ ప్రస్తుత గవర్నర్‌కే ఆ రికార్డ్ దక్కుతుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
బలపరీక్షలో గెలుపు
మరోవైపు మహారాష్ట్ర అసెంబ్లీలో జరిగిన బలపరీక్షలో ఏక్‌నాథ్ షిండే సర్కార్ గెలిచింది. ఏక్‌నాథ్ నేతృత్వంలోని సర్కార్‌కు 164 మంది ఎమ్మెల్యేలు మద్దతు పలికారు.
బలపరీక్ష గెలవాలంటే 144 మంది మద్దతు ఉంటే సరిపోతుంది. అయితే షిండే సర్కార్‌కు 164 మంది శాసనసభ్యులు మద్దతు ఇచ్చారు. 99 మంది షిండే సర్కార్‌కు వ్యతిరేకంగా ఓటు వేయగా మరో ముగ్గురు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు.
Also Read: Maharashtra Floor Test Result: బలపరీక్షలో ఏక్‌నాథ్ షిండే సర్కార్ గెలుపు
Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 16,135 కరోనా కేసులు- 24 మంది మృతి