Maharashtra Floor Test Result: బలపరీక్షలో ఏక్‌నాథ్ షిండే సర్కార్ గెలుపు

Maharashtra Floor Test Result: మహారాష్ట్ర అసెంబ్లీలో ఏక్‌నాథ్ షిండే సర్కార్ బలనిరూపణ చేసుకుంది.

Continues below advertisement

Maharashtra Floor Test Result: మహారాష్ట్ర అసెంబ్లీలో జరిగిన బలపరీక్షలో ఏక్‌నాథ్ షిండే సర్కార్ గెలిచింది. ఏక్‌నాథ్ నేతృత్వంలోని సర్కార్‌కు 164 మంది ఎమ్మెల్యేలు మద్దతు పలికారు. 

Continues below advertisement

బలపరీక్ష గెలవాలంటే 144 మంది మద్దతు ఉంటే సరిపోతుంది. అయితే షిండే సర్కార్‌కు 164 మంది శాసనసభ్యులు మద్దతు ఇచ్చారు. 99 మంది షిండే సర్కార్‌కు వ్యతిరేకంగా ఓటు వేయగా మరో ముగ్గురు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు.

మహా సీఎంగా

శివసేన రెబల్ నేత ఏక్​నాథ్ షిండే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇటీవల ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ సమక్షంలో ఆయన సీఎంగా ప్రమాణం చేశారు. భాజపా నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్.. ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.

అంతకుముందు భారీ ట్విస్టులు, నాటకీయ పరిణామాల మధ్య ముఖ్యమంత్రి పదవిని దక్కించుకున్నారు ఏక్​నాథ్ షిండే. మహా వికాస్ అఘాడీ సర్కారుపై తిరుగుబాటు చేసి.. ప్రభుత్వం కుప్పకూలేలా చేసిన ఆయన.. భాజపాతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకొచ్చారు. అనూహ్యంగా షిండేను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎంపిక చేసినట్లు ఫడణవీస్ సంచలన ప్రకటన చేశారు.

తాను ప్రభుత్వంలో భాగం కాబోనని తొలుత ఫడణవీస్ ప్రకటించారు. అయితే భాజపా హైకమాండ్ కోరిక మేరకు ఉప ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. మహారాష్ట్ర ప్రజలకు సేవ చేసేందుకు ఫడణవీస్ డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారని అమిత్ షా ట్వీట్ చేశారు.

Also Read: Sharad Pawar on Eknath Shinde: '6 నెలల్లో కూలిపోతుంది'- షిండే సర్కార్‌పై పవార్ సంచలన వ్యాఖ్యలు

Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 16,135 కరోనా కేసులు- 24 మంది మృతి

Continues below advertisement