Corona Cases: దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కొత్తగా 16,135 కరోనా కేసులు నమోదయ్యాయి. 24 మంది మృతి చెందారు. తాజాగా 13,958 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
రికవరీ రేటు 98.54 శాతానికి చేరింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 0.26 శాతం ఉన్నాయి.
- డైలీ పాజిటివిటీ రేటు: 4.85 శాతం
- మొత్తం మరణాలు: 5,25,223
- యాక్టివ్ కేసులు: 1,13,864
- మొత్తం రికవరీలు: 4,28,79,477
వ్యాక్సినేషన్
దేశంలో కొత్తగా 1,78,383 మందికి టీకాలు అందించారు. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,97,98,21,197కు చేరింది. మరో 3,32,978 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.
కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్రం.. రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. కరోనా నిబంధనలను తప్పకుండా పాటించేలా చూడాలని తెలిపింది. కరోనా టెస్టులను పెద్ద ఎత్తున నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. మాస్కులు తప్పనిసరిగా వినియోగించాలని కోరింది. మరోవైపు వ్యాక్సినేషన్ కార్యక్రామాన్ని కూడా వేగంగా కొనసాగించాలని నిర్ణయించింది కేంద్ర ఆరోగ్య శాఖ
కరోనా ఫోర్త్ వేవ్ వచ్చే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే పలు రిపోర్ట్‌లు వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో భారత్‌లో కూడా ఫోర్త్ వేవ్ వచ్చే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Also Read: PM Modi Message: హిందూయేతర వర్గాలపైనా దృష్టి సారించండి, నేతలకు ప్రధాని మోదీ సూచనలు
J&K Terrorists: ఈ ఊరి వాళ్ల ధైర్యం చూశారా, మోస్ట్‌వాంటెడ్ టెర్రరిస్టులనే పట్టుకుని బంధించారు